BigTV English

Gundeninda GudiGantalu Today Episode : శృతి కిడ్నాప్ కేసులో సత్యం అరెస్ట్.. బాలుకు నిజం చెప్పిన మీనా..

Gundeninda GudiGantalu Today Episode : శృతి కిడ్నాప్ కేసులో సత్యం అరెస్ట్.. బాలుకు నిజం చెప్పిన మీనా..

Gundeninda GudiGantalu Today Episode 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవికి బాలు వీడియో కాల్ చేస్తాడు. ఏంటో బాలు వీడియో కాల్ చేస్తున్నాడని శృతితో అంటాడు. మీనాక్షి గాజులు కొంటున్నా అని అంటాడు. అయితే నీ సైజ్ తెలియదు రవికి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. లోపల అంగ ప్రదక్షిణలు చేస్తున్నాడేమో అంటుంది. నీకు ఏ రంగులో కావాలో నాకు తెలియదు కదా.. రవి దగ్గర ఫోన్ ఉందిగా, వెళ్లి దాని నుంచి ఫోన్ చెయ్యి అంటాడు బాలు. మీనా సరే అని లోపలికి వెళ్తుంది. మీనా రవి అంటూ గుడి మొత్తం వెతుకుతుంది. మరోవైపు తాళి ఇచ్చి మాంగళ్యధారణ కానివ్వు అని పంతులు చెబుతాడు. శృతి రవి తాళి కడుతాడు. రవి కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా శృతి పెళ్లి చూస్తుంది. రవి, శృతి పెళ్లి పీటలపై చూసి షాక్ అవుతుంది. రవి అని గట్టిగా అరుస్తుంది. మీనా పెద్ద గొడవ చేస్తుంది.


అది విని రవి, సుమతి షాక్ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకున్నావా.. పెళ్లి అయిపోయిందా. ఏంటిది. నేను చూస్తుంది నిజమేనా అని మీనా అడుగుతుంది. నాకు ఏం చెప్పి తీసుకొచ్చావ్. నువ్ ఏం చేశావ్. శ్రుతితో మాట్లాడుతా అనేగా చెప్పావ్. నన్ను బయట నిల్చోబెట్టి నువ్ లోపల పెళ్లి చేసుకున్నావా. ఏం జరుగుతోంది అని మీనా అంటుంది. వదినా టెన్షన్ పడకు అని రవి అంటే.. ఏయ్.. ఆపు.. ఏంటీ టెన్షన్ పడొద్దా.. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని అంటుంది. నన్ను ఇంత దారుణంగా నమ్మిస్తావా. మా అందరిని మోసం చేస్తావా. ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చేసుకున్నావ్. రాత్రి నా మాట విన్నావే. వచ్చేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా అని మీనా కోప్పడుతుంది. ఒప్పుకోరని నేనే వద్దన్నాను అని శ్రుతి అంటే.. హేయ్.. ఆపవమ్మా అని వారిస్తుంది మీనా. ఆరోజు నువ్ ఆవేశంగా వచ్చినప్పుడే మావయ్యకు చెప్పుంటే ఇక్కడికిదాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా. మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లికి ఎందుకు రప్పించారు అని అరుస్తుంది. మీనా పెద్ద గొడవే చేస్తుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ లో.. మీ ఏడ్పు మీరు ఏడవండి అని మీనా కోపంగా ఉంటుంది. రవి, శృతిలను ఆశీర్వదించకుండా కోపంగా గుడి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. ఏంటి పూల గంప ఫోన్ చేస్తా అని ఇప్పటివరకు చెయ్యలేదు. సరే నేను ఏదోకటి తీసుకున్న అని చెప్తాడు. అతడికి రవి పెళ్లి గురించి చెప్పబోతుంది. కానీ ఛార్జింగ్ లేదని ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఇంటికొచ్చి పెళ్లి గురించి మీరే సమాధానం చెప్పుకోమని కోపంగా రవితో చెప్పి గుడి దగ్గర నుంచి మీనా వెళ్లిపోతుంది.. అప్పుడు సుమతి అక్కా అని అంటుంది. నీకు ఏ సంబంధం లేదు నువ్వు వెళ్లి నీ పని చూసుకో అని వెళ్ళిపోతుంది. శృతిని వెతుక్కుంటూ గుడికివస్తాడు సంజు. కాస్ట్‌లీ గిఫ్ట్‌తో శృతిని సర్‌ప్రైజ్ చేయాలని అనుకుంటాడు. కానీ అక్కడ శృతి కనిపించదు. ఫోన్ చేస్తే స్విఛాఫ్ అని వస్తుంది. ఆవేశంగా శోభన, సురేంద్రల దగ్గరకి వస్తాడు సంజు. శృతి ఎక్కడికి వెళ్లిందని అడుగుతాడు. శృతి గురించి మీరు ఏమైనా నా దగ్గర దాస్తున్నారా అని నిలదీస్తాడు సంజు. గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పి తనను ఫూల్ చేసి గుడి నుంచి వెళ్లిపోయిందని, ఎక్కడికి వెళ్లిందో చెప్పమని గొడవ చేస్తాడు. డబ్బింగ్ కు వెళ్లినట్లు ఉంది అని ఏదో ఒకటి చెప్పి సంజు ను వెళ్లేలా చేస్తారు. ఇక శోభన, సురేంద్ర భయపడతారు..


