E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని ఆడుకున్న శృతి.. బాలును అవమానించిన మౌనిక.. రవిని కొట్టిన శృతి…

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని ఆడుకున్న శృతి.. బాలును అవమానించిన మౌనిక.. రవిని కొట్టిన శృతి…
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ షాప్ కి వెళ్లి నా పరిస్థితి ఏంటి దేవుడా బిజినెస్ మాన్ అవ్వాలని ఎంతో అనుకున్నాను కానీ ఇలా మార్చేసావ్ ఏంటి అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు.. మీ చుట్టూ ఉన్నవాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అది చూసి ఈ షాక్ లో ఉంటాడు మనోజ్… రోహిణి రాగానే ఆ విషయాన్ని చెప్తాడు.. ఆ లెటర్ ని చూసినా రోహిణి ఎవరో ఫ్రాంక్ చేసి ఉంటారులే అని అంటుంది.. కానీ మనోజ్ మాత్రం ప్రాంక్ అయితే కచ్చితంగా కెమెరాలు ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేవు అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరూ కావాలని ఇది చేస్తూ ఉంటారులే నువ్వు అవేమీ పట్టించుకోవద్దు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వు అని రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. కొత్త కారులో గుడికి వెళ్లిన ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పడి మొత్తానికైతే కలిసిపోతారు.. ఇద్దరూ దూరంగా వెళ్లిన వచ్చేటప్పుడు కలిసి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..శృతి రవి సిగ్గుబిళ్ళ ఫోటో ని చూసి ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు మీనా ఏంట్రా శృతిని ఏడిపిస్తున్నావా అని అడుగుతారు.. నేను ఏడిపించడం కాదు అదే నన్ను ఏడిపిస్తుంది అని రవి అంటాడు.. దాని గురించి తెలుసుకున్న మీనా ఆ ఫోటోని ఇప్పుడు చూపించకుండా ఉండడమే మంచిది అని అంటుంది. ఇక ప్రభావతి సత్యం ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. వీరిద్దరూ మొత్తానికి కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటారు. మొత్తానికి ఒక్కటైన ఈ జంటతో ఇంట్లోని వాళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటారు. మీనా తో పాటు శృతి కూడా ప్రభావతిని ఆడుకుంటుంది. ప్రభావతి సత్యం ఇద్దరూ కలిసిపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు.. ప్రభావతి మాత్రం వాళ్ళందరూ అంటూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది.

Advertisement

సంజయ్ ఏదో పార్టీకి వెళ్లాలని అర్జెంటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తనని ఆపిన సువర్ణ.. నువ్వు ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకొని రమ్మన్నారుగా అని అంటుంది. దీన్ని నా పక్కన ఉండనించడమే గొప్ప. అలాంటిది ఇప్పుడు పార్టీకి తీసుకెళ్లాలంటే అస్సలు బాగోదు అని ఒకరకంగా అవమానించేలా మాట్లాడుతాడు. మౌనికని నీతో పాటు పంపించమని నాకు పదే పదే చెప్పారు.. నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్లాల్సిందే.. నువ్వు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లకపోతే ఇంక బాగోదు అని సువర్ణ అనగానే సంజయ్ అయితే వెళ్లి మంచి చీర కట్టుకుని రమ్మని చెప్పు… తగలడమను తీసుకుని వెళ్తాను అని అంటాడు సంజయ్..

మౌనిక చీర కట్టుకొని రావడంతో సంజయ్ ఆమెను పార్టీకి తీసుకొని వెళ్తాడు. మంచి చీర కట్టుకుని రమ్మన్నాను కానీ నువ్వు ఇలాంటి చీర కట్టుకొని వస్తావని అస్సలు ఊహించలేదు. ఇక పార్టీకి వెళ్ళగానే ఇదే ఏడుపు కొట్టు మొహాన్ని కంటిన్యూ చేయొద్దు అని అంటాడు.. పార్టీ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడే ఎక్కడో చోట ఉండు అని అంటాడు.. కాస్ట్లీ పార్టీలో ఎలా ఉండాలో నీకు తెలుసా? నీకు ఎలాగో పార్టీలో ఎలా ఉండాలో కూడా తెలియదు అని మౌనికను సంజయ్ అవమానిస్తాడు..

Advertisement

ఆ పార్టీకి గెస్ లోను తీసుకొచ్చిన బాలు అక్కడున్న మౌనికని చూస్తాడు. మౌనిక ఎక్కడుంది ఏంటి అని మౌనికను పిలవబోతాడు కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్న వాచ్ మెన్ బాలుని లోపలికి రానివ్వడు. బాలు నా చెల్లి లోపల ఉంది అని ఎంతగా చెప్పినా సరే అతను రానివ్వడు.. తర్వాత ఫోటో చూపించడంతో లోపలికి పంపిస్తాడు. మౌనికతో బాలు మాట్లాడటం సంజయ్ చూస్తాడు.. ఇప్పుడు మౌనిక మాట్లాడితే దీన్ని సంగతి చెప్తాను అని సంజయ్ చాటుగా వింటుంటాడు.. మౌనిక సంజయ్ చూస్తే బాగోదు అని కచ్చితంగా తెలియదని చెప్పాలని మౌనిక బాలు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది.

బాలు మౌనిక దగ్గరకు వెళ్లి నీ పర్సమ్మా ఇక్కడ పడిపోయింది అని అంటాడు.. మౌనిక బాలుని చూసి షాక్ అవుతుంది. అన్నయ్యని ఆయన గనక చూస్తే కచ్చితంగా నన్ను చంపేస్తాడు నాకు కాపురం ఎలాగైనా కాపాడుకోవాలి అని అతను ఎవరో నాకు తెలియదు అని అక్కడున్న బాడీగార్డ్ తో చెప్తుంది. ఆ మాట వినగానే బాలు షాక్ అవుతాడు.. నేను నా సర్వీస్ లో చాలామందిని చూశాను నువ్వు ఇక్కడికి తినడానికే వచ్చావు కదా అని ఆ బాడీగార్డ్ బాలుని బయటకి గెంటేస్తాడు..

Also Read :బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ గా పాన్ ఇండియా హీరో.. ఎవరంటే?

ఇక శృతి పిల్లలు కనడం చాలా కష్టంగా ఉంది నేను పిల్లల్ని కనను కనీసం నేను దగ్గర కూడా రానివ్వను అని అంటుంది. ఆ మాట వినగానే రవి షాక్ అవుతాడు.. సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని అనుకుంటుంది. రవి ఎంత చెప్తున్నా సరే శృతి వినకపోవడంతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక బాలు మౌనిక అలా మాట్లాడడం తట్టుకోలేకపోతుంటాడు.. ఇంటికి రాగానే మీనా ఏమైంది అని అడుగుతుంది.. బాలు మౌనిక కనిపించింది కానీ తన మాటలు విని నేను చాలా బాధపడ్డాను అని అనగానే మీనా అర్థం చేసుకున్నాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు కొత్త కార్ని రాజేష్ కి ఇస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×