E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శోభాతో శృతి గొడవ.. సత్యం ఇంట బొమ్మకొలువు.. మనోజ్ పై బాలు ఫైర్..

Gundeninda GudiGantalu Today episode: శోభాతో శృతి గొడవ.. సత్యం ఇంట బొమ్మకొలువు.. మనోజ్ పై బాలు ఫైర్..

Gundeninda GudiGantalu Today episode February 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవికి రాత్రి వాళ్ళ బాస్ ఫోన్ చేయడంతో శృతి సీరియస్ అవుతుంది.. రవి శృతిని తన డబ్బింగ్ స్టూడియో వరకు వెళ్లి క్షమాపణ చెప్తాడు దాంతో శృతి కూల్ అవుతుంది. ఇక తర్వాత రాత్రి ట్రిప్ కు వచ్చిన డబ్బులను లెక్కపెడుతూ ఉంటారు మీనా బాలు.. అయితే వాళ్ళిద్దరూ డబ్బులని లెక్కపెడుతూ పొద్దున జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. తాతయ్య అమ్మమ్మ ఎంత కష్టపడుతున్నారో చూసారా ఈరోజుల్లో వాళ్ళు అంత కష్టపడడం ఏం బాగోలేదు కదా అని మీనా బాలు మాట్లాడుకుంటూ ఉంటారు..

మనం ఆ వయసు వస్తే అలా కొడుకుల మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడేలా డబ్బులు సంపాదించి పెట్టుకోవాలి అని మీనా అంటుంది. మీనా నిజమే ఇప్పుడు మనం అర్జెంటుగా ఇల్లు కట్టేసి ఆ తర్వాత మనకోసం మనం సంపాదించి పెట్టుకోవాలి అని బాలు అంటాడు. ఆ తర్వాత మనం ముసలి వాళ్ళమైతే ఎలా ఉంటుందో అని బాలు కలలోకి వెళ్లి ఊహించుకుంటాడు. నా బాలు ఇద్దరూ ఎంతో చక్కగా అందంగా కనిపిస్తారు. రవి, నీతులను షాపింగ్ మాల్లో చూసిన శోభా ఈ విషయంలో ఎలాగైనా సరే శృతికి అన్యాయం జరుగుతుందని భావిస్తుంది.. ఈ విషయాన్ని వెంటనే శ్రుతికి చెప్పాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రవి, తన బాస్ తో కలిసి షాపింగ్ రావడం చూసిన శోభా వాళ్ళిద్దరు చూసి అనుమాన పడుతుంది.. ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని సోపాన్ని అనగానే.. మీరు చెప్పు కదా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని రవిని శోభా అడుగుతుంది.. నీతూ గురించి చెప్పగానే శోభ కి అనుమానం మొదలవుతుంది.. వాళ్ళిద్దర్నీ చూసి శోభ ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.. ఇది అల్లుడు గారిని వలలో వేసుకునేలా ఉంది. శృతికి చెప్పకపోతే కూతురు జీవితాన్ని నాశనం చేసిందని అవుతానని శోభ అనుకుంటుంది. శృతికి నిజం చెప్పాలని వెళ్తుంది శోభ. డబ్బింగ్ స్టూడియో లోకి వెళ్ళిన శోభ శృతి తో మాట్లాడుతుంది.. అవి ఒక అమ్మాయి తో వచ్చాడని ఎంత చెప్తున్నా సరే..

శృతి మాత్రం నాకు రవి గురించి అన్ని విషయాలు తెలుసు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టొద్దు.. ఇకనుంచి వెళ్ళు నాకు చాలా పని ఉంది అని శోభా కి షాక్ ఇస్తుంది.. నువ్వు అల్లుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకానీ మీరిద్దరూ ఇలా డిస్టర్బ్ అవ్వాలని నేను కోరుకోను కదా.. జాగ్రత్త పడు అని శోభా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక మీనా ను హగ్ చేసుకున్న బాలుని ఎవరో దొంగ అనుకోని కత్తితో పొడవుపోతుంది మీనా.. ఇకమీదట నీతో ఏదైనా అనాలి అంటే జాగ్రత్తగా ఉండాలి అని బాలు అనుకుంటాడు.. అయినా మీరు ఇంత తొందరగా వచ్చారు ఏంటి అని బాలుని అడుగుతుంది మీనా.

ట్రిప్ అయిపోయింది అందుకే తొందరగా వచ్చాను.. మీరు వచ్చి మంచి పని చేశారు. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని మీనా సిగ్గుపడుతుంది.. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడుగుతుంది.. ఇంట్లో బొమ్మలు కోలువు పెట్టాలని అనుకుంటున్నాను. చిన్నప్పుడు నుంచి నాకు ఆ కోరిక ఉండేది.. మా ఇంట్లో అలాంటి వసతి లేదు కాబట్టే అప్పుడు పెట్టలేకపోయాను ఇప్పుడు ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను.. అయితే ఈ బొమ్మలకొలువు గురించి అత్తయ్య అసలు ఒప్పుకోదు కదా.. అయితే ఇంటి పెద్దని అడిగితే ఒప్పుకుంటాడు అని బాలు సలహా ఇస్తాడు. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి సత్యంతో చెప్తాడు బాలు.

