BigTV English

Gundeninda GudiGantalu Today episode: మొత్తం తప్పంతా సత్యంతే .. బాలును నోరు మూయించిన శృతి..

Gundeninda GudiGantalu Today episode: మొత్తం తప్పంతా సత్యంతే .. బాలును నోరు మూయించిన శృతి..

Gundeninda GudiGantalu Today episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుని మీనా ఇంటికి రప్పిస్తుంది. బాలు రాగానే ప్రభావతి చిందులేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు తాళం వేసుకొని వెళ్ళిపోతే రవి శృతి, రవిలు ఎక్కడ ఉంటారో ఆలోచించరా వాడు నీ తమ్ముడు అనే సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావని ప్రభావతి అరుస్తుంది.. అయినా రూమ్ కి తాళం వేసుకొని వెళ్ళమని ఎవరు చెప్పారు అసలు రూమ్ కి తాళం వేయడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. దానికి బాలు అడగడానికి నువ్వెవరు అంటాడు.. తనకి మళ్లీ ఈ ఇల్లు నా ఆస్తి మా నాన్న నాకు రాసిచ్చారు అని అంటుంది. నాన్న నీకు ఇచ్చింది అగ్గిపెట్టె అంత ఇండ్లు మాత్రమే. మా నాన్న దాని రైల్వే పెటేంత చేసాడు ముగ్గురు కొడుకులు ఉండడానికి సులువుగా ఆయన చేయించుకున్నాడని బాలు తండ్రి గురించి చెప్తాడు. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని బాలు అడిగితే ఏం చెప్పదు. రోహిణి ఏమైనా అన్నదా? లేదా? మనోజ్ ఏమైనా అన్నాడా అంటూ దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. మీనా తన పేరు ఎక్కడ చెబితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడోనని ప్రభావతి భయపడుతుంది.. రోహిణి ప్రభావతన్నదని నిజం చెప్తుంది. సత్యం ప్రభావతిని లోపలికి తీసుకెళ్లి క్లాస్ తిడతాడు తమ రూముని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. తాను ఇకనుండి హాల్లోనే పడుకుంటానని, తనకు రూమ్ అవసరం లేదని తెగేసి చెప్తాడు. ఇంట్లో వారు వద్దని చెప్పిన సత్యం వినడు. రవికి తాము రూమ్ ఇస్తామని బాలు చెప్పినా.. తాను ఇక నుండి హాల్లోనే ఉంటానని చెప్తాడు. దీంతో బాలు తన రూమ్ లో ఉన్న బెడ్ తీసుకువచ్చి ఇస్తాడు. మరోసారి మీనా తమ రూం ఇస్తామని అంటుంది. దీంతో ప్రభావతి వాళ్ళే రూమ్ ఇస్తారని అంటున్నారు కదా.. మనం వాళ్ళ రూమ్ లోకి వెళ్దాం అంటుంది. నీకు కష్టంగా అయితే.. నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడనే ఉంటా అని సత్యం తెగేసి చెప్తాడు. ఇక బాలు మీనాని లోపలి రమ్మని పిలుస్తాడు. అత్తయ్య, మామయ్య ఈ రూమ్ కి రమ్మని మీరే చెప్పొచ్చు కదా అంటే.. సత్యం ఏం చెప్పినా వినని ఈ పరుపుని తీసుకెళ్లి వాళ్ళకు ఇద్దామని అంటాడు. ఇక బాలు తీసుకెళ్లి సత్యం కు పరుపుని ఇస్తాడు.. మీనా బాలు ఎంత చెప్పినా సత్యం వినకుండా మీరు నా మాటని కాదనలేరనేసి అంటాడు. ఇక రవి శృతి అప్పుడే ఇంట్లోకి వస్తారు. ఏమైంది అంటే నిన్ను కన్నందుకు నువ్వు లేచిపోయి నాన్న పరువు తీసినందుకని బాలు పొందను లేకుండా మాట్లాడుతాడు.

