E-Paper
Advertisement

GundeNinda GudiGantalu: Today Episode: మీనాను ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి .. ఆపలేక కన్నీళ్లు పెట్టుకున్న సత్యం ..

GundeNinda GudiGantalu: Today Episode: మీనాను ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి .. ఆపలేక కన్నీళ్లు పెట్టుకున్న సత్యం ..
Advertisement

Gundeninda GudiGantalu Today Episode 18th :నిన్నటి ఎపిసోడ్ లో మీనాను బాలు తిట్టడంతో మీనా రవిని ఎలాగైనా తీసుకొని రావాలని మృదుల చెప్పిన అడ్రెస్స్ కు వెళ్తుంది . త‌న‌పై ప‌డిన నింద‌ను తొల‌గించుకునేందుకు ర‌వి, శృతిల‌ను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకొస్తుంది మీనా. ర‌విని చూడ‌గానే ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతాడు బాలు. పోలీస్ స్టేష‌న్‌లోనే త‌మ్ముడిని చిత‌క‌బాదుతాడు. శృతిని త‌మ‌ తో పాటు తీసుకెళ్లాల‌ని ఆమె త‌ల్లిదండ్రులు సురేంద్ర‌, శోభ‌న అనుకుంటారు. కానీ వారిని ర‌వి అడ్డుకుంటాడు. త‌న భార్య‌ను తీసుకెళ్లేహ‌క్కుమీకు లేద‌ని అంటాడు. అక్కడ రవి శృతి లతో మాట్లాడి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తుంది. అక్కడ పోలీసులు రవి శృతి లు చెప్పిన నిజం తో సత్యం ను బయటకు తీసుకొని వస్తారు. ఇక బాలు మీనాను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది .

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తండ్రిని కారు ఎక్కించ‌బోతాడు బాలు. మీనాను కూడా పిల‌వ‌మ‌ని స‌త్యం అంటాడు. కానీ మీనాను పోలీస్ స్టేష‌న్‌లోనే వ‌దిలిపెట్టి ఇంటికి వెళ్లిపోతాడు బాలు. ఇంటికొచ్చిన స‌త్యం…పోలీస్‌ స్టేష‌న్‌లో త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గుర్తొచ్చి ఎమోష‌న‌ల్ అవుతాడు. ప‌క్క‌నే బ‌కెట్‌లో ఉన్న నీళ్లు తీసి త‌న‌పై గుమ్మ‌రించుకుంటాడు. పోలీస్ స్టేష‌న్‌లో జ‌రిగిన అవ‌మానానికి ఇంత‌కంటే ఏం చేయ‌లో తెలియ‌డం లేద‌ని అంటాడు.. మొత్తానికి సత్యం విడుదల అవ్వడంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సత్యం ఇంట్లోకి రాగానే భర్తకు హారతి ఇచ్చి ఇంటి లోపలి తీసుకొని వస్తుంది ప్రభావతి ..

Advertisement

ఇకపోతే స్వతంత్య్ర పోరాటం చేసి జైలుకు వెళ్లానా ప్ర‌పంచ ప‌త‌కం సాధించానా అని భార్య‌తో అంటాడు స‌త్యం. ఈ గ‌డ‌ప బ‌య‌టే ఆ అవ‌మానాన్ని వ‌దిలేసి ర‌మ్మ‌ని చెప్ప‌డానికే హార‌తి ఇస్తున్నాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. నేను నా ముగ్గురు కొడుకుల‌ను బాగా పెంచాన‌ని సురేంద్ర‌తో ఛాలెంజ్ చేశాన‌ని స‌త్యం అంటాడు. కానీ పోలీస్ స్టేష‌న్‌లో సురేంద్ర గెలిచాడు. స‌త్యం ఓడిపోయాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పటి రోజుల్లో ఎవరిని నమ్మొద్దని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. గదిలోపలికి వెళ్లి తలుపుకు గడియ పెట్టుకుంటాడు. ర‌వి వ‌ల్లే ఈ త‌ప్పు జ‌రిగిపోయింద‌ని బాలు ఆవేశానికి లోన‌వుతాడు. మీనాకు ఈ త‌ప్పులో భాగం ఉంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. స‌త్యం అరెస్ట్ కావ‌డానికి మీనానే కార‌ణమ‌ని నింద‌లు వేస్తుంది. స‌త్యంపై ప్ర‌భావ‌తికి ఉన్న ప్రేమ‌, అభిమానం చూసి అంద‌రూ క‌దిలిపోతారు. అమ్మా కోపం వెనుక ఇంత ప్రేమ ఉందా అని పొంగిపోతారు.

