E-Paper
Advertisement

Murali Babai: చిరంజీవిని కలిసిన కష్టాలు తీరలేదా బాబాయ్.. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు..

Murali Babai: చిరంజీవిని కలిసిన కష్టాలు తీరలేదా బాబాయ్.. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు..
Advertisement

Murali Babai: టాలెంట్ ని నిరూపించుకోవడానికి వయసు అడ్డురాదు. హీరో పై తమకున్న అభిమానం వయసుని గుర్తు చేయట్లేదు అని చాలామంది స్టేజీల మీద డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతున్నారు. ఈమధ్య ఇలాంటి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ఎక్కువయ్యాయి. అందులో రీసెంట్ గా మురళి బాబాయ్ డాన్స్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంది. లేటు వయసులో అయినా సరే ఆయన అచ్చం చిరంజీవిలాగే చేశారని ప్రశంసలు అందుకున్నారు. ఒక్క పర్ఫామెన్స్ తో జనాలను తన వైపు తిప్పుకున్నాడు మురళి బాబాయ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఇదే. అచ్చం చిరంజీవి గారి లాగా డాన్స్ చేశారని అందరూ ఆయన పై ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవలే చిరంజీవిని కలిసిన ఈయన ఆనందానికి అవధులు లేవు. తన అభిమాన హీరోని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని పలు ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. అందులో తన పేదరికాన్ని బయటపెట్టాడు.. తాను ఎదుర్కొంటున్న కష్టాలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అసలా ఇంటర్వ్యూలు ఆయన ఏం చెప్పారు? ఆయన జీవితంలో అనుకొని సంఘటనలు ఏవో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

భార్య, తల్లి ఇద్దరు చనిపోయారు..

ఒక్క పెర్ఫార్మన్స్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బుల్లితెరపై సక్సెస్ఫుల్గా ఒకసారి నవ్వుతున్న డాన్స్ షో ఢీ.. ఈ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. కొంతమంది డాన్సర్లుగా తమ కెరీర్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఈ షో స్టేజ్ మీద తన టాలెంట్ ని నమ్ముకుని అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు మురళి బాబాయ్.. ఈయన గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన… తన జీవిత కష్టాలను పంచుకున్నారు. స్టేజ్ మీద డ్యాన్స్ లు వేస్తూ వస్తున్నా ఈ బాబాయ్ జీవితం కన్నీళ్ళ మయం.. గతంలో అనుకోకుండా భార్య మరణం, వెంటనే తల్లి మరణం.. ఈ రెండు ఘటనలతో జీవితంలో కన్నీళ్లు మిగిలాయి.

Advertisement

Also Read : ‘నిన్ను కోరి ‘ విరాట్ రియల్ లైఫ్..ఊహకు అందని ట్విస్టులు..

చిరంజీవి సినిమాలో మురళీ బాబాయ్ ఛాన్స్.. 

గత కొన్ని వారాల ముందు ఢీ షోలో తన అదిరిపోయే పర్ఫామెన్స్ తో చిరంజీవిని మైమరిపించాడు ఈ మురళి. అచ్చం చిరంజీవి గారు చేసినట్లే ఆయన స్టెప్పులు చేయడం ప్రేక్షకులను చేత ఔరా అనిపించింది. చిన్నప్పటినుంచి ఆయన అంటే ఎంతో అవమానాన్ని పెంచుకున్న బాబాయ్ ఒక్కసారైన తన అభిమాన దేవుని కలుసుకోవాలని అనుకున్నాడు. చివరికి ఆయన కోరిక తీరింది. చిరంజీవిని కలవడంతో పాటుగా ఆయన నటిస్తున్న సినిమాలో ఒక మంచి రోల్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో బాబాయ్ చాలా గొప్పగా చెప్పాడు.. నా జన్మ ధన్యమైపోయింది ఆయనను కలవడం నాకు కలలాగా మిగిలిపోయింది అని అన్నారు.. చిరంజీవి చేసిన మర్యాదలకు ఆయన ఫీదా అయిపోయినట్లు చెప్పారు..

మురళీ బాబాయ్ కోరిక అదే.. 

Advertisement

టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదని లేటు వయసులో డ్యాన్సర్ గా నిరూపించుకున్నాడు మురళీ.. చిత్తూరు జిల్లా సంతపేట బాబాయ్ గురించి తెలుసుకోవాల్సిందే. స్టెప్పులతో ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. ఢీ షోలో మెరిసిన మురళి బాబాయ్ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు.. మూడేళ్ల కిందట ఉపాధి కోసం తిరుపతి వెళ్లారు. అయితే ఓ డ్యాన్స్ షోలో ముఠామేస్త్రి సినిమాలో పాటకు డాన్స్ వేశారు.. ఆయన చిన్న వ్యాపారం చేసుకొని ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. ఆయన జీవితంలో అతి పెద్ద కోరిక చిరంజీవిని కలవడం.. ఆ కోరిక తీరంది. సొంతింట్లో కూతురు పెళ్లి చెయ్యాలనే కోరిక మాత్రం తీరలేదు. మూడు లక్షల అప్పు ఉన్నట్లు ఇంటర్వ్యూ వల్ల బయటపడింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మీ మనుసు చాలా గొప్పది అంటూ కొందరు కామెంట్ చెయ్యగా, మరికొందరు చిరంజీవిని కలిసిన మీకు భాధలు తగ్గలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాబాయ్ కష్టాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×