E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Manoj : ‘గుండెనిండా గంటలు ‘ మనోజ్ షాడ్ స్టోరీ.. ఒక్కపూట తిండి లేక పస్తులు..

Gundeninda Gudigantalu Manoj : ‘గుండెనిండా గంటలు ‘ మనోజ్ షాడ్ స్టోరీ.. ఒక్కపూట తిండి లేక పస్తులు..
Advertisement

Gundeninda Gudigantalu Manoj : స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. ప్రస్తుతం ఈ సీరియల్ మూడో స్థానంలో ప్రేక్షకులను అలరిస్తుంది. డిఫరెంట్ స్టోరీ తో పాటుగా కాస్త కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఎక్కువమంది ఈ సీరియల్ను చూస్తున్నారు. ఎమోషనల్ స్టోరీలు పెద్దగా లేకపోవడంతో జనాలు దీనికి నీరాజనం పలుకుతున్నారు. బాలు, మీనాల పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సీరియల్ లో బాలు అన్నయ్య పాత్రలో మనోజ్ నటించాడు. కాస్త అమాయకంగా ఉండే మనోజ్ ఎప్పుడు అందరు చేత తిట్టించుకుంటూ ఉంటాడు.. అతని అమాయకత్వం వల్ల లక్షలు పోగొట్టుకుంటాడు. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ చేత చివాట్లు తింటూ ఉంటాడు.. సీరియల్లో సరదాగా కామెడీగా కనిపించే మనోజ్ రియల్ లైఫ్ లో మాత్రం అన్ని కష్టాలు అని తెలుస్తుంది. మనోజ్ షాడ్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాము…

మనోజ్ రియల్ లైఫ్ మొత్తం కష్టాలే..

బుల్లితెర పై ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మనోజ్ క్యారెక్టర్ జనాలుకు కాస్త చిరాకు తెప్పిస్తుంది.. తింగరి తనంతో అతను చేసే పొరపాట్లు అతనికి శాపంగా మారుతూ ఉంటాయి. ఆ పాత్రలో నటించిన అతని రియల్ నేమ్ యశ్వంత్.. గతంలో ఈయన పలు సీరియస్లలో నటించారు. కానీ ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రం గుండెనిండా గుడిగంటలు.. యశ్వంత్ రియల్ లైఫ్ లో మాత్రం కన్నీళ్లు తెప్పించే కష్టాలు ఉన్నాయి. చదువు పూర్తి అయిన తర్వాత ఓ రూమ్ లో ఉంటూ తినడానికి డబ్బులు లేక చాలా రోజులు పస్తులు పడుకున్నాడని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తన తల్లికి తెలిస్తే బాధపడుతుందని ఈ విషయాన్ని చెప్పకుండా తనలో తానే కడుపు మార్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యాడు. సీరియల్స్ లో మాత్రం బాగా సక్సెస్ అయిన మనోజ్ ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు కొన్ని ఆడిషన్స్ కూడా వెళ్లినట్లు చెప్పాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే రిజెక్ట్ అవుతున్నాడని బాధపడ్డాడు.. ఏదో ఒక రోజు హీరోగా సక్సెస్ అవ్వాలన్నది నా కోరిక అని మనోజ్ ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది…

Advertisement

Also Read:‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ విశ్వ కు పెళ్ళైందా..? నమ్మలేని నిజాలు..

యశ్వంత్ ఇప్పుడేం చేస్తున్నాడు? 

బుల్లితెర నటుడు యశ్వంత్ ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఈయనకు బాగా ఫేమ్ ని తెచ్చిపెట్టింది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. అటు సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన ఓ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. కష్టాన్ని దిగమింగుకొని, ఎన్ని రోజులు పస్తులకు పడుకున్నా సందర్భాలు కూడా ఉన్నాయని ఆ ఇంటర్వ్యూలో తన ఎమోషనల్ స్టోరీ ని బయటపెట్టి అందరిని కన్నీళ్లు పెట్టించాడు యశ్వంత్.. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టాలు పడాలి అన్నది వాస్తవం..

Advertisement

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×