BigTV English

Shruti Hassan: శృతి డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా.. అసలేం జరిగిందంటే..?

Shruti Hassan: శృతి డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా.. అసలేం జరిగిందంటే..?

Shruti Hassan.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ (Shruti Hassan).. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. దాదాపుగా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో, ఈమె పని అయిపోయిందని ఇండస్ట్రీ నుంచి వెనుతిరుగుతుందని అందరూ కామెంట్లు చేశారు. వాస్తవానికి విశ్వనటుడు కమలహాసన్ (Kamal Hassan)వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఏ రోజు కూడా తన తండ్రి ఇమేజ్ ను ఆమె ఉపయోగించుకోలేదు. సొంత టాలెంట్ తోనే పైకి ఎదగాలనుకుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నెగిటివ్ మూటగట్టుకుంది. అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న శృతిహాసన్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో శృతిహాసన్ నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి.


యాక్షన్ రోల్ లో మెప్పించడానికి సిద్ధమైన శృతిహాసన్.

ముఖ్యంగా టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు గత ఏడాది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరో అడివి శేష్ (Adivi shesh) హీరోగా నటిస్తున్న డెకాయిట్ (Decoit) ప్రాజెక్టులో భాగమైన విషయం తెలిసిందే. ఇందులో అడివి శేష్ పక్కన హీరోయిన్ గా నటించడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.


డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు..

అయితే ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో తొలిసారి ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.ఇందులో అడివి శేష్ ,శృతిహాసన్ వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమించుకుంటారని కూడా టీం చెప్పుకొచ్చింది. దీనికి తోడు వచ్చే యేడాది అనగా 2025లో ఈ సినిమాతో పాటు మరో కొత్త మూడు సినిమాలు కూడా విడుదల చేస్తానని అడివి శేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదంతా నిజమేనా..?

అసలు విషయంలోకి వెళితే డెకాయిట్ సినిమాలో శృతిహాసన్ యాక్షన్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చిత్రీకరణలో భారీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత చిత్ర బృందంతో విభేదాలు వచ్చాయని, ఆ కారణంగానే శృతిహాసన్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు శృతిహాసన్ కూడా షూటింగ్లో పాల్గొనడం మానేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మానేస్తే సినిమాకి ఇబ్బంది అవుతుందని భావించిన చిత్ర బృందం, ఆమెతో ఎలాగైనా సరే సమస్యను పరిష్కరించి ముందుగా అనుకున్నట్లుగా చిత్రీకరణ కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×