E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నిజాన్ని బయటపెట్టిన రోహిణి.. మీనాపై సీరియస్.. రోహిణికి కొత్త టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: నిజాన్ని బయటపెట్టిన రోహిణి.. మీనాపై సీరియస్.. రోహిణికి కొత్త టెన్షన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా చెప్పిన రోహిణి రహస్యం బాలుకు తెలుస్తుంది. బాలు మాత్రం అస్సలు ఆగలేడు. వెళ్లి సత్యంతో ఈ విషయాన్ని చెప్తాడు.. ఇది నాకు మింగుడు పడడం లేదు రా అని సత్యం అంటాడు. ఎలాగైనా సరే ఈ నిజాన్ని మన నిజమో కాదో తెలుసుకోవాలి అని బాలు అనుకుంటాడు.. ఇక సత్యం వెళ్లి ప్రభావతి చెవిలో ఊదుతాడు.. మన ఇంటి కోడలు మీద ఇలాంటి నిందలు వేయడం పాపమండి అని ప్రభావతి మొదట నమ్మదు.. ఆ తర్వాత సత్యం అవును కదా తెలుసుకుందామని అనడంతో ప్రభావతి నమ్ముతుంది.. అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. నువ్వు చెప్పు ప్రభ నీకు తెలిసే ఇదంతా జరిగిందా..? నీకు ఈ విషయం తెలియకుండానే ముద్దుల కోడలని నెత్తిన పెట్టుకున్నావా? ఏంటి ఇదంతా నువ్వు దీని గురించి కనుక్కోకుండానే పెళ్లి చేసావా అని సత్యం ప్రభావతిని అనుమానిస్తాడు..

ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది.. మీరు నన్నే అనుమానిస్తున్నారా..? నేను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. రెండోసారి ప్రెగ్నెంట్ అవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే సత్యం ఇప్పుడెందుకు చాలా కూల్ గా నువ్వే పక్కకు పిలిచి అడగొచ్చు కదా అని అంటాడు. ప్రభావతి మాత్రం ఈ విషయాన్ని వెంటనే తెలుసుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి రోహిణి నిజంగానే రెండోసారి ప్రెగ్నెంట్ అయిందని అనుకుంటుంది.. పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు మరి రెండుసార్లు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనుకొని రోహిణి అని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.. రోహిణిని కిందకు తీసుకొని వెళ్లి అందరి ముందర అడుగుతుంది. అయితే రోహిణి నేను అడ్డంగా ఇరుక్కుపోయాను అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలని ఆలోచిస్తుంది. అవును నేను మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను అబార్షన్ కూడా అయింది అని నిజాన్ని చెప్పేస్తుంది.. ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని అనగానే మనోజ్ ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా మరి అయ్యాను అని అంటావేంటి అని అంటాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ అయినట్లు కూడా నాకు తెలియదు.

అయితే ఒకరోజు పార్లర్కి వెళ్తే కడుపునొప్పి ఎక్కువైపోయింది. హాస్పిటల్ కి వెళ్ళిపోయాను అక్కడ తెలియకుండానే అబార్షన్ అయిపోయింది. నా మొదటి ప్రెగ్నెన్సీకి కారణం మనోజే మనోజ్ వల్లే నేను తల్లయ్యాను. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక నేను చెప్పలేదు అని రోహిణి కథ అల్లేసింది.. అదే నిజమని అందరూ నమ్మేస్తారు. అసలు నువ్వు తల్లయ్యవని మీ మామయ్య చెప్పగానే నాకు కాళ్లు చేతులు ఆడలేదు. అయినా ఇది రోహిణి పర్సనల్ విషయం కదా నాన్న నీకు ఎవరు చెప్పారు అని మనోజ్ అడుగుతాడు. నాకు బాలు చెప్పాడు అని అనగానే ప్రభావతి రెచ్చిపోతుంది.

Advertisement

మేమిద్దరం సంతోషంగా ఉండడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు అందుకే వాడు ఏది చెప్తే అది నమ్మేస్తావా అని అంటాడు మనోజ్. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అనగానే రవి చెప్పాడు అని బాలు చెప్తాడు. ఏంట్రా రవి నువ్వు కూడా ఇలా మారిపోయావు ఏంట్రా అని ప్రభావతి అడుగుతుంది. అదేం లేదమ్మా అనే రవి అనగానే అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని రవితో అంటారు.. నాకు శృతి చెప్పింది అంటాడు.. శృతి నీకు ఎవరు చెప్పారు అని అందరూ అడుగుతారు. అయితే శృతి మాత్రం ఎవరు చెప్తే ఏంటి నిజమైతే తెలిసింది కదా.. రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ అన్నది నిజమే కదా అని అంటుంది.. మీనా నేను చెప్తాను నేనే ఆ విషయాన్ని చెప్పాను అని అనగానే ప్రభావతి రెచ్చిపోతుంది..

Also Read :అనుపమ పరమేశ్వరన్ ‘లాక్ డౌన్’ వచ్చేస్తుంది… రిలీజ్ ఎప్పుడంటే..?

వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నువ్వు చూడలేకపోయావు అందుకే ఇలా చెప్తున్నావా నీ ప్రభావతి సీరియస్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య కొంచెం మర్యాదగా మాట్లాడండి అని మీనా ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం మీనాని అవమానించేలా మాట్లాడుతుంది.. ఒకవైపు సత్యం చెప్తున్న సరే ప్రభావతి మాత్రం ఆగదు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×