BigTV English

Big TV Exclusive news about Pushpa: పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరిగానే నాగవంశీ అసలు తగ్గట్లేదు

Big TV Exclusive news about Pushpa: పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరిగానే నాగవంశీ అసలు తగ్గట్లేదు

Big TV Exclusive news about Pushpa: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగవంశీ ఒకరు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఇప్పటికీ కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ ఇమేజ్ కొనసాగించే ఒక డైనమిక్ ప్రొడ్యూసర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడు అనుకునే టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ముందుకు వచ్చారు. హారిక హాసిని బ్యానర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ బ్యానర్ ని సూర్యదేవర చినబాబు నిర్మించారు. కేవలం త్రివిక్రమ్ మాత్రమే ప్రస్తుతం ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించి, చాలామంది యంగ్ దర్శకులకు అలానే సీనియర్ దర్శకులకు కూడా ఆ బ్యానర్ లో అవకాశాలు కల్పిస్తూ సినిమాలు చేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ(Naga Vamsi).


ఈ బ్యానర్లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు జెర్సీ లాంటి నేషనల్ అవార్డు పొందుకున్న సినిమా కూడా ఈ బ్యానర్ లో వచ్చింది. ఈ బ్యానర్లు నెలకు ఒకటి చొప్పున సినిమాలు రిలీజ్ కూడా రెడీగా ఉన్నాయి. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కూడా మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టాడు నాగ వంశీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్(Talapthy Vijay) నటించిన లియో(Lio) రైట్స్ ను కొని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ సినిమా కూడా మంచి లాభాలు తీసుకొచ్చింది. మామూలుగా తెలుగు సినిమాలను విపరీతంగా చూస్తూ ఉంటాడు నాగ వంశీ. అలానే ఇతర భాషలో సినిమాలు కూడా చూసి వాటి రైట్స్ ను కొని రీమేక్ కూడా చేస్తూ ఉంటాడు.

రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రైట్స్ కొని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమా కొంతవరకు మంచి లాభాలు తీసుకొచ్చింది అని నాగ వంశీ స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే దీనిలో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది నాగ వంశీకి తెలియాలి. ఎందుకంటే నాగ వంశీ పలు సందర్భాల్లో ఫ్యాన్స్ కోసమే పోస్టర్లో కలెక్షన్స్ వేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టును డిస్ట్రిబ్యూట్ చేయడానికి నాగవంశీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 సినిమాను కేవలం ఆంధ్ర రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నాగవంశీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.


అయితే దీనికోసం ఏకంగా 75 కోట్లు నాగ వంశీ కొట్ చేశారు. చిత్ర యూనిట్ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద సరైన చర్చలు జరిపి ఒక అధికారక ప్రకటన చేయనున్నారు. వంశీ ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అని అంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా విధాలుగా ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. సో పుష్పాకి ఆల్రెడీ క్రేజ్ ఉంది, ఇంక వంశీ ప్రమోషన్స్ కూడా యాడ్ చేస్తే సినిమాకి మరింత బజ్ పెరిగే అవకాశం ఉంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి BIGTV Whats APP Channelని ఫాలో అవ్వండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి 👇

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×