E-Paper
Advertisement

Year Ender 2025 : రొమాంటిక్ నుంచి థ్రిల్లర్ వరకు… 2025లో వచ్చిన బెస్ట్ బెంగాలీ సిరీసులు ఇవే

Year Ender 2025 : రొమాంటిక్ నుంచి థ్రిల్లర్ వరకు… 2025లో వచ్చిన బెస్ట్ బెంగాలీ సిరీసులు ఇవే
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం బెంగాలీ సినిమా, ఓటేటీ ప్రపంచానికి అద్భుతమైనది. బెంగాలీ మేకర్స్ కథలు చెప్పే తీరు, సినిమాల స్కేల్, ప్రయోగాల్లో కొత్త ధైర్యం ఆయా సినిమాల ద్వారా హాట్ టాపిక్ గా మారాయి. థియేటర్ల నుండి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల వరకు బెంగాలీ కంటెంట్ ఈ ఏడాది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 2025లో హాట్ టాపిక్ గా మారిన బెస్ట్ వెబ్ సిరీస్ ల లిస్ట్.

1. గణోశత్రు (Ganoshotru) – ZEE5

ట్రూ-క్రైమ్ డాక్యు-డ్రామా యాంథాలజీ సిరీస్ ‘గణోశత్రు’. పశ్చిమ బెంగాల్‌లోని ఐదు నిజ జీవిత క్రిమినల్ కేసులు… రషీద్ ఖాన్, హుబ్బా శ్యామల్, సజల్ బరుయి, చైన్‌మ్యాన్, త్రైలోక్య దేవి వంటి నిర్దాక్షిణ్య గ్యాంగ్‌స్టర్లు, సీరియల్ కిల్లర్ల కథలు ఇందులో చూపించారు.

2. ధర్మ సంకట్ (Dharma Sankat) – OTT Play

Advertisement

ఇదొక రొమాంటిక్ వెబ్ సిరీస్. సాంప్రదాయికుడైన సౌవిక్, వేరే నేపథ్యం నుండి వచ్చిన మౌ ప్రేమలో పడతారు. మతం vs ప్రేమ అనే ఘర్షణ చుట్టూ నడిచే కథతో సాగుతుంది ఈ సిరీస్. సత్యం భట్టాచార్య, రోష్ని భట్టాచార్య లీడ్ రోల్స్ చేశారు.

3. భీభిషన్ (Bibhishon) – ZEE5

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘భీభిషన్’. SI బిధాన్ సేన్ (సోహం మజుందార్) బీర్భూమ్ గ్రామీణ ప్రాంతంలో తలలేని శవం కేసును దర్యాప్తు చేస్తాడు. తన నమ్మకమైన వ్యక్తుల్లోనే రహస్యాలు, ద్రోహాలు బయటపడతాయి. గర్భిణీ భార్యతో సమస్యలు, మరోవైపు కేసు… ఈ పరిస్థితులను ఎలా దాటాడు అన్నది స్టోరీ.

4. బిబాహో అతోపోర్ (Bibaho Otohpor) – OTT Play

Advertisement

రొమాంటిక్ కామెడీ-డ్రామా ‘బిబాహో అతోపోర్’. కొత్తగా పెళ్లైన రిజు (గౌరవ్ చక్రవర్తి), రాయ్ (అరుణిమా ఘోష్) జంట చిక్కుల్లో పడుతుంది. రెండు కుటుంబాలు వింతైన చట్టపరమైన గొడవలో చిక్కుకుంటాయి.

5. 1954 ది హిస్టారికల్ క్రైమ్ (1954 The Historical Crime) – OTT Play

వాస్తవ సంఘటనల ఆధారంగా సయంతన్ ముఖర్జీ సృష్టించిన సిరీస్ ఇది. కోల్‌కతాలోని బేలా రాణి దత్త హత్య కేసు ఆధారంగా తెరకెక్కింది. డిటెక్టివ్ సబ్యసాచి సర్కార్ (రుద్రనీల్ ఘోష్) భయానక హత్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతాడు.

6. రంకిని భవన్ (Ronkini Bhavan) – ZEE5

సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘రంకిని భవన్’. కొత్తగా వధువుగా వచ్చిన జుతిక (శ్యామౌప్తి ముద్లీ) దూరపు గ్రామంలోని రంకిని భవన్‌కు వెళ్తుంది. కుటుంబం రహస్యాలు, వింత ఆచారాలు, భయంతో నిండి ఉంటుంది సిరీస్ అంతా. వారసత్వంగా వచ్చిన ట్రామా, దాచిన భయాల చుట్టూ తిరుగుతుంది. గౌరబ్ రాయ్ చౌదరి, బిడిప్తా చక్రవర్తి ఇందులో కీ రోల్స్ పోషించారు.

Read Also :  శుక్రవారం ఒక్కరోజే 14 సినిమాలు.. ఎందులో ఏ మూవీని చూడొచ్చంటే..?

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×