E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా వంటను మింగేసిన మనోజ్.. బాలు మాటతో ప్రభావతి షాక్.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: మీనా వంటను మింగేసిన మనోజ్.. బాలు మాటతో ప్రభావతి షాక్.. అడ్డంగా దొరికిపోయిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode January 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా తన స్నేహితులతో కలిసి పూలు కడుతూ మాట్లాడుతూ ఉంటుంది.. మగాడు చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కోపం వస్తుంది అని అంటుంది. అయితే మనమే ఒక అడుగు తగ్గి మగాళ్ళను మనకు గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు చెప్పడంతో మీనా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అక్క అని నేను అడుగుతుంది.. బెడ్ ద్వారా మనం దగ్గరవలి అని అన్నానని మీనా ఆయన నా మొహం చూడడానికి ఇష్టపడడం లేదు ఇక దానికి ఎందుకు వస్తాడు అని అంటుంది.. బెడ్ సెట్ అవ్వలేదు కాబట్టి ఫుడ్ మీద ఫోకస్ పెట్టాలి.. బాలుకి ఇష్టమైన వంట వండి తనని ఇంప్రెస్ చేసి తన కోపాన్ని పోగొట్టాలి అని వాళ్ళు చెప్తారు..బాలు వెళ్తూ ఉంటే ఒక ఆవిడ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది.. ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన బాలు ఏమైంది మేడం మీరెందుకు బాధపడుతున్నారు అని అడుగుతాడు.. నా బాధ చెప్పిన కూడా మీకు అర్థం కాదు అని ఆవిడ చెప్పితే.. బాలు నేను మీ సొంత తమ్ముడి లాంటి వాడని అనుకోండి అని అంటాడు. బాలు మాట్లాడిన మాటలకి ఆమె అసలైన నిజాన్ని చెప్పేసింది.. ఆవిడ చెప్పిన మాట విని బాలు రియలైజ్ అవుతాడు నేను ఆ తప్పేమీ లేదు అని అనుకుంటాడు. ఎలాగైనా సరే మీనాను మళ్లీ ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు. అయినా కూడా తన వంటతో బాలుని ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా చేసిన చికెన్ ను వాసనను చూసి అందరు తినడానికి వచ్చేసారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడానికి రెడీ అవుతారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మీనా వంటను మెచ్చుకుంటుంటే ప్రభావతి మాత్రం ఉప్పు ఎక్కువైంది అంటూ వంక పెడుతుంది.. ప్రభావతి అందులో ఏముంది ఉప్పు ఎక్కువైంది అని వంకలు పెడుతూ అందరి చేత తిట్లు తింటుంది. మనోజు ప్రభావతి మాత్రం ఏదో ఒకటి అంటూనే మొత్తం మింగేస్తారు. మనోజ్ మాత్రం ఉన్న చికెన్ మొత్తం కుమ్మేస్తాడు.. మీనా ఇంకా చికెన్ లేదు అని అనగానే శృతి నేను నీకోసం ఆర్డర్ పెడతాను అని అంటుంది. కానీ మీనా నాకు మాత్రం వద్దులే శృతి మీరందరు తిన్నారు కదా నాకు అదే సంతోషమని అంటుంది.

ఇక సత్యం ఇంకా చాలమ్మా నేను వెళ్తాను అని అనగానే అదేంటి మామయ్య ఇంకా తినకుండా వెళ్ళిపోతారు అని అంటుంది మీనా.. అయితే సత్యం మాత్రం నువ్వు బాలు ఇంకా ఉన్నారు కదా.. అమ్మ వాళ్లు కూడా తినాలి కదా.. మొత్తం మనమే తినేస్తే మిగిలిన వాళ్ళు ఏం తినాలి అని ఆలోచిస్తాను నేను అని అంటాడు.. ప్రభావతి అప్పుడే పీకలు దాకా తిని తేన్పులు వేస్తుంది. కానీ బాగాలేదని మొత్తం తినేసావు కదా నీకు కొంచెం కూడా ఏమనిపించలేదా అని సత్యం అంటాడు. మనోజు అయ్యో అప్పుడే మొత్తం చికెన్ అయిపోయిందా అని అనుకుంటాడు..

ఇక అందరూ తిన్న తర్వాత మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఈయన రాలేదేంటి నా మీద కోపంగా ఉన్నాడు తగ్గిందో లేదో అని మీనా కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే బాలు కార్ సౌండ్ వినిపించదని మీనా చాలా సంతోషంగా ఉంటుంది.. మీద ఈయన కోపం పోయిందో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు మీనా ఏమనుకుంటుందో ఉదయం అంతగా తిట్టాను కదా ఇప్పుడు నేను వెళ్లి మాట్లాడితే నన్ను ఏమైనా అనుకుంటుందేమో అని ఆలోచిస్తాడు.. అటు మీనా కూడా ఈయనను భోజనానికి పిలిస్తే నన్ను తిడతాడేమో పొద్దున కాఫీ తాగను అన్నట్టు భోజనం కూడా చేయడేమో అని అనుకుంటుంది..

