E-Paper
Advertisement

Duvvada Madhuri: ప్రపంచంతోనే ఫైట్ చేశా.. చాలా బాధగా ఉండేది!

Duvvada Madhuri: ప్రపంచంతోనే ఫైట్ చేశా.. చాలా బాధగా ఉండేది!
Advertisement

Duvvada Madhuri: దువ్వాడ మాధురి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు తెలియంది కాదు. ఆమె అసలు పేరు దివ్వెల మాధురి (Divvela Madhuri). మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌‌ (Duvvada Srinivas)ని రెండో వివాహం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం ఫైర్ బ్రాండ్‌గా ముఖం మీద కొట్టినట్టే మాట్లాడుతుంటారు. ఆ విషయం బిగ్ బాస్ సీజన్ 9 చూసిన వారందరికీ తెలుసు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అలాగే సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండే దువ్వాడ మాధురి.. ప్రపంచంతోనే ఫైట్ చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత జీవితం, వ్యాపారం, రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో ప్రపంచంతోనే ఫైట్ చేశానని ఆమె తెలిపిన విషయానికి వస్తే..

Also Read- Vijay Rashmika: విజయ్ రష్మిక ‘బడ్డీమూన్’ విల్లా ఒక్క రాత్రికి రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది!

ప్రపంచంతోనే ఫైట్ చేశా..

Advertisement

‘‘నేను ధైర్యం పక్కన నిలబడతాను, నా ధైర్యం మా ఆయన శ్రీనివాస్. ఆయన పక్కన నిలబడతాను కాబట్టే నాకు ఇంత ధైర్యం. ఆయన ప్రేమను సొంతం చేసుకోవడానికి దాదాపు ప్రపంచంతోనే ఫైట్ చేశా. ప్రపంచం అంతా ఒక వైపు, నేనొక్కదాన్నే ఒకవైపు నిలబడి పోరాటం చేశా. అలా ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్‌కి వచ్చాను. ఈ పోరాటంలో సమాజం గురించి నేనసలు ఆలోచించలేదు. ఈ సమాజం ఏమనుకుంటుంది? నేను చేస్తుంది కరెక్టేనా? అని నాకెప్పుడూ అనిపించలేదు. మనం కష్టంలో ఉన్నామంటే ఎవరూ వచ్చి పోషించరు. ఇంకా రెండు రాళ్లు వేసి చంపేస్తారే తప్ప.. మనకోసం నిలబడే వారు ఎవరూ ఉండరు.

Also Read- Anna Lezhneva: పిలుపులు వేరైనా ఆ భావం ఒక్కటే.. మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్!

ఇలాంటి సమాజం గురించి ఆలోచించాలా?

Advertisement

ఆ సమయంలో చాలా బాధగా అనిపించేది. నాకే కాదు, సమాజంలోని ప్రతి మహిళ ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. నచ్చిన డ్రస్ వేసుకుంటే.. అలాంటి డ్రస్ వేసుకుందని, గట్టిగా మాట్లాడితే.. గట్టిగా మాట్లాడుతుందని, గట్టిగా నవ్వితే.. గట్టిగా నవ్విందని, ఏమీ చేయకుండా కూర్చుంటే.. దీనికి ఏమీ రాదని.. ఇలా ఎలా ఉన్నా, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటి సమాజం గురించి ఆలోచించాలని నాకెప్పుడూ అనిపించలేదు..’’ అని దువ్వాడ మాధురి తన ఆవేదనని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఫైనల్‌గా ఇలాంటి సమాజంతో పోరాడి, అందరినీ ఎదిరించి తాను దువ్వాడ శ్రీనివాస్ పక్కన నిలబడ్డానని, అందుకే తనకు అంత ధైర్యమని, ఇప్పుడసలు ట్రోలింగ్‌ని పట్టించుకోనని మాధురి తెలిపారు.

Also Read- Nagabandham Movie: రిలీజ్‌కి రెడీ అయిన అభిషేక్ నామా ‘నాగబంధం’.. వచ్చేది ఎప్పుడంటే?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×