Kumari Aunty: కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు .ఈమె జీవనాధారం కోసం హైదరాబాద్లోనే హైటెక్ సిటీ ప్రాంతంలో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. రోడ్డు పక్కన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతూ భారీ సంపాదన అందుకుంటున్నారు. 2011వ సంవత్సరం నుంచి ఈ బిజినెస్ ప్రారంభించిన కుమారి ఆంటీ గత రెండు మూడు సంవత్సరాలు నుంచి ఎంతో పాపులర్ అయ్యారు. ఎంతోమంది యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి వీడియోలు తీయడంతో కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఒకానొక సమయంలో కుమారి ఆంటీ వద్ద ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అంటే ఈమెకు ఎలాంటి పాపులారిటీ ఉందో స్పష్టం అవుతుంది. ఇలా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఒకానొక దశలో ఈమె ఫుడ్ స్టాల్ తీసేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరువుతో తిరిగి ఈమె తన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నారు. ఇలా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈమె నెలకు లక్షల్లో ఆదాయం అందుకుంటున్నారని భారీ స్థాయిలో ఆస్తులు కూడ పెట్టారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ వార్తల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ అసలు విషయాన్ని వెల్లడించారు. ప్రతిరోజు చాలా రకాల ఐటమ్స్ తయారు చేయడంతో తనకు ఖర్చు కూడా బాగా వస్తుందని ఈమె తెలిపారు. అలాగే తన వద్ద పనిచేస్తున్న వారికోసం కూడా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఇలా ఈ ఖర్చులన్నీ పోను రోజుకు 4 లేదా 5 వేల రూపాయలు మాత్రమే తనకు మిగులుతుందని కుమారి ఆంటీ తెలియజేశారు. ఇంతకుమించి తాను పెద్దగా సంపాదించుకోలేదని అందరూ అనుకున్నట్టు లక్షల్లో ఆదాయం లేదని ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇలా కుమారి ఆంటీ ఖర్చులు అన్నీ పోను నెలకు 5000 వరకు మిగులుతుంది అని చెప్పడంతో ఈ ప్రకారం లెక్కలేసుకున్న నెలకు 1.5 లక్షల రూపాయలు సంపాదిస్తుందని చెప్పాలి.
యూట్యూబ్ ఛానల్ ద్వారా అదనపు ఆదాయం..
ఇలా ఫుడ్ బిజినెస్ ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ పిల్లల చదువులు ఇంటి ఖర్చులకే సరిపోతుందని అందరూ అనుకున్నట్టు తాను ఆస్తులు కూడ బెట్టలేదని కుమారి ఆంటీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో దాసరి కుమారి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు తన వంటలకు సంబంధించిన వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కుమారి ఆంటీ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పాలి.
Also Read: Dacoit Trailer: అడివి శేష్ విధ్వంసం..ఆకట్టుకున్న డెకాయిట్ ట్రైలర్ ..