E-Paper
Advertisement

రణబాలి ఎఫెక్ట్.. ‘మైసా’పై భారీ బజ్.. రంగంలోకి బిగ్ డిస్ట్రిబ్యూటర్స్!

రణబాలి ఎఫెక్ట్.. ‘మైసా’పై భారీ బజ్.. రంగంలోకి బిగ్ డిస్ట్రిబ్యూటర్స్!
Advertisement

Rashmika Mandanna Mysaa: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గానే కాకుండా ఫేవరెట్ హీరోయిన్గా అందరి దృష్టిని ఆకట్టుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. వివాహం తర్వాత మరింత జోరు పెంచిన ఈమె తన భర్త విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి చేసిన తొలి చిత్రం రణబాలి. ఇందులో జయమ్మ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. యువతను మొదలుకొని మహిళల వరకు అందరి ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంది. అలాంటి జయమ్మ ఇప్పుడు నటిస్తున్న మరో చిత్రం మైసా. భారీ అంచనాల మధ్య నవంబర్ 27వ తేదీన పలు భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం రష్మిక చాలానే కష్టపడుతోంది.

మైసా కోసం రంగంలోకి బిగ్ డిస్ట్రిబ్యూటర్స్..

8 గంటలపాటు నీళ్లలోనే యాక్షన్ సన్నివేశాలలో నటిస్తూ.. చెప్పులు లేకుండా పర్వతారోహణ చేసి.. సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఈమె ఎంతలా కష్టపడిందో.. ఆ కష్టాన్ని తెరపై చూడడానికి ఆడియన్స్ అంతే ఆసక్తి కనబరిస్తుండగా.. మరొకవైపు రణబాలి ఎఫెక్ట్ ఈ సినిమాపై మరింత పడిందనే చెప్పాలి . జయమ్మగా అదరగొట్టేసిన రష్మిక మందన్న ఇందులో గోండు జాతి అమ్మాయిగా ఇంకెలా నటించబోతుందో చూడాలనే ఆత్రుత అందరిలో నెలకొంది. ఆ ఆతృతే ఇప్పుడు బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ ని రంగంలోకి దింపేలా చేసిందని చెప్పవచ్చు.

నైజాం – ఆంధ్ర హక్కులు దక్కించుకున్న దిల్ రాజు..

Advertisement

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రణబాలిలో జయమ్మగా అలరించిన రష్మిక మందన్న మైసాలో భీకరమైన పాత్రలో కనిపించనుంది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇకపోతే విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఏరియా వైజ్ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత , పంపిణీదారు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా పంపిణీ హక్కులను నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలలో దక్కించుకున్నారు. ఇది చిత్ర బృందానికి సానుకూల పరిణామం అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లు సినిమాపై అంచనాలు పెంచగా.. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎంపిక మరింత హైప్ క్రియేట్ చేసింది.

also read: జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

ఓవర్సీస్, నార్త్ ఇండియా, నేపాల్ పంపిణీ హక్కులు ఎవరికంటే?

Advertisement

ఇకపోతే ఈ సినిమాను నార్త్ ఇండియా అలాగే నేపాల్ లో ఏ ఏ ఫిలిమ్స్ పంపిణీ చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ దక్కించుకుంది. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ ఒప్పందాల ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 15 కోట్లకు చేరడం గమనార్హం. ఇక ఈ సినిమాకి జోక్స్ బెజోయ్ సంగీతం అందించగా.. రావు రమేష్, ఈశ్వరి రావు, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మైసా చిత్రంలో రష్మిక ఏ విధంగా తన పాత్రతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

నాని ది ప్యారడైజ్ మూవీకి మహేష్ కొడుకు గౌతమ్ రేటింగ్..ఇంత దారుణమా?

ధనుష్ పొలిటికల్ మీటింగ్.. 3000 మంది మహిళా ప్రతినిధులతో!

ఫౌజీ మూవీపై ట్రోల్స్.. నందమూరి హీరో మూవీతో పోలుస్తూ!

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

Big Stories

Advertisement
×