ఏమైంది ఇక్కడ ఉన్నారు. రూమ్ కు ఏమైనా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారా మీనా అని శృతి ప్రశ్నించగా.. నాన్న ఇకనుంచి ఇక్కడే ఉంటానని అంటున్నారు అని మనోజ్ చెబుతాడు. ఎందుకని రవి ప్రశ్నించగా.. నిన్ను కన్నందుకు.. నువ్వు లేచిపోయినందుకు.. తిరిగి సిగ్గు లేకుండా మళ్లీ ఇంట్లోకి వచ్చినందుకు అంటూ బాలు రెచ్చిపోతాడు. మధ్యలో నేనేం చేశానని రవి బాధపడతాడు. నీలాంటి వాడు ఇంట్లో ఒక్కడుంటే చాలు.. తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారని నానా మాటలు అంటాడు బాలు. దానికి శృతి బాలు మీరు కాసేపు ఆగండి అని మాట్లాడుతుంది. అంకుల్ ఇదంతా మీదే అంకుల్ మీరు ముందుచూపు లేకుండా కట్టించుకున్న ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేసి శృతి క్లాస్ పీకుతుంది. నాది తప్పేనమ్మ నేను అంత ఆలోచించలేదు అని సత్యం అంటాడు..మీరు రెండు రోజులు రూమ్ ఇవ్వమంటే లాక్ వేసుకొని వెళ్లిపోయారు కదా.. ఇదేమైనా లార్జ్ అనుకున్నారా.. లేదా జైలు అనుకున్నారా.. అని బాలుని నిలదీస్తుంది. దొంగలు, ఖైదీలు ఇంట్లో అడుగుపెడితే.. ఇల్లు జైలే అవుతుంది బాలు అంటాడు. దీంతో మైండ్ యువర్ వర్డ్స్.. ఏదంటే అది పడడానికి నేను మీనా ఇలాంటి దాన్ని కాదు అంటూ బాలుకి శృతి వార్నింగ్ ఇస్తుంది. ఇకనుండి ఏం మాట్లాడాలో.. పేపర్ పై డైలాగులు రాసి ఇవ్వు డబ్బుడమ్మా అని వెటకారంగా మాట్లాడుతాడు బాలు. ఇక మధ్యలో సత్యం కలుగజేసుకొని బాలు వదినా అంటే నీకు తల్లితో సమానం. మరదలు అంటే నీకు కూతురుతో సమానం కూతురుతో ఇలానే మాట్లాడతావా మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవా అనేసి క్లాస్ పీకుతాడు. శృతిరవిలు పైకెళ్ళిపోతారు ఇక మీనా రవి లను కూడా సత్యం వెళ్లిపొమ్మని చెప్తాడు, మనోజ్ నేను రోహిణి కూడా వెళ్ళొచ్చానా అంటే వెళ్లండి అని సత్యం అంటాడు.


ఇక శృతిరవిలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకున్నట్టు మాట్లాడుకుంటారు. నువ్వు చాలా ఇబ్బంది పడతావని అనుకున్నాను శృతి కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని నాకు అర్థం అయిపోయింది నేను ఇబ్బంది పడకుండా చూసుకోవాలని నేను అనుకున్నాను మనం బయటికి వెళ్లిపోదామా అని అంటే.. శృతి నీకు నీ వాళ్లు కావాలి నీ వాళ్లతో నువ్వు హ్యాపీగా ఉంటావు నేను నీతో హ్యాపీగా ఉంటానని నేను ఇక్కడ ఉంటున్నాను నువ్వేం బాధపడకు అనేసి అంటుంది. ఇక మీనా కూడా బాలుని తిడుతుంది. అంత కోపంగా ఉంటారు కాబట్టే అందనిలా అంటున్నారు మీరు ఆ తాగుడు మానేస్తే మీ కన్నా మంచివాడు మీ చల్లని మనసు అర్థం కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనేసి అంటుంది. ఇది బాలు నేను ఇలానే ఉంటాను. ఇలా ఉంటేనే బాలుని బాలు లాగా చూస్తారు లేకపోతే బంతి లాగా తన్నే అవతల పడేస్తారు నీకు ముందు ముందు అర్థమవుతుంది లే అనేసి బాలు అంటాడు.

శృతి రవిని నిద్రలేపి పైకి తీసుకెళ్తుంది.. అక్కడున్న టెంట్ హౌస్ ని చూపిస్తుంది. మీ అన్నయ్య తాళం వేసుకొని వెళ్ళిపోయారు అన్నారు కదా.. అందుకే నేను మధ్యాహ్నం షాపింగ్ కి వెళ్ళినప్పుడు దీన్ని కొన్నాను ఇక్కడ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ నీతో ఉండాలని అనిపిస్తుంది అని శృతి అంటుంది. ఇక ఉదయం లేవగానే ప్రభావతి శృతికి రవికి కాఫీ తీసుకొని వస్తుంది. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో టెంట్ హౌస్ గురించి అందరూ టెన్షన్ పడతారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×