E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: లక్ష కోసం మనోజ్ ప్లాన్.. పోటీలో పాల్గొంటున్న మీనా, బాలు.. ప్రభావతి, సత్యం దొరికిపోయారే..?

Gundeninda GudiGantalu Today episode: లక్ష కోసం మనోజ్ ప్లాన్.. పోటీలో పాల్గొంటున్న మీనా, బాలు.. ప్రభావతి, సత్యం దొరికిపోయారే..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. స్వామీజీ దగ్గరకు వెళ్లిన ఆయన చెప్పినట్లు చెయ్యడానికి ఒప్పుకుంటాడు. నువ్వు నేను చెప్పినట్టు చేయకుంటే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడతావు అని స్వామీజీ హెచ్చరిస్తాడు.. మనోజ్ చేసేది ఏమీ లేక మీరేం చెప్తే అది చేస్తాను నాకు ఈ గండం నుంచి బయటపడండి అని అంటాడు.. అక్కడినుంచి మణికంఠను తీసుకొని వెళ్ళిపోతాడు మనోజ్. బాలు ఇంటికి వచ్చేటప్పుడు ఒక డబ్బాని తీసుకొని వస్తాడు. ఏంటి వినాయకుడు చందాల కోసం డబ్బాలు తెచ్చినట్టు అలా ఉందేంటి అని ప్రభావతి అంటుంది.. ఆ మాట వినగానే బాలు గుడి ముందర అడుక్కోవడం అలాంటివి మాకు రావు మీ పెద్ద కొడుకు వచ్చినంతగా మేము అంత ఎక్స్పీరియన్స్ కాదులే అని అంటాడు. మేము ఇంటిపై గదిని కట్టాలని అనుకుంటున్నాం కదా.. దానికోసం డబ్బులను దాచిపెట్టడానికి ఈ హుండీని తీసుకొచ్చాను అని బాలు అంటాడు. . ఏంటి వీడు అవుతారు ఏంటి వీడేంటి ఇలా ఉన్నాడు అని ప్రభావతి అడుగుతుంది. మనోజ్ చెప్పిన మాటతో ప్రభావతికి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. గదిలో యోగా చేస్తున్న మనోజ్ ను చూసి రోహిణి భయపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రవి మా రెస్టారెంట్లో కపుల్స్ కోసం ఒక కాంటెస్ట్ ఏర్పాటు చేస్తారు. అందులో పాల్గొనే జంటలల్లో ఎవరు బెస్ట్ కపుల్ గా అనిపిస్తారో వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు అని అంటారు. ఇలాంటివన్నీ మాకెందుకు మాకేం అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. కామాక్షి మాత్రం మీ అత్తయ్య కూడా పాల్గొనవచ్చా అని అంటుంది. వయసుతో సంబంధం లేదు వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పి అక్కడ వాళ్ళని మెప్పించాలి అని రవి అంటాడు. కానీ ఎవరికి వారే మేం రాలేము అని అనుకుంటారు. శృతి మీరు వస్తారేమో ప్రైజ్ మనీ లక్ష రూపాయలు మనకే వస్తుందని అనుకున్నాను అని అంటుంది. ఏంటి లక్ష అని ప్రభావతి షాక్ అవుతుంది. మనోజ్ నాలాంటి బిజినెస్ మాన్లు ఇలాంటి పోటీలో పాల్గొనలేరు అని అంటాడు.. ఇక బాలు మీనా కూడా ఎన్ని కష్టాలు పెడతారో అని బాలు కూడా పోటీలో పాల్గొనమని వెళ్లిపోతారు.. ప్రభావతి కామాక్షి మాత్రం ఈ పోటీలో ఎలాగైనా పాల్గొని లక్ష రూపాయలు కొట్టేయాలని అనుకుంటారు..

Advertisement

గదిలోకి వెళ్లిన మనోజ్ రోహిణి తో ఈ పోటీలో ఎలాగైనా సరే గెలవాలి అని అంటాడు.. తర్వాత ఈ పోటీలో మనం ఎలాగైనా సరే పాల్గొనాలి అని రోహిణి తో అంటాడు.. నాకు ఆడే సత్తా ఉంది నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి ఎలాగైనా సరే మనం ఈ పోటీలో పాల్గొని ఆ లక్ష రూపాయలు సొంతం చేసుకుంటే బాలుకి ఆ లక్ష చేయొచ్చు అని అంటారు.. ఆ తర్వాత రెండు నెలలు 50 ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని మనోజ్ అంటాడు.. ఏమో నాకు మాత్రం ఏదో తేడాగా ఉంది అని రోహిణి అంటుంది. ఇందులో తేడా ఏమీ లేదు రోహిణి మనిద్దరం ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నాము ఆ లక్ష రూపాయలు ఎలాగైనా గెలుస్తాము అని మనోజ్ ధీమాగా ఉంటాడు.

