E-Paper
Advertisement

సీఎం రేవంత్ ‘విజన్ 6 మంత్ర’.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన టాస్క్‌ ఇదే?

సీఎం రేవంత్ ‘విజన్ 6 మంత్ర’.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన టాస్క్‌ ఇదే?
Advertisement

Revanth Reddy: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో వేగం పెంచేందుకు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప్రజా భవన్ వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అనుసరించాల్సినకార్యాచరణను, వచ్చే 6 నెలల యాక్షన్ ప్లాన్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, వాతావరణ మార్పుల సవాళ్లు, రాబోయే రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా దిశానిర్దేశం చేశారు. ప్రజా భవన్ లో జరిగిన సుదీర్ఘ భేటీలోప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయా? లేదా అనే అంశంపై సమీక్షించారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడపాలని, వారానికి కనీసం 3-4 రోజులు ప్రజా దర్బార్లు , క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు.ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలకు కీలక టాస్క్ లు..

ప్రభుత్వానికి క్షేత్రస్థాయికి మధ్య వ వారధిగా పనిచేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు,ఎంపీలపైనే ఉందన్న సీఎం, వారికి నిర్దిష్టమైన లక్ష్యాలనునిర్దేశించారు.నియోజకవర్గాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను గుర్తించి, త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు.స్థానికంగా వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలు, స్థానిక సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లన్నారు. వ్యవసాయం, తాగునీటి నిర్వహణపై ముందస్తు ప్రిపరేషన్ అవసరం అన్నారు. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ముప్పు ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు..

Advertisement

ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉన్నందున, గ్రామాల్లో ,పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్ర ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.యాసంగి పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం పడకుండా ముందస్తుగా విత్తనాలు,ఎరువుల లభ్యతను నిర్ధారించుకోవడం , నీటి ఎద్దడిని తట్టుకునే పంటలపై అవగాహన కల్పించనున్నారు.ప్రాజెక్టులు, చెరువుల్లోని నీటి నిల్వలను సమర్థవంతంగావినియోగించుకోవడానికి జలవనరుల శాఖను సన్నద్ధం చేశారు.

Also read: ‘కరువుపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం’.. కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్!

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ,రాజకీయ వ్యూహం..

Advertisement

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు స్థానిక సంస్థల సమరానికి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై కూడా సీఎం ఈ సమావేశంలో కీలక దిశానిర్దేశంచేశారు.నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.పట్టభద్రుల, ఉపాధ్యాయ ,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదును పక్కాగా చేపట్టి, పార్టీ శ్రేణులను క్రియాశీలకం చేయాలని సీఎం ఆదేశించారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను గణాంకాలతో సహా ప్రజల్లో తిప్పికొట్టాలని సీ ఎం పిలుపునిచ్చారు.

6 నెలల లక్ష్యం.. ప్రజామోద పాలన..

మొత్తానికి ప్రజా భవన్ వేదికగా సీఎం ఇచ్చిన బ్రీఫింగ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాబోయే 6 నెలల కాలం ప్రభుత్వ పనితీరుకు ఎంతో కీలకమైనదని,ఎల్ నినో ఎదుర్కొంటూనే, అటు ఎమ్మెల్సీ ఎన్నికలను అధిగమించి ప్రజాదరణ పొందే పాలన అందించడమే లక్ష్యంగా సర్కార్ ముందుకు సాగుతోంది.

Also read: దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

Tags

Related News

రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు

‘కరువుపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం’.. కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్!

అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి, హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో ఏం జరిగిందంటే?

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×