Bigg Boss 10 Dakshi:బిగ్ బాస్ సీజన్ 10 ఏడవ వారంలో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా దక్షి గుత్తికొండ (Dakshi guttikonda)ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఐదవ వారం అడుగుపెట్టిన ఈమె ఏడవ వారమే ఎలిమినేట్ అవ్వడంతో ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే రెండు వారాలపాటు హౌస్ లో ఉన్న దక్షి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఐదవ వారం అడుగుపెట్టిన దక్షి.. వారానికి సుమారుగా 2.5 లక్షల ఒప్పందంతో హౌస్ లోకి వచ్చింది. అయితే ఏడవ వారం ఆమె ఎలిమినేట్ అయింది ..హౌస్ లో రెండు వారాలు ఉన్నందుకు షో నుండి ఈమెకు సుమారుగా 5 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ లభించినట్లు సమాచారం. మొత్తానికైతే రెండు వారాలకు గాను ఐదు లక్షలు తీసుకొని దక్షి హౌసును వీడింది.
ఇకపోతే దక్షిను ఎలిమినేట్ చేసినట్లు విడుదల చేసిన ప్రోమోలో దక్షి మాట్లాడుతూ.. హౌస్ మేట్స్ కి కొన్ని ట్యాగ్స్ తగిలించింది. హౌస్ ని అబ్జర్వ్ చేశావు కదా ఐదుగురిని పిక్ చేసి ఇక్కడ ఉన్న వాటికి కరెక్ట్ గా సరిపోయేలా మ్యాచ్ చేసి చెప్పు అని హోస్ట్ నాగార్జున తెలిపారు. ఇక మొదట శ్వేతా గురించి మాట్లాడుతూ.. నువ్వు నాలాగే ఉంటే త్వరగా ఇక్కడికి వచ్చేస్తావు.. కాబట్టి గేమ్ పై కాన్సెంట్రేట్ చెయ్యి అంటూ తెలిపింది. ఎవరి నోరు కంట్రోల్ లో ఉండాలి అని నాగార్జున చెబుతుండగానే.. దక్షి పేరు చెప్పకుండానే షాలిని పైకి లేచి నిలబడింది. ఇక యూజ్ యువర్ బ్రెయిన్ కి రోహిత్ సరిపోతాడంటూ చెప్పింది దక్షి. మనసుతో కాదు బ్రెయిన్ తో ఆడు.. దానివల్ల మీ ఆట డౌన్ అయ్యింది అనేది నా అభిప్రాయం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇక అలాగే ఎక్కువగా అబ్జర్వ్ చేయాలని అమన్ కి చెప్పిన ఈమె.. ఫస్ట్ ఇతరులు చెప్పేది వినమని నీతూకి చెప్పింది. అలా హౌస్ లో ఉండే వాళ్ల గురించి తన అభిప్రాయాలను చెప్పింది.
also read:రణబాలి ఎఫెక్ట్.. ‘మైసా’పై భారీ బజ్.. రంగంలోకి బిగ్ డిస్ట్రిబ్యూటర్స్!
తాజాగా దక్షి ఎలిమినేట్ అవ్వడంతో మిగిలిన ఆరుగురిలో ఇంకొక ఎలిమినేషన్ ఉంటుందనే విషయం ప్రోమో ద్వారా వెల్లడించారు. అయితే ఆ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా షాలిని వెళ్లిపోతోంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వారం ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.