Gundeninda GudiGantalu Today episode 27th: ప్రభావతి వీళ్ళందరూ ఏంటి ఒక్కసారిగా నవ్వుతున్నారు.. అసలేం జరిగిందో నాకు కంగారుగా ఉందండి అని అనుకుంటుంది.. నిద్రపోతున్న సత్యం నీ లేపి వీళ్ళందరూ ఒక్కసరికి నవ్వుతున్నారు. ఏం జరిగిందో అండి ఒకసారి మనం కూడా పైకి వెళ్లి చూసేద్దాం పదండి అని అనగానే సత్యం సరే అని పైకి వెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ సంతోషంగా నవ్వుతూ కనిపించడంతో ఏంట్రా పొద్దునంత కొట్టుకున్నారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని సత్యం అనగానే అవును నాన్న ఇదా నీకు అంత కారణం శృతిని అని బాలు అంటాడు. బాలు ఇలా ఇలా డాన్స్ చేస్తున్నాడు అని మనోజ్ గురించి చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. వీళ్లంతా కూడా సరదాగా ఉండడం చూసి మీరు ఎప్పుడు ఇలానే సరదాగా ఉండాలి అని అనుకుంటారు సత్యం.. మీరు ఎప్పుడైనా పడుకోండి రేపు మాత్రం సుందరిని పెళ్లికూతురు చేస్తున్నారు కదా మనం త్వరగా వెళ్లాలి అని అంటాడు.. ఇక రేపు సుందరి పెళ్లి కదా మనం గ్రాండ్ గా చేయాలి అందరం దగ్గర ఉండి తల ఒక పని చేయాలి అని బాలు అంటాడు. సుందరి మన ఇంటి చిన్న ఆడపిల్లకు రా తనని అత్తవారింటికి పంపించే బాధ్యత మనదే అని బాలు అంటాడు.
బాలు మీనా తో ఎప్పుడు పూలేనా కనీసం నన్ను పట్టించుకోవాలనా ఆలోచన కూడా నీకు లేదా అని అంటాడు.. ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయండి ఏం చేయాలో చెప్పండి అని ఎంత అడుగుతున్నా సరే బాలు మాత్రం నీకు పూలు ఎక్కువ నేను అవసరం లేదా అని అంటాడు. అయితే బాలు మాటకి మీనా మాటకు మాట సమాధానం చెప్పడంతో బాలు సరే నేను నీతో ఇక మాట్లాడను అని అడుగుతాడు.. ఒక మాట చెప్పాలి మీనా నువ్వు చాలా గొప్ప దానివని నేను నమ్ముతున్నాను అని బాలు సెటైర్లు వేస్తాడు.. ఇవాళ మీకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు? మీరు ఖాళీగా ఉంటే ఈ పూలను కాస్త సదండి అని మీనా బాలుకి పని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలు పూలు సద్దుతూ ఉండగా మనోజ్ అక్కడికి కిందకి వస్తాడు.
మనోజ్ కిందకు వచ్చి అమ్మ ఎక్కడికి పోయింది అని అడుగుతాడు.. అమ్మ లేదు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అన్నట్లుగా బాలు మాట్లాడుతాడు. ఇక తర్వాత బాలు మాటకి మనోజ్ చాలా ఫీల్ అవుతాడు. దేవుడి దగ్గరికి వెళ్లి తన స్టైల్ లో దండం పెట్టుకుంటూ ఉంటారు.. అయితే మనోజ్ తన కోరికలను చెప్పుకుంటూ ఉండగా బాలు సటర్లు వర్షం కురిపిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం కాస్త కామెడీగా అనిపించినా సరే మనోజ్ కి మాత్రం చురకలు అంటిస్తూనే ఉంటాడు.. నేను పనుంది వెళ్ళిపోతాను అని అంటే నువ్వు కాసేపు పువ్వులని సద్ది వెళ్ళు అని చెప్పగానే.. మనోజ్ వీడి నోటికి ఎందుకు పని చెప్పడం అని పువ్వులని సర్దుతాడు.. ఇక తర్వాత పువ్వులు నీ సద్దేసిన తర్వాత మనోజ్ గదికి వెళ్ళగానే తన తాయత్తు కనిపించడం లేదని ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటాడు. రోహిణి ఇచ్చిన తాయత్తు ఎక్కడో మిస్ అయింది అని కంగారు పడిపోతూ ఉంటాడు..
తాయత్తు పోయిందని బాధపడుతున్న మనోజ్ కి రోహిణి ధైర్యం చెబుతుంది.. ఇక నీతు రెస్టారెంట్ల ఫుడ్ ఎలా ఉంది అని అందరిని అడుగుతూ ఉంటుంది. రవి చేసిన ఫుడ్డు చాలా బాగుంది అని అందరు మెచ్చుకుంటూ ఉండగా నీతో సరే మీకు అంత బాగా నచ్చిందా అని అనుకుంటుంది. రవి గురించి పొగుడుతూ ఉంటుంది నీతూ.. ఇక శోభ తనతో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటుంది. మా అల్లుడు వల్లే ఈ రెస్టారెంట్ కి బాగా పేరు వచ్చింది కదా అని అడుగుతుంది. అవును మీ అల్లుడు వల్లే ఈ రెస్టారెంట్ కి మంచి పేరు వచ్చింది అని నీతో కూడా సమాధానం చెబుతుంది.. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను నువ్వు దానికి నో అని చెప్పకూడదు అని అడుగుతుంది. ఈ రెస్టారెంట్ ని నాకు అమ్మేస్తే నేను మా అల్లుడికి ఇస్తాను అని శోభ అనగానే నీతూ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అంతేకాదు ఆమె ఇచ్చిన చెక్కుని చించి ఈ రెస్టారెంట్ నాకు కల అని చెప్తుంది.. శోభ కి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు..
బాలు మీన దగ్గరికి వచ్చి మళ్లీ పులిహోర కలిపి ప్రయత్నం చేస్తాడు. అయితే మీనా ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని అడుగుతుంది. నేనేమీ కొత్తగా మాట్లాడడం లేదు ఉన్నదే చెప్తున్నాను అని బాలు అంటాడు. అప్పుడే బాలుకి ఒక ఫోన్ వస్తుంది.. కార్ సర్వీసింగ్ ఇవాళ అవదు రేపు అవుతుంది అని చెప్పగానే ఆ మాట విన్న మీనా ఏంటి కారు లేదని నామీద సెటైర్లు వేస్తున్నారా ప్రేమ కురిపిస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.. మాట విన్నా బాలు అదేమీ లేదు మీనా నీకోసమే నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్కి బాలు మీనాల డైలాగులు హైలెట్గా నిలుస్తాయి. ఇక రోహిణి తన తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా విద్య మాణిక్యం ఇచ్చిన పెళ్లి కార్డు గురించి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది . రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..