E-Paper
Advertisement

OTT Movie : అందం వెనకాల అరాచకం… కాబోయే మొగుడి తల తీసే లేడీ సైకో… వణుకు పుట్టించే సినిమా

OTT Movie : అందం వెనకాల అరాచకం… కాబోయే మొగుడి తల తీసే లేడీ సైకో… వణుకు పుట్టించే సినిమా
Advertisement

OTT Movie : హారర్ ఫ్యాన్స్‌కి గుండెల్లో గుబులు పుట్టించిన సినిమా ‘ఆడిషన్’. ఈ జపనీస్ సైకలాజికల్ హారర్ సినిమా ని చూస్తే ఒళ్ళంతా వనికిపోతుంది. చివరి 20 నిమిషాలు కళ్లు మూసుకుని చూడాల్సి వస్తుంది. ఎలా చూసినా భయం తప్పదు. మొదటి 80 నిమిషాలు రొమాంటిక్ డ్రామాగా మొదలై, చివరి 30 నిమిషాలు నరకం చూపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. గుండె గట్టిగా లేకపోతే దయచేసి చూడొద్దు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

తకాషి మీకే దర్శకటంలో వచ్చిన ఈ జపనీస్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘ఆడిషన్’. 1999లో వచ్చిన ఈ సినిమాలో ర్యూ ఇషిబాషి (అయోయామా), ఎయిహి షినా (అసామి యమాజాకి) లీడ్ రోల్స్ లో నటించారు. 115 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.1/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం MUBI, Arrow Player లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అయామా అనే 50 ఏళ్ల వ్యక్తి టోక్యోలో పెద్ద మూవీ ప్రొడ్యూసర్. భార్య చనిపోయి 7 ఏళ్లైంది. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఒక రోజు నాన్నా, నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. అయామా దాన్ని సీరియస్‌గా తీసుకుని తన ఫ్రెండ్ యోషికావా (ఫిల్మ్ ప్రొడ్యూసర్)తో చెప్తాడు. యోషికావా ఒక దొంగ ఐడియా ఇస్తాడు. సినిమా హీరోయిన్ ఆడిషన్ పెట్టు, నీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకో, పెళ్లి కూడా అయిపోతుంది. ఆతరువాత ఆమెనే పెట్టి సినిమా కూడా తీసేద్దాం అని చెప్తాడు. అక్కడికి 30 మంది అమ్మాయిల ఫోటోస్, రెజ్యూమ్‌లు వస్తాయి. అందులో అసామి అనే 24 ఏళ్ల అమ్మాయి రెజ్యూమ్ చదివి అయామాకి మతి పోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. నన్ను ఎవరూ ప్రేమించలేదని అందులో రాసి ఉంటుంది. అయామాకి ఆమె మీద జాలి, ప్రేమ రెండూ కలుగుతాయి.

ఆడిషన్ రోజు అసామి వైట్ డ్రెస్‌లో వచ్చి కూర్చుంటుంది. అయామా మాట్లాడగానే స్వీట్‌గా, మెల్లిగా సమాధానాలు చెప్తుంది. కానీ ఒక్క సెకను కెమెరా వైపు స్ట్రెయిట్ చూసి స్మైల్ ఇస్తుంది. ఆ సీన్ చూస్తేనే గుండె జారిపోతుంది. ఇప్పుడు అయామా పూర్తిగా ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ మొదలెడతారు. సముద్రం దగ్గర హోటల్ రూమ్ బుక్ చేసుకుంటారు. అసామి నన్ను ఎవరూ ప్రేమించలేదు… నువ్వు మాత్రమే నన్ను ప్రేమిస్తావు కదా?” అని అడుగుతుంది. అయామా అవును, నిన్ను నా నుంచి ఎవరూ దొంగిలించలేరు అని ఒడిలోకి తీసుకుంటాడు. తర్వాత రోజు అయామా ఫోన్ చేస్తే ఎత్తదు. హోటల్‌కి వెళ్లి చూస్తే రూమ్ ఖాళీ… కానీ ఒక పెద్ద నీలం గోనె సంచి కదులుతూ ఉంటుంది. సంచి తెరిచి చూస్తే… అందులో చేతులు కాళ్లు లేని ఒక మనిషి ఉంటాడు. అతని నాలుక కూడా కోసి ఉంటుంది. అయామా షాక్ అయి పరిగెత్తుతాడు.

Advertisement

Read Also : కథలు వింటూ సైకో పనులు చేసే మంత్రగత్తె… రాత్రయితే వణికిపోయే అబ్బాయి

అసామి ఇంటికి వెళ్ళి చూస్తే… గోడ నిండా అన్ని ఆడిషన్ ఫోటోస్ అంటించి ఉన్నాయి. ఫ్లోర్ మీద రక్తం మరకలు, కత్తులు, వైర్లు పడి ఉంటాయి. ఇప్పుడు అసామి నిజస్వరూపం బయటపడుతుంది. ఆమె ఒక సైకో సీరియల్ కిల్లర్. అయామా భయపడి ఇంటికి వచ్చి డ్రింక్ తాగుతాడు. ఆ తర్వాత కళ్లు తెరిచి చూస్తే తన ఇంట్లోనే చేతులు, కాళ్లు కట్టేసి ఉంటాయి. అసామి వైట్ ఏప్రన్ వేసుకుని వచ్చి స్మైల్ ఇస్తుంది. పియానో వైర్ తీసుకొచ్చి అయామా కాలి వేళ్ల మధ్యలో గుచ్చి నరుకుతుంది. అప్పుడు అరుపులు ఆకాశం తాకుతాయి. అక్యుపంక్చర్ సూదులతో కళ్లలోకి పొడుస్తుంది. మెడలో గుచ్చుతుంది. చివరికి నువ్వు నన్ను మోసం చేశావని చెప్పి తల కోసేస్తుంది. ఈ సినిమా ఇలా భయంకరంగా ముగుస్తుంది.చూస్తే రెండు రోజులు నిద్ర కూడా పట్టదు.

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×