ఇక ప్రభావతి మీనా ఎక్కడికి వెళ్లింది. అమ్మ దగ్గరకు వెళ్లి పూలు కుట్టుకుంటూ ఉండిపోయిందా అని అంటుంది. వంట చేయకుండా వెళ్లిందని చిందులు తొక్కుతుంది. ఆఫీస్ టైమ్‌లో మనోజ్ ఇంట్లోనే ఉండటంతో సత్యానికి డౌట్ వస్తుంది. తాను ఆఫీస్‌కు ఎప్పుడైనా వెళ్లొచ్చు…ఎప్పుడైనా రావచ్చునని తండ్రితో అంటాడు మనోజ్‌. అలా వెళ్లిరావడానికి అదేమైనా పబ్లిక్ పార్కా అని సత్యం అనగానే మనోజ్ కంగారు పడతాడు. ప్రభావతి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఆ ఉన్నదే అందరం కలిసి తిందాం అని అంటుంది. అప్పుడే సురేంద్ర అరుస్తూ వస్తాడు. మా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు ఏమైందని సురేంద్రను అడుగుతాడు సత్యం. రవి, శృతి ప్రేమ సంగతి తెలియని ప్రభావతి బాలునే సురేంద్రతో గొడవపడి ఉంటాడని అనుమానపడుతుంది. నీ పెన్షన్ ఆపించాననే కోపంతో నీ కొడుకు రవి ద్వారా నా కూతురు శృతిని కిడ్నాప్ చేశావని, తన కూతురు ఎక్కడుందో చెప్పమని సత్యాన్ని నిలదీస్తాడు సురేంద్ర. నాకు తెలియదు అని అంటాడు. రవికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది.. ఇక అప్పుడే గొడవకు దిగుతారు. పోలీసులు వస్తారు. స్టేట్మెంట్ అని చెప్పి తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలుకు నిజం తెలిసిపోతుంది. ఏం జరుగుతుందో రేపు చూడాలి..

Related News

Ring Riyaz: బై బై ఇండియా.. గల్లీ బాయ్ రియాజ్ వీడియో వైరల్..

Yadammaraju -stella :ఇన్నాళ్లకు కూతురిఫేస్ రివీల్ చేసిన జబర్దస్త్ కమెడియన్..ఎంత క్యూట్ గా ఉందో!

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?

GudiGantalu Today episode: ప్రభావతి షాకిచ్చిన బాలు.. మీనాతోనే ఆ పని..రోహిణికి కడుపు మంట..

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Nindu Noorella Saavasam Serial Today october 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన మంగళ

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

×