ఏదైతే అది కానీ అని ఇద్దరు ఒకేసారి పిలుచుకోవడంతో కోపం తగ్గింది అని అనుకుంటారు.. మీనా కోసం హల్వా తీసుకొచ్చిన విషయాన్ని బాలు చెప్తాడు.. అప్పుడే పైనుంచి దిగివస్తున్న ప్రభావతి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దొంగ చాటుగా వింటుంది.. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు అప్పుడే కలిసిపోయారా అని ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మ చెప్పిన మాటలు విని నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వేమీ అనుకోకు మేన నన్ను క్షమించు అని బాలు అంటాడు. వీళ్లిద్దరు అప్పుడే కలవడం నాకు అస్సలు నచ్చలేదు సహించలేకపోతున్నాను అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది.

బాలు మీనాల అన్యోన్యతను చూసి ప్రభావతి కుళ్ళుకుంటుంది.. అమ్మ మాట విని నిన్ను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించు అని బాలు ప్రభావతిని తిడుతూ మీనాన్ని పొగుడుతూ ఉంటాడు.. అది విన్న ప్రభావతి నన్నెందుకురా తిడుతున్నావు అని అనుకుంటుంది.. మొత్తానికికైతే మీనా బాలు ఇద్దరు ఒక్కటైపోతారు.. ఇక తర్వాత భోజనం చేదు రండి అని అనగానే రవి అక్కడికి వచ్చి అన్నయ్య సారీ అన్నయ్య వదిన చాలా రుచిగా చికెన్ వండింది అందరం తినేసాము. నీకు లేదు అని అనగానే అయ్యో మీరంతా తినేశారా కనీసం పులుసు కూడా ఉంచలేదా అని బాలు అనుకుంటాడు.

నేను శృతి చిన్న గొడవపడ్డాము. వదిన చేసిన వంట బాగా నచ్చి ఇద్దరూ ఆ గొడవను పక్కన పెట్టేసి ఫుల్లుగా లాగిన్ చేసాము. ఇక మనోజ్ అయితే మాట్లాడకుండా మొత్తం తినేసాడు అని రవి అంటాడు.. అయితే మీనా మాత్రం బాలు కోసం చికెన్ తీసుకొని వస్తుంది.. ఇదేంటి వదిన ఇదెక్కడిది అయిపోయింది కదా అని అంటే లేదు మీ అన్నయ్య కోసం కాస్త పక్కన పెట్టాను… అన్నయ్య కోపం తగ్గించడానికి నేను ఈ కూర వండాను అలాంటిది మీ అన్నయ్యకు లేకుండా ఎలా ఉంచుతాను రవి అని అంటుంది. బాలు చాలా మంచి పని చేశావు మీనా ఎక్కడ నాకు లేదని బాధపడ్డాను అని అంటాడు.

నీకోసం కూడా కొంచెం తీసుకున్నవా లేదా అని అనగానే లేదండి నేను మధ్యాహ్నం కూర వేసుకుని తినేసాను అని మీనా అంటుంది.. నీకోసం హల్వా తెచ్చాను కదా అది తిను అని అంటాడు. ఇక రవి వెళ్లగానే ప్రభావతి వచ్చి అక్కడ కూర్చుంటుంది.. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటుంది.. వీళ్ళిద్దరిని చూసి తట్టుకోలేకపోతున్నాను అని వెళ్ళిపోతూ ఉంటే మీనా మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా అత్తయ్య అని హల్వా తీసుకొచ్చి ఇస్తుంది..

తర్వాత రోజు సుమతి హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మీనాకు ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు పువ్వులను తీసుకొని రావాలి అని అంటుంది. మీనా ఏమైందో నీ కంగారు పడిపోతూ అక్కడికి వెళుతుంది. ఏమీ లేదక్కా హాస్పిటల్ లో ప్రతిరోజు పువ్వులు కావాలట అందుకే నీ పేరే చెప్పాను అని అంటుంది సుమతి. అయితే అప్పుడే అదే హాస్పిటల్ కి రోహిణి రావడం చూసిన సుమతి చూసావా అక్క.. మొన్న కూడా రోహిణి వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది అంటే ఏదో ఉంది అని అనుకుంటుంది. అవును మొన్న విషయం చెప్పినందుకే మా అత్తయ్య నన్ను మామూలుగా తిట్టలేదు ఇప్పుడు మనకెందుకులే అని మీనా అంటుంది.

Also Read :పెళ్లి చెడగొట్టేందుకు విశ్వం ప్లాన్.. రామరాజు ఎమోషనల్.. చిక్కుల్లో పడ్డ శ్రీవల్లి..

సుమతి మాత్రం రోహిణి మరోసారి హాస్పిటల్ కి రావడమేనక ఏదో ఉంది అనేసి అనుకుంటుంది. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో నేను రిసెప్షన్ లో వెళ్లి కనుక్కుంటాను అని సుమతి అంటుంది.. సుమతి రిసెప్షన్ లో వెళ్లి అడిగి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ఆవిడ వచ్చింది అని తెలుసుకొని మీ నాకు చెప్తుంది. మొదటిసారే సరే కదా పెళ్లయింది రెండోసారి బిడ్డను కన్నడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే మీనా ఇది విషయం గురించి మనం ఇద్దరం మర్చిపోదాము అని సుమతీతో అని వెళ్ళిపోతుంది. దారిలో పరధ్యానంగా వెళుతూ ఉన్న మీనాను బాలు చూస్తాడు.. ఎక్కడికి వెళ్తున్నావ్ మీనా అని అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రోహిణి గురించి అసలు నిజం బయటపడుతుందేమో చూడాలి…

Related News

రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Big Stories

×