E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today Episode : పెళ్లి చేసుకున్న రవి, శృతి.. అడ్డంగా బుక్కయిన మీనా.. బాలు, మీనాను క్షమిస్తాడా?

Gundeninda GudiGantalu Today Episode : పెళ్లి చేసుకున్న రవి, శృతి.. అడ్డంగా బుక్కయిన మీనా.. బాలు, మీనాను క్షమిస్తాడా?
Advertisement

Gundeninda GudiGantalu Today Episode 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి, ప్రభావతి మాట్లాడుకుంటారు. ఇంట్లో తుఫాన్ లేనట్లు ఉంది అని రోహిణి అంటారు. గదిలోకి వెళ్లి బాలుకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు బాలు తాగుతూ ఉంటాడు. మీనా కోపంతో ఉంటుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఇక వీళ్లు నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వరు ఏదోకటి చెయ్యాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే మార్గం ఆలోచించాలి. అని సంజు కు ఫోన్ చేస్తుంది.. సంజుకు ఫోన్ చేస్తుంది.. శృతి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని చెప్పడంతో సంజు ఓకే అంటాడు. రవి మీనాకు అబద్దం చెబుతాడు. శృతి పేరెంట్స్ షాక్ అవుతారు. పెళ్లి శృతిని తీసుకోని వెళ్తానని చెబుతాడు. శృతిని రెడీ అవ్వమని వెళ్తాడు.. శృతి వాళ్ల అమ్మా నాన్న టెన్షన్ పడుతూనే శృతిని పంపించడానికి ఒప్పుకుంటారు. ఇక రవి మీనాతో బయటకు వెళ్తుంటాడు. ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా రెడీఅవుతుంది. రవి పిలుస్తాడు. వదినా రెడీ అయ్యావా అని అడుగుతాడు. నేను రెడీ అయ్యానా లేదా అని మూడోసారి అడుగుతున్నావు. మనం పెళ్లికి వెళ్లడం లేదు.. పెళ్లి పోస్ట్ పోన్ అయ్యేలా చేసుకోమని చెప్పడానికి వెళ్తున్నాం అని అంటుంది. ఇక బాలు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ అంటాడు రెడీ అవుతున్న అంటుంది. ఎక్కడికో అంటాడు. అప్పుడే మాట మారుస్తుంది. ఇక రవి బాగానే ఉన్నాడా? హ ఉన్నాడు.. ఆ శృతితో మాట్లాడలేదుగా అంటాడు. ఈరోజు నుంచి అస్సలు మాట్లాడడు అంటుంది. ఇక సరే నేను గుడికి వెళ్లి వస్తాను అని చెబుతుంది. ఇక సరే అని ఫోన్ పెట్టేస్తాడు. కారు నడుపుతుంటే పిల్లి అడ్డు వస్తుంది. ఏమైంది అని కస్టమర్ అడిగితే పిల్లి అంటాడు. సరే పోనివ్వు అంటాడు. నా ఇంటి దేవత కాదుగా అడ్డు రావడానికి అని అంటాడు. ఇక మీనా రెడీ అయి వస్తుంది..

Advertisement

మీనాను చూసిన ప్రభావతి ఎక్కడికి పెళ్లికి వెళ్తున్నట్లు ఇలా రెడీ అయ్యావు అని ప్రభావతి అడుగుతుంది. గుడికి వెళ్తున్న అత్తయ్య అంటుంది. పూలు అమ్ముకొనే మీ అమ్మను కలవడానికి వెళ్తున్నా అని చెప్పొచ్చు కదా అంటుంది. ఏదోకటి వెళ్ళని అని సత్యం అంటాడు. ఇక రవి నా బైక్ కీస్ ఎక్కడ అంటాడు. రోజు ఎక్కడ పెడతావో అక్కడే ఉంటాయి అంటుంది. కీస్ తీసుకొనేటప్పుడు రవికి పైన చెక్క తగులుతుంది. అందరు కంగారు పడతారు.. దానికి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా దెబ్బ తగిలితే అనుకున్న పని పూర్తి అవ్వదు అంటాడు సత్యమ్.. ఏం కాలేదు అని రవి అంటాడు. అరె ఇంక ఎన్ని రోజులుగా ఇలా లోనే అప్లై చెయ్యి లేకుంటే ఇంటి పత్రాలు ఇస్తాను లోనే పెట్టుకో అని అంటాడు. ప్రభావతి వాదిస్తుంది. సరే రా వదిన అంటాడు.. అది ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తుందిలే నువ్వు వెళ్ళు అంటుంది. అదే దారిలో కదా డ్రాప్ చేస్తాడు అని అంటాడు.

ఇక బయటకు వెళ్లిన మీనా మామయ్యకు కూడా అపద్దాలు చెప్పి వెళ్తున్నాం అని అంటుంది. దానికి రవి ఇక రేపటి నుంచి ఆ బాధలు ఉండవు అని అంటాడు. ఇక శృతి సంజును తీసుకొని వెళ్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. గుడి దగ్గరకు రాగానే సంజుకు అనుమానం వస్తుంది. పెళ్లి అన్నావు ఏది హడావిడి లేదు అంటాడు. సెంటిమెంట్ అంట ఇక్కడే చేసుకుంటున్నారు అంటుంది. ఇక గిఫ్ట్స్ మర్చిపోయాను తీసుకొని వస్తావా అని అడుగుతుంది.. సంజు వెళ్ళగానే సుమతి దగ్గరకు వెళ్తుంది. అంతా రెడీ గా ఉంది. ఇంక రవి రాలేదు అని అంటుంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు.. పెళ్లి కూతురు చీర తీసుకొని రమ్మని చెప్పానుగా అని అడుగుతుంది. ఆ చీర తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్తుంది.

Advertisement

అప్పుడే రవి వస్తాడు. మీనాను బయట ఉండమని వెళ్తాడు. మీనా ఇంకా రవి రాలేదని చూస్తుంది. లోపలికి వెళ్లిన రవి పెళ్లి డ్రెస్సు వేసుకొని కూర్చుంటాడు. కానీ సుమతి మంత్రాలూ మొదలు పెట్టండి అని టెన్షన్ పడుతుంది. దానికి శృతి ఏం కాదు అని అంటుంది. ఇక రవి ఇంకా రాలేదని మీనా లోపలికి వెళ్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనా లోపలికి వెళ్లి రవిని వెతుకుతుంది.. అప్పటికే శృతి మెడలో రవి తాళి కడతాడు రవి.. అది చూసి నా మెడకు చుట్టావా అంటుంది.. ఇక మీనా ఫోన్ వినిపించలేదని బాలు వెళ్తాడు. బాలు నిజం తెలుసుకుంటాడా? మీనా పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×