E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ గా పాన్ ఇండియా హీరో.. ఎవరంటే?

Bigg  Boss 9 Telugu : బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే కు గెస్ట్ గా పాన్ ఇండియా హీరో.. ఎవరంటే?
Advertisement

Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ కు ఏ రేంజ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాల్గవ సీజన్ తర్వాత అంతటి రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ ఈ సీజన్ కి వచ్చింది.. కంటెస్టెంట్స్ కూడా విన్నర్ అయ్యేందుకు బాగానే కష్టపడుతున్నారు. దాంతో ఈ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం 15 వ వారం కొనసాగుతున్న ఈ షో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు గెస్టుగా టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రాబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

ఫినాలే ఎపిసోడ్ కు గెస్ట్ ఎవరంటే..? 

బిగ్ బాస్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడం తో, ముఖ్య అతిథి ని కూడా సీజన్ కి తగ్గట్టు గానే పిలుస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్.. గతంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చాడు. ఈసారి మరో స్టార్ హీరోని కూడా దించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్.. ఈయన నటిస్తున్న రాజా సాబ్ మూవీ జనవరి కానుక ప్రేక్షకులకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. గత సీజన్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. గత సీజన్ కంటే ఆయన మూడు సార్లు బిగ్ బాస్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ రావడం మాత్రం ఇదే తొలిసారి.. ప్రభాస్ వస్తే ఈ సీజన్ బిగ్ బాస్ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఎవరు వస్తారో..

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ బాలు పెళ్లి ఫిక్స్..? శ్రీముఖి మాత్రం కాదు..

టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా..? 

గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ మాత్రం టాప్ రేటింగ్ గా దూసుకుపోతుంది. ప్రతీ వారం ఈ సీజన్ లో 10 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అయ్యాయి. మరో రెండు రోజుల్లో ఈ సీజన్ పూర్తి కాబోతుంది..టైటిల్ విన్నింగ్ రేస్ నిన్న మొన్నటి వరకు కేవలం తనూజ, పవన్ కళ్యాణ్ మధ్య మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు డిమోన్ పవన్ కూడా ఇప్పుడు చేరాడు. ఈ సీజన్ ఎవరు విన్నర్ ట్రోఫీని అందుకు పోతున్నారు అన్నది రోజురోజుకీ ఆసక్తిగా మారుతూ వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ తనుజాల పేర్లు వినిపిస్తున్నాయి. మరి పవన్ కూడా ఈ లిస్టులోకి చేరడంతో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మాత్రం ట్రోఫీని అందుకోబోతున్నారని జనాలు ఫిక్స్ అయిపోయారు. ఎవరు విన్నర్ గా నిలుస్తారు? ఎవరు 50 లక్షలు ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటారు తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×