E-Paper
Advertisement

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..
Advertisement

Podarillu Today Episode July 27th: బయట ఒంటరిగా కూర్చుని ఉన్న సురేష్ ని చూసిన వరాలు ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఏమైంది అని అడుగుతుంది. అసలు నువ్వు ఎంతసేపు అయింది రా వచ్చి.. ఇక్కడ ఏం చేస్తున్నావు అని వరాలు ఆరా తీసి అడుగుతూ ఉంటుంది. మొహంపై సురేష్ దెబ్బలను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన కూడా వరాలు ఆ దెబ్బలు ఏంట్రా ఎవరి ఇలా చేశారు అని కంగారు పడిపోతూ అడుగుతుంది. ఇంకెవరు నీ కూతురు ప్రేమించింది గా ఆ మెకానిక్ గాడు వాడే ఇదంతా చేశాడు అని చెప్పగానే ఏంట్రా నువ్వు చెప్పేది అని వరాలు ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు వాడి జోలికి నువ్వు ఎందుకు వెళ్లావు రా నీకేం పని లేదా అని వరాలు తిడుతూ ఉంటుంది. అప్పుడే లోపలి నుంచి వచ్చిన శైలు వలన ఏమైందిరా ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మెకానిక్ ఎలా కొట్టాడు అని ఫీల్ అవుతారు. ఇక వరాలు తో పాటు ఏరియా కౌన్సిలర్ ని తీసుకొని అందరూ నారాయణ ఇంటికి గొడవకి వెళ్తారు..

వరాలకు మైండ్ బ్లాక్..

సురేష్ అబద్ధం చెప్పి అందరిని గొడవకి తీసుకుని వెళ్తాడు. ఆ కార్పొరేటర్ ని తీసుకురండి అని చెప్పి తన భర్తతో చెప్తుంది అతను వెంటనే వెళ్లి కార్పొరేటర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి నారాయణ ఇంటి దగ్గరికి అందరూ కలిసి గొడవకు వెళ్తారు. వరాలు చేసిన రచ్చకు బయట ఉండే వాళ్ళు కూడా చూసి వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు అంటూ సపోర్ట్ చేస్తారు.. నా కూతురు జోలికి రావద్దు అని నా కొడుకు అంటే ఇలా కొట్టి పంపిస్తారా అడగండి సార్ మీరు అని వరాలు ఆవేశంగా అడుగుతుంది.. అదేంటి సార్ మీరే డైరెక్ట్గా వచ్చారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారా లేదా అని మాధవ్ ఎంత చెప్తున్నా సరే వరాలు మాత్రం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లొడ లొడ వాగేస్తూ ఉంటుంది.. వాళ్ళ అబ్బాయిని  మీరు దారుణంగా కొట్టారు అది చూస్తూనే కనిపిస్తుంది.. ఎందుకిలా కొట్టారు వాళ్ళ అమ్మాయిని ప్రేమించదు అని చెప్పినా కానీ మీరు ఎందుకు ఆ అమ్మాయి వెనకాలే పడుతున్నాడు అని అడుగుతాడు. మా అబ్బాయి వెళ్లి అమ్మాయిని ప్రేమించలేదు ఆ అమ్మాయి వచ్చి మా అబ్బాయిని ప్రేమించింది. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మీరు ఇలా మధ్యలో జోకింగ్ చేసుకుని మీ పెద్దరికాన్ని పోగొట్టుకోవద్దు అని మాట అంటాడు.. మొత్తానికి మాధవ్ ఇంటిదగ్గర ఒక పెద్ద రచ్చ జరుగుతుంది..

పోలీసులకు మహా దిమ్మతిరిగే షాక్..

Advertisement

పోలీసులు ఇంటికొచ్చి మీరు వాళ్ళ అబ్బాయిని కొట్టారని కంప్లైంట్ ఇచ్చారు. నిజంగానే మీరు వాళ్ళ అబ్బాయిని కొట్టారా లేదా అని అడుగుతారు. కొట్టామని చెప్తున్నాను కదండీ కానీ ఎందుకు కొట్టాము ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని ఎంతగా చెప్తున్నా సరే.. పోలీసులు మాధవ్ చెప్పిన మాటని వినకుండా ఉంటారు.. అప్పుడే మహాలక్ష్మి ఎంటర్ అవుతుంది.. వాళ్లు కంప్లైంట్ ఇచ్చారు కదా నిజానికి నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడడంతో పాటుగా తనని బుడదలో కూడా పడేశారు అని తెలుసుకొని తర్వాత మీరు ఇంటికి రావాల్సింది అని మహాలక్ష్మి రెచ్చిపోతుంది. అందుకే నా ఇంట్లో వాళ్ళందరూ కూడా సురేష్ ని కొట్టారు.

శైలు ఎంట్రీతో సీన్ రివర్స్..

మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే వరాలు మాత్రం తన కొడుకు తప్పేమీ లేదు అన్నట్లుగానే వెనకేసుకొచ్చి మాట్లాడుతుంది.. ఇక కేశవ శైలను తీసుకురమ్మని చింటూ చెప్పి పంపిస్తాడు.. తను వెళ్లి శైలుకి నిజం చెప్పి వెంటనే రమ్మని చెప్తాడు. ఇక ఇంటి దగ్గర జరుగుతున్న గొడవ చూసి శైలు ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఎలా పోలీసులు నీ తీసుకొని వస్తారు అని అందరిపై విరుచుపడుతుంది.. కేశవా నన్ను ఏమి బలవంతంగా ప్రేమించలేదు నేనే ప్రేమించాను అని చెప్పడంతో వరాలు నీకేం తెలీదు నువ్వు గమ్మునుండు అని ఎంతగా చెప్తున్నా సరే శైలు మాత్రం వాళ్లకి ఏమీ సంబంధం లేదు అని అంటుంది.

వరాలు కు షాక్.. గాయత్రి ఎంట్రీ..

Advertisement

నేను కంప్లైంట్ తీసుకుంటానమ్మా మీ అమ్మాయి వచ్చి మీకు వ్యతిరేకంగా పోలీసులకు చెప్తే నాకే సంబంధం లేదు అని అంటారు.. నేను చచ్చిన కూడా మా వాళ్లకి అనుకూలంగా మాత్రం అస్సలు చెప్పను అని అంటుంది. ఏంటే నువ్వు ఇలా తయారయ్యావు ఇంట్లో వాళ్ళ మీద కేసు పెడతానని అంటావా? కొంచమైనా సిగ్గుందా అని శైలుపై అరుస్తుంది వరాలు. ఇక గాయత్రి సడన్గా ఇంటికి వచ్చింది ఏంటి అని తాయారు కంగారు పడిపోతూ ఉంటుంది.. తన భర్త అసలు నిజం చెప్పడంతో గాయత్రీ అందుకోసమే ఇంటికి వచ్చిందా అని అనుకుంటుంది. ఇక గాయత్రీ కి రమణయ్య నిజం చెప్తాడు. ఇక గాయత్రి మా బావ అలాంటివాడు కాదు మా ఇంట్లో వాళ్ల గురించి నాకు బాగా తెలుసు అని మాధవ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.. ఇక మొత్తానికి గాయత్రి మళ్లీ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Brahmamudi Serial : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్లో మరో ట్విస్ట్..!

Big Stories

Advertisement
×