BigTV English

Gundeninda GudiGantalu Today episode: అత్తింటిలోకి అడుగు పెట్టిన శృతి.. ఒక్కమాటతో ప్రభావతి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: అత్తింటిలోకి అడుగు పెట్టిన శృతి.. ఒక్కమాటతో ప్రభావతి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode January 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే ప్రభావతి పూజ చేస్తుంది. నా కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలాగా ఉండాలనుకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకొని పూలమ్ముకునేదాన్ని నా కోడలుగా తీసుకొచ్చారు దేవుడా ఇప్పుడు నా చిన్న కోడలు ఎంతో కోటీశ్వరుడు ఆమె నా ఇంట్లో అడుగుపెట్టబోతుంది నా ఇల్లును కూడా మార్చే అనేసి దేవుని ప్రార్థిస్తుంది. ఇక మీనా వంట చేస్తుంటే ప్రభావతి హడావిడి చేస్తుంది. ఇంకా ఉడకలేదా వేడి వేడి వచ్చినప్పుడు ఎలా పెడతామనుకుంటున్నావు అని అంటుంది. బాలు ఇంకా వెళ్లలేదని తెలుసుకొని షాక్ అవుతుంది.. ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది ఇంట్లోకి వెళ్ళను రానివ్వడు అని ప్రభావతి అనుకుంటుంది. బాలు వచ్చేలోగా క్యారేజ్ కట్టి సిద్ధం చేస్తుంది ప్రభావతి. అలాగే నాకు ఆకలేస్తుంది తింటానంటే బలవంతంగా కూర్చోబెట్టి బాలు పై ఎక్కడ లేని ప్రేమ వలకబోసి భోజనం వడ్డిస్తుంది. తల్లి ప్రేమను చూసి కొత్తగా నా పైన ఇంత ప్రేమను చూపిస్తుంది ఏందా? అనుకుంటాడు బాలు. ఇది కలనా..నిజమా.. అని పక్కనే ఉన్న మనోజ్ ను గిచ్చుతాడు. కానీ, ఎనలేని విధంగా తనపై తన తల్లి ప్రేమ కురిపించడంతో అనుమానం వస్తుంది. మనోజ్ తనకు ఆకలి అవుతుందని టిఫిన్ పెట్టమని అడుగుతాడు. ఓ అరగంట ఆగితే పోయేది ఏమీ కాదు. వాళ్లు వస్తున్నారు అంటూ నోరు జారుతుంది ప్రభావతి. ఎవరు వారని సత్యం .. సత్యం అసలు నిజం చెప్పేస్తుంది. శృతి, రవీలు ఇంటికి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి, శృతిలకు చూసిన ప్రభావతి కాళ్లు చేతులు ఆడవు. తన కొడుకు ఆస్తి ఉన్న కోడలు ఇంటికి రావడంతో ఆనందంలో మునిగిపోతుంది. తన అదృష్టదేవత ఇంట్లో అడుగుపెట్టబోతుందని భావిస్తుంది. కానీ, మనోజ్ అసూయపడుతాడు. రవి ఇంట్లోకి వస్తే.. తనకు రెస్పెక్ట్ ఉండదని భావిస్తాడు. రవి, శ్రుతిలు ఇంటికి రావడం సత్యం కూడా నచ్చదు. దీంతో సైలెంట్ గా ఉండిపోతాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి రవి,శ్రుతిలు ఇంట్లో కాలు పెడుతున్నారు. కాబట్టి.. హారతి ఇవ్వమని రోహిణిని పిలుస్తోంది. కానీ, అందులోనే మీనా హారతి తీసుకొని వస్తుంది. కానీ, ఆ హారతి పళ్లేన్నా రోహిణి ఇవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఇక రోహిణి హారతి తీసుకురావడానికి వెళ్తే మీనా హారతి తీసుకొని వస్తుంది. హారతి రోహిణి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ మీనా హారతి తీసుకోవడం చూసి ప్రభావతి రోహిణికివ్వు రోహిణి ఇస్తుంది అని అంటుంది. దానికి శృతి మీనా ఇస్తే ఏమైనా తప్పు జరుగుతుందా ఆంటీ అని అడుగుతుంది.. అదేం లేదమ్మా అని అనగానే మీనాని ఇవ్వాలి అని శృతి అంటుంది ఇక రవి రోహిణి వదిన మీనా వదిన ఇద్దరు కలిసి ఇవ్వండి అని అంటాడు.

హారతి ఇచ్చిన తర్వాత ప్రభావతి శృతిని కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెబుతుంది. కుడికాలు ఏంటి.. ఎడమకాలి ఏంటి.. రెండు కాళ్లు నావే కదా.. అంటూ ప్రభావతికి తింగరి సమాధానం ఇస్తుంది శృతి. మరోవైపు బాలు తన రూమ్ నుండి అరుస్తాడు. దీంతో మీనా వెంటనే వెళ్లి బాలు రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది.. బాలు వస్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడు అని ఇటు సత్యం అటు ప్రభావతి టెన్షన్ పడుతుంటారు. నన్ను రూమ్లో పెట్టి లాక్ ఎవరు చేశారు? అయినా ఇంట్లో హడావిడి ఏంటి? ఎవరు వచ్చారు? అని మీనాను ప్రశ్నిస్తాడు బాలు. రవి, శృతి ఇంటికి వచ్చారని చెప్పగానే బాలు ఆవేశం కట్టలు పెంచుకుంటుంది. ఎవర్రా ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఎలా కాలు పెట్టావు ? అంటూ రవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అడ్డుపడుతుంది. బాలుకి శృతి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది.. వాళ్ళని సత్యం ప్రభావతి ఇద్దరూ ఆపుతారు. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు.. శృతిని దీపం వెలిగించమని ప్రభావతి అంటుంది. ఇంట్లో ఎంత వెలుగు ఉండగా.. లైట్లు ఉండగా.. దీపం ఎందుకు పెట్టాలి అంటుంది శ్రుతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా దీపం ఎందుకు పెట్టాలో అసలు విషయం చెబుతుంది. ఇలా మొత్తానికి ప్రభావతి కల నెరవేరుతుంది


శృతి ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి తన గొప్పలు చెప్పుకుంటుంది మీ ఇంట్లో మీరు ఇంట్లోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనగానే శృతి మీరేం కష్టపడ్డారు ఆంటీ అంతా మీనా వల్లే కదా జరిగింది అని ప్రభావతి గాలి తుస్సున తీసేస్తుంది.. మీనా లేకపోతే నేను మీ ఇంట్లో అడుగు పెట్టే దాన్ని కాదు. అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఇదేంటి వస్తూనే నా గుప్పెట్లో పెట్టుకోవాలని నేను అనుకుంటే మీ నాకు కనెక్ట్ అవుతుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇక మీనా శృతి లు బాగా క్లోజ్ అయిపోతారు. బాలు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. రాజేశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×