మీ అమ్మ ఈ బొమ్మల కొలువు పెట్టడానికి ఒప్పుకుంటుందా అని పుట్టాలని ప్రభావతి గురించి సత్యం ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడు ఇంటికి వచ్చిన రోహిణి చూసి ప్రభావతి ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు అని అంటుంది.. నేను ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను నువ్వు అప్పుడే వచ్చేశావు అని సత్యం అంటాడు… నేనా ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టాలని అనుకుంటుంది.. అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా..? బొమ్మల కొలువు పెడితే మంచిదే కదా ఇంటికి వారసులు వస్తారు కదా.. అయితే బొమ్మల కొలువు రోహిణి చేత పెట్టిస్తే బాగుంటుంది కదా అనేసి ప్రభావతి అంటుంది..

ఎవరు పెట్టినా సరే ఇంటికి వారసులు వస్తారు కదా.. ఎవరు పడితే ఏంటి ఎవరు పెడితే ఏంటి అని సత్యం అంటాడు. మొత్తానికి ప్రభావతిని బుట్టలో వేసేసి బొమ్మలకొలువు పెట్టడానికి సత్యం ఒప్పిస్తాడు. ఇక బాలు అమ్మ అంత బాగా పాడుతుంది నాన్న అని ఎంత అడుగుతున్నా సరే సత్యం ఆ బీభత్సాన్ని నువ్వే చూస్తావు కదా అని అంటాడు.. ఇక బొమ్మల కొలువు పెట్టడానికి మీరు ఒప్పించారు.. ఇక షీలాకు అసలు విషయం చెప్పాలి లేకపోతే మనల్ని చంపేస్తుంది అని బాలు అంటాడు.. బొమ్మల కొలువు గురించి షీలాకు చెప్తారు.. ఇక సుశీల నేను కూడా వస్తాను అని అంటుంది..

ప్రభావతిని కామాక్షిని బొమ్మల కొలువు పెట్టడానికి స్థలం కావాలని అడుగుతుంది.. నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా.. పెద్దగా ఉండే ఇంటిని చూడు మళ్ళీ బొమ్మలు కొరకు అయిన తర్వాత మళ్లీ వాళ్ళ ఇంటిని వాళ్ళకి చేద్దామని ప్రభావతి అంటుంది.. మొత్తానికి కామాక్షి నన్ను బాగా వాడుతున్నావ్ కదా ఏదో ఒకటి చేస్తానని అంటుంది.. ఇంకా ప్రేమ్కుమార్ తన గర్ల్ ఫ్రెండ్ తో సరసాలు ఆడుతూ ఉంటాడు. అయితే వాళ్ల ఇద్దరినీ మీనా చూస్తుంది.. ఏం చేస్తున్నారు మీరు.. మీ వయసెంత ఇక్కడ ఇలాంటి పనులు చేయడానికి మీకు బుద్ధి లేదా అని నేను అడుగుతుంది.. ఇంట్లోని వాళ్ళు బుద్ధిగా డాన్స్ నేర్చుకోమని పంపిస్తే మీరు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తారా అని మీనా సీరియస్ అవుతుంది..

Also Read : నర్మదకు నిజం చెప్పిన సాగర్.. ప్రేమ, ధీరజ్ ల రొమాన్స్.. శ్రీవల్లి ప్లాన్ అట్టర్ ప్లాప్..

అంతేకాదు ఇలాంటి పనులు ఇంకొకసారి చేస్తే మీకు అసలు బాగోదని మీనా వార్నింగ్ ఇస్తుంది.. ఇక వాళ్ళిద్దరూ మీనా గురించి ఎలాగైనా సరే మాస్టర్ కి తప్పుగా చెప్పి తిట్టించాలని అనుకుంటారు.. అయితే మీనా నిజం చెప్పిన సరే ప్రభావతి వాళ్ళ మాట వినదు. కానీ ప్రభావతి మాత్రం డాన్స్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. అయితే మీనా ఎంత వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిన సరే.. ప్రభావతి మాత్రం నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో అని అంటుంది.. ఇక బొమ్మలు కొలువు గురించి మనోజ్ కి చెప్పిన బాలు సెటైర్లు వేస్తాడు. ఇక బాలు మనోజుల మధ్య రోజు జరిగే గొడవ ఈరోజు కాస్త ఆసక్తికరంగా మారుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు రోహిణి బాలు గురించి ఇంట్లో చెప్తుందా లేదా అన్నది చూడాలి..

Related News

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Karthika Deepam 2 Suraj : ‘కార్తీక దీపం 2 ‘ సూరజ్ రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన మిస్సమ్మ 

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి రివేంజ్.. అవనిపై పోలీస్ కంప్లైంట్.. మీనాక్షి అరెస్ట్..?

Podarillu Today Episode : చక్రీని కొట్టిన ఆది..చక్రీ కోసం వెతుకుతున్న అన్నదమ్ములు.. మహాకు మళ్ళీ పెళ్లి..

Big Stories

×