E-Paper
Advertisement

నన్ను రెచ్చగొట్టద్దు… సైలెంట్ గా వారికి వార్నింగ్ ఇచ్చిన డెమోన్ పవన్… ఆపేస్తే బెటర్ అంటూ!

నన్ను రెచ్చగొట్టద్దు… సైలెంట్ గా వారికి వార్నింగ్ ఇచ్చిన డెమోన్ పవన్… ఆపేస్తే బెటర్ అంటూ!
Advertisement

Demon Pawan: డెమోన్ పవన్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సీజన్ 9 కార్యక్రమంలో పాల్గొని టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ ఈ కార్యక్రమం అనంతరం ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. డెమోన్ పవన్ (Demon Pawan)ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈయన రీతు చౌదరితో కలిసి బీబీ జోడి సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుక్ విత్ జాతి రత్నాలు 2లో డెమోన్…

ఇక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కాబోతున్న కుక్ విత్ జాతి రత్నాలు 2 కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది ఇలా పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ పవన్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న పవన్ ఇండస్ట్రీలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ కామన్ మ్యాన్ క్యాటగిరిలో అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం సెలబ్రిటీగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం అనేది సర్వసాధారణం.

నాలో ఉన్న డెమోన్ బయటకు వస్తే తట్టుకోలేరు..

Advertisement

ఈ నేపథ్యంలోనే పవన్ గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై మొదటిసారి ఈయన స్పందిస్తూ తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తప్పు చేయకపోయినా కొన్ని విషయాలలో చాలా మౌనంగా ఉంటున్నాను. తన తప్పు లేకపోయినా కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాను. అయితే ఈ వ్యతిరేకత నా వాళ్ళ మీదకు వెళ్లి నన్ను రెచ్చగొట్టి నాలో దాగి ఉన్న మరో డెమోన్ మాట్లాడితే మీరు తట్టుకోలేరు. చాలామంది నాపై విమర్శలు చేసిన మౌనంగా ఉండడానికి కారణం ఏదో ఒక రోజు వారి తప్పును తెలుసుకుంటారనే సైలెంట్ గా ఉన్నానని తెలిపారు.

Advertisement

ఇకనైనా ఇలాంటి వాటిని పక్కన పెడితే బాగుంటుంది మంచి వాళ్లకు నేను మంచివాడిని చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని అన్న ఉద్దేశంతో ఈయన సోషల్ మీడియా వేదికగా తన గురించి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారికి తనదైన స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తూ పవన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు కామెంట్లు చేస్తూ నువ్వెలాంటి వ్యక్తి అనేది మాకు తెలుసు అలాంటి వారందరిని పట్టించుకోకండి అంటూ ఈయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక పవన్ త్వరలోనే ప్రారంభం కానున్న కుక్ విత్ జాతి రత్నాలు 2 ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×