ఇక మీనా జ్ఞాప‌కాలు బాలును వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆమె చేసిన త‌ప్పు గుర్తొచ్చి జీవితంలో మ‌ళ్లీ భార్య ముఖం చూడ‌కూడ‌ద‌ని అనుకుంటాడు. ర‌విని వెత‌క‌డానికి ఆవేశంగా బ‌య‌ట‌కు వెళ‌తాడు బాలు .. అలా బాలు వెళ్లిపోయిన త‌ర్వాత మీనా ఇంట్లోకి వ‌స్తుంది. ఆమెను చూసి ప్ర‌భావ‌తి ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతుంది. ఎవ‌రు నువ్వు…నేరుగా ఇంట్లోకి ఎందుకు వ‌స్తున్నావ‌ని కోప్ప‌డుతుంది. నాకు ఇంత ద్రోహం చేసిన త‌ర్వాత నిన్ను ఇంట్లోకి రానిస్తాన‌ని ఎలా అనుకున్నావ‌ని కోడ‌లిపై ఫైర్ అవుతుంది. నా కొడుకుకు దొంగ పెళ్లిచేసి దాన్ని , నా భర్తను జైలుకు పంపిన దాన్ని ఇంట్లోకి రానిచ్చేదేలే అని ప్రభావతి కోపంతో రగిలిపోతుంది.

Advertisement

రవి , శృతిలు తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఇందులో త‌న త‌ప్పేం లేద‌ని క‌న్వీన్స్ చేయ‌బోతుంది మీనా. కానీ ప్ర‌భావ‌తి ఆమె మాట‌ల్ని విన‌దు. నాపై ప‌గ‌తోనే ఇదంతా చేశావ‌ని నింద‌లు వేస్తుంది. ఇంట్లోనుంచి వెళ్లిపోమ‌ని హెచ్చ‌రిస్తుంది. నువ్వు చేసిన త‌ప్పు వ‌ల్ల స‌త్యానికి శిక్ష ప‌డింద‌ని ప్ర‌భావ‌తి ఫైర్ ర‌చ్చ చేస్తుంది. స‌త్యం ఒక్క‌రైనా త‌న మాట వింటార‌ని, ఆయ‌న‌కు జ‌రిగింది చెప్పాల‌ని మీనా అనుకుంటుంది. స‌త్యాన్ని మీనా క‌ల‌వ‌డానికి ప్ర‌భావ‌తి ఒప్పుకోదు. మీనాను ఇంట్లో నుంచి బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు వెళ్ల‌గొడుతుంది.. మీనా ఏడుస్తూ ఉంటుంది. ఇక మీనా మల్లి ఇంట్లోకి వెళ్తుంది . తనని అడ్డుకోవడానికి మీరెవ్వని అంటుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమని నా భర్త చెబితే వెళ్తాను అంటుంది. త‌న‌ను వెళ్ల‌మ‌ని చెప్పే అధికారం మీకు లేదు…నా భ‌ర్త ఆ మాట చెబితే వెళ్లిపోతాన‌ని మీనా అంటుంది. వెంట‌నే బాలుకు ఫోన్ చేస్తాడు మ‌నోజ్‌. అస‌లు మీనాను ఇంట్లోకి ఎవ‌రు రానిచ్చార‌ని బాలు అంటాడు.అంద‌రు క‌లిసి మీనాను బ‌య‌ట‌కు తోసేయ‌మ‌ని చెబుతాడు. భ‌ర్త మాట‌ల‌తో మీనా షాక‌వుతుంది. అక్క‌డితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మీనాను బాలు క్షమిస్తాడేమో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×