E-Paper
Advertisement

Phone Tapping Case latest: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాసేపట్లో పార్టీ ఆఫీసుకు హరీష్‌రావు, నోటీసుపై కేటీఆర్..

Phone Tapping Case latest: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాసేపట్లో పార్టీ ఆఫీసుకు హరీష్‌రావు, నోటీసుపై కేటీఆర్..
Advertisement

Phone Tapping Case latest: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తారాస్థాయికి చేరిందా? ఇప్పటివరకు అధికారులను విచారించిన సిట్, రాజకీయ నేతలపై దృష్టి పెట్టిందా? మాజీ మంత్రి హరీష్‌రావు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్‌ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడిందా? నోటీసులపై కేటీఆర్ ఏమన్నారు? ఆ పార్టీలో జరుగుతున్న చర్చేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు

Advertisement

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు అధికారులను పిలిచి విచారించిన సిట్, ఇక రాజకీయ నేతల వంతైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని పిలిచిన విచారించింది. తాజాగా మాజీమంత్రి హరీష్‌రావు వంతైంది. రెండేళ్లుగా దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి.

సోమవారం ఉదయం సిట్ అధికారులు కోకాపేట్ లోని హరీష్‌రావు ఇంట్లో నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో వున్న ఆయన, నోటీసులు విషయం తెలియగానే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆయన రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.  ఉదయం 9 గంటలకు పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు హరీష్‌రావు.  ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని,  కేవలం ఉన్నత అధికారులు ఆ పని చేస్తారన్నారు.  ఇటీవల దర్యాప్తులో శ్రవణ్‌రావు-ప్రభాకర్ రావులతోపాటు ప్రణీత్‌రావుల మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు గుర్తించారు అధికారులు.

Advertisement

హరీష్‌రావుకు నోటీసు ఇవ్వడంపై కేటీఆర్ రియాక్ట్

హరీష్‌రావు-ప్రభాకర్ మధ్య జరిగిన మాటల్లో సర్వేల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో అప్పటి ప్రతిపక్షం తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారికి సహకరించిన వారి డీటేల్స్ సేకరించి ప్రభాకర్ రావుకి పంపేవాడని దర్యాప్తులో తేలింది. దీని ఆధారంగా మొత్తం ఎపిసోడ్ గురించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని, కేసుని కొట్టేసిందని ప్రస్తావించారు.

ALSO READ: దేశంలో నెంబర్ వన్ ఎయిర్ పోర్టుగా హైదరాబాద్ సరి కొత్త రికార్డు

మళ్లీ హరీష్‌రావు‌కు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, అడుగడుగునా ప్రశ్నిస్తామని తెలియజేశారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బొగ్గు గనుల కేటాయింపు అంశాన్ని పక్కన పెట్టి, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకుంది బీఆర్ఎస్.

నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. కీలక నేతలకు ఈ పరిస్థితి ఉంటే, తమ మాట ఏంటంటూ చర్చించుకోవడం మొదలైంది.  జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.  రానున్న రోజుల్లో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశముందని అంతర్గతంగా నేతలు చర్చించుకుంటున్నారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×