ఇక ఆ తర్వాత ప్రభావతి ఆ లక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఎలాగైనా సరే ఈ లక్ష రూపాయలు మనమే కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది. నిద్రపోతున్న సత్యాన్ని లేపి ఈ లక్ష రూపాయల కోసం మనం కాంపిటీషన్ కి వెళ్ళాలి అండి అని అంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఏదో పెడతావని ఈ వయసులో మనం ఏమీ కాంపిటీషన్ కి వెళ్తాము అని సత్యం అంటాడు. కానీ ప్రభావతి మాత్రం పాతికేళ్ళు మన కాపురం. మనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు కదా అందుకే మనమే పోటీలో పాల్గొనాలి అని అంటుంది. ఏదో ఒకటి ఏడుద్దాం రేపు చూద్దాంలే పడుకో అనేసి అంటారు సత్యం.

Advertisement

రవి, శృతి ఇద్దరూ కూడా ఈ పోటీ గురించి మాట్లాడుకుంటారు. మనం ఇద్దరం ఈ పోటీలో పాల్గొంటే ఆ లక్ష రూపాయలు తో మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానని శృతి అంటుంది.. ఈ పోటీ వద్దన్నావు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ పాల్గొందామని అంటున్నామని శృతితో రవి అంటాడు. దీంట్లో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి తెలుసా అని రవి అనగానే మనిద్దరం చూసుకుందామని ఇద్దరు గొడవపడతారు. అటు బాలు మీనా కూడా ఈ పోటీలో లక్ష రూపాయలు గెలిస్తే మనం పైన గది వేసుకోవడానికి తొందరగా పనవుతుంది అని అనుకుంటారు. అయితే ఈ పోటీలో పాల్గొనాలి అంటే మనకి పెద్దగా చదువు రాదు కదా అని అనుకుంటారు.

అక్కడకు చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు వస్తారేమో. మనం ఈ పోటీలో పాల్గొంటామో లేదో అని బాలు అనగానే మీనా డబ్బులు గురించి ఆలోచించాలి తప్ప.. ఈ పోటీలో ఎలాంటి వారొస్తారు అన్న విషయాన్ని గురించి మనం పట్టించుకోవద్దు అని సలహా ఇస్తుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావ్ నువ్వు కూడా చక్కని చుక్కగా ఉన్నావు మనం కూడా ఈ పోటీలో పాల్గొని గెలిచి ఆ లక్ష రూపాయలు ని కొట్టేద్దామని అనుకుంటారు.. ఉదయం లేవగానే ఏ జంటగా జంట ప్రత్యేకంగా కనిపించాలని డ్రెస్సులు వేసుకుంటారు.

ప్రభావతి నడకని చూసి సత్యం కామెంట్ చేస్తాడు. మొత్తానికి మనోజ్ రోహిణి, సత్యం ప్రభావతి అందరు కిందికి వస్తారు. ఇక్కడే ఉన్న బాలు ఏంటి మీరు ఇద్దరు అందాల పోటీలకు వెళ్తున్నారా ఏంటి మీకు గెటప్పులు చూస్తే కాస్త తేడాగా ఉన్నాయి అని అంటాడు. మేము గుడికి వెళ్తున్నాము అని ప్రభావతి అంటుంది. మనోజ్ రోహిణి కూడా ఫర్నిచర్ షాప్ కి అలాగే పార్లర్ కి వెళ్తున్నామని అంటారు. మొత్తానికి ఆ పోటీకి ముందుగా రవి శృతి వెళ్తారు. అక్కడ ఈవెంట్ మేనేజర్ చెప్పిన పనిని వాళ్ళు చేస్తారు. జంటలుగా వచ్చిన వాళ్ల పేర్లు అన్ని బుక్ లో ఎంట్రీ చేయించాలని చెప్పగానే వాళ్ళు సరే కాసేపు మాకు కూడా కాలక్షేపం అవుతుంది అని అక్కడ కూర్చుంటారు.

Also Read : ‘నువ్వు లేక నేను లేను ‘ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

వచ్చిన జంటలందరూ ఆ బుక్ లో సంతకాలు చేసి లోపలికి వెళ్ళిపోతారు. మనోజ్ రోహిణి రవి శృతిలకు అడ్డంగా దొరికిపోతారు. నిన్న ఏవేవో కోతలు కోసవు ఇప్పుడు మాత్రం ఈ పోటీకి వచ్చావు అని రవి మనోజ్ ని అంటాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ప్రభావతి సత్యం కూడా అక్కడికి వస్తారు. కామాక్షి రంగా కూడా రావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×