Gajulu Gajulu Song Controversy:సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతుందో, ఏది ఎప్పుడు నెటిజన్లకి టార్గెట్ అవుతుందో చెప్పలేము.ఇదిగో ఇపుడు ఈ గాజులు గాజులు గాజులు గల గల సింగర్ వ్యవహారం కూడా అలాగే ఉంది.దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సన్నిదిలో రాధమ్మ కూతురు,కీర్తన చేసిన ఈ పాట ఒక్కసారిగా ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు.దేవుడి పాటలు ఎన్నో ఏళ్ళు గడిస్తే కాని మిలియన్ల వ్యూస్ అంత ఈజీగా దాటవు అలాంటిది ఈ పాట కేవలం 6 రోజుల్లోనే ఏకంగా పది మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో ఇపుడు ఎక్కడ చూసినా ఈ గాజులు గాజులు గాజులు గల గల పాటనే చర్చల్లోకి వస్తుంది.
అమ్మవారి సమక్షంలో పాడటం ఏంటి ?
ముఖ్యంగా అమ్మవారి సన్నిదిలో పాట పాడిన రాధమ్మ కూతురు ఎక్కువగా కెమెరాని చూస్తూ ఎక్స్ ప్రెస్సివ్ గా పాట పాడటంతో నెటిజన్లకి టార్గెట్ అయిపొయింది.అసలు ఆ పాట ఏంటి ?అలా అమ్మవారి సమక్షంలో పాడటం ఏంటి ?అసలు అమ్మవారి మీద ఏమైనా భక్తీ ఉందా అంటూ ఫైర్ అయ్యారు కొంతమంది సోషల్ మీడియా జనాలు. ముఖ్యంగా యూట్యూబర్ కల్యాణి మాట్లాడుతూ అసలు ఆమెకి భక్తి అనేది లేదని, కేవలం రీల్స్ కోసం ఇదిగో దుర్గ అదిగో దుర్గ అంటూ యాక్టింగ్ చేస్తుందని,అసలు అక్కడ దుర్గా మాతనే లేదని,కేవలం అమ్మవారిని అడ్డం పెట్టుకుని లైక్స్ ,వ్యూస్ సంపాదిస్తుందని మండిపడింది.
ఆమెని తీసుకుని వచ్చి రీల్స్ లో పెట్టవు
ముఖ్యంగా భావాన్ని మాల వేసుకున్నప్పుడు ఎంతో నిష్టగా ఉండాలని, కానీ గాజులు గాజులు గలగల అంటూ దుర్గామతని అవమానిస్తుందని,అసలు భావాన్ని మాల వేసుకున్నప్పుడు ఎలా ఉండాలి ,ఎవరైనా ప్లాస్టిక్ మల్లెపూలు పెట్టుకుంటారా ఇదేనా నీకున్న భక్తి అంటూ ఎకిపారేసింది. అమ్మవారి మీద భక్తీ ఉంటె ఆమెని తీసుకుని వచ్చి రీల్స్ లో పెట్టవు.నీకు ఒకతల్లిగా చెబుతున్నా నిజంగా భక్తీ ఉంటే ఇవన్ని మానెయ్ అంటూ ఫైర్ అయ్యి చివర్లో ఇది గనుక మీకు నచ్చితే,నేను చెప్పేది సరిగ్గా అనిపిస్తే నా వీడియోని, షేర్ చేసి ,లైక్ కొట్టమనడం ఇక్కడ విశేషం.
ఇలా ట్రోల్ చేస్తే చెప్పుతో కొడతా
దీంతో ఇదే విషయమై మండిపడింది రాధమ్మ కూతురు.నన్నేదో కన్నట్టు, పెంచి పోషించినట్టు చెబుతున్నారు.నేను అలా ఒక వీడియో పెటడం ,అది కాస్తా మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో అసూయతో నన్ను ట్రోల్ చేస్తున్నారని,అలా చేసేవారు అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ,ఇంకెవరైనా ఇలా ట్రోల్ చేస్తే చెప్పుతో కొడతా అంటూ ఒక రేంజ్ లో మండిపడింది రాధమ్మ కూతురు.
నాపై చెప్పు చూపిస్తావా ..?నేను కూడా చూపిచగలను
ఇక దీనికి కౌంటర్ గా యూట్యూబర్ కల్యాణి అసలు నువ్వు భవాని మాల వేసుకుని నేర్చుకున్నది ,ఇదేనా ,అమ్మ లాంటిదానిని అయిన నాపై చెప్పు చూపిస్తావా ..?నేను కూడా చూపిచగలను కానీ అపుడు నీకు నాకు తేడా ఏముంటుంది,అసలు నీకు ఏమైంది ,మాల తీసి తీయగానే అలా రెచ్చిపోతున్నావ్ ..అంటే నీ నిజ స్వరూపం ఇదే అన్న మాట అంటూ కౌంటర్ వదిలింది.
అయితే కేవలం ఆరు రోజుల్లోనే పది మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడంతో పాడనీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని,అదంతా కేవలం జలసీ అని,దేశం లో దేవుడిని అడ్డం పెట్టుకుని ఎంతో మంది ఎన్నో చేస్తున్నారని అలాంటి వారందరితో పోలిస్తే ఆమె జస్ట్ ఒక పాట చేసిందని మండిపడ్డారు.ఇక సోషల్ మీడియాలో ఎవరైనా కాస్త మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ఫేమస్ అయితే వారిపై ట్రోల్ చేయడం ఇపుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందని కౌంటర్ ఇస్తున్నారు.
ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !
నిజానికి దేవుడి సన్నిదిలో చాలా మంది ఇలా ఎన్నో పాటలు పాడారు కాని,దేవీ నవరాత్రుల సందర్భంగా చేసిన ఈ పాట ఒక్కసారిగా సోషల్ మీడియాని చుట్టేయడంతో రాధమ్మ కూతురు ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది. చూడాలి మరి మిలియన్ల వ్యూస్ తో పాటు వివాదాలకి కేరాఫ్ గా నిలుస్తున్న ఈ గాజులు గల గల సాంగ్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తుందో !