BigTV English

Ratan Tata’s Top Secret: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Ratan Tata’s Top Secret: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Ratan Tata’s Top Secret: టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) జీవితం.. ఒక మంచి పుస్తకం లాంటిది. పుస్తకం చదువుతుంటే అక్కడి పాఠాలు మనకు గుణపాఠాలు ఎలా నేర్పిస్తాయో.. టాటా లైఫ్ గురించి తెలుసుకుంటే కూడా.. ఆయన ప్రతి విజయం మనకు కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. అటువంటి రతన్ టాటా సాధించిన అరుదైన రికార్డులు మీకు తెలుసా.. అది కూడా 17 ఏళ్లకే సూపర్ రికార్డ్ సాధించారు.


రతన్ టాటా (Ratan Tata) 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో 8వతరగతి వరకు టాటా చదువుకున్నారు. అనంతరం సిమ్లా లోని బిషప్ కాటన్ స్కూలులో కూడా టాటా విద్యను కొనసాగించారు. 1955లో హైస్కూల్ నుండి పట్టా పొందిన టాటా.. కార్నల్ యూనివర్సిటీలో చేరారు. ఇక్కడే ఈయన 1959లో ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తనకు పట్టా అందించిన యూనివర్సిటీకి టాటా 2008లో 50 మిలియన్ల డాలర్లను బహుమతిగా అందించి, తనకు జీవితాన్నిచ్చిన యూనివర్సిటీ రుణాన్ని తీర్చుకున్నారు. 1970లో టాటా గ్రూపులో చేరిన టాటా .. సంస్థను సక్సెస్ వైపు నడిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

అటువంటి టాటా మనకు వ్యాపార దిగ్గజంగా తెలుసు.. కానీ 17 ఏళ్లకే అరుదైన రికార్డ్ సాధించారు. 17 ఏళ్ల వయస్సులో పైలట్ కోర్సును పూర్తి చేసుకొని.. లైసెన్స్డ్ పైలట్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఎఫ్-16 ఫాల్కన్ ఫైటర్ జెట్ ను నడిపిన మొదటి భారతీయుడు రతన్ టాటా (Pilot Ratan Tata)అని చాలా మందికి నేటికీ తెలియదు.


2007వ సంవత్సరంలో బెంగళూరులో జరిగిన ఒక ఎయిర్ షో సందర్భంగా ఎఫ్-16 యుద్ధం విమానానికి కో పైలట్ గా టాటా (Ratan Tata) వ్యవహరించారు. అప్పటికి రతన్ టాటా వయస్సు అక్షరాల 69 ఏళ్లు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త .. ఫైటర్ జెట్ ను ఎగురవేయడం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకు పైలట్ గా గుర్తింపు పొందడమే కాక ఎంతో చాకచక్యం, పరిజ్ఞానం అవసరం.

Also Read: Ratan Tata Last Words: కారు ఓనర్స్ కి టాటా చెప్పిన చివరి మాటలు ఇవే.. మీరు పాటిస్తున్నారా ?

ఈ ఫైటర్ జెట్ రూ.400 కోట్ల విలువతో కూడుకున్నది. అంతేకాదు.. గంటకు 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే యుద్ధ విమానం ఇది. ఈ యుద్ధ విమానంలో 45 నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు రతన్ టాటా. ఎఫ్-16 ఫైటర్ జెట్ ను నడిపిన మొదటి భారతీయుడుగా (Ratan Tata) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు ఆయన.

వ్యాపార సామ్రాజ్యంలో దిగ్గజంగా పేరు గాంచిన టాటా.. తన లైఫ్ లో ఎన్నో విజయాలను సాధించి చెరగని ముద్రను వేసుకున్నారు. అందుకే టాటాకు అవార్డులు వాటంతట అవే దరికి చేరాయి. భారత అత్యున్నత పురస్కారాలు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లు టాటాకు వరించాయి. మానవతావాదిగా కూడా యావత్ భారతావని ప్రజల చేత మన్ననలు అందుకున్న రతన్ టాటా (Ratan Tata) .. మరణం జీర్ణించుకోలేనిది.. అందుకే కన్నీటితో వీడ్కోలు పలుకుతోంది ఈ ప్రపంచం.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×