Aramghar Flyover Accident: అతి వేగం ప్రమాదకరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పదేపదే పోలీసులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. వాటిని యువత పట్టించుకోలేదు. దాని ఫలితమే ముగ్గుర్ని మింగేసింది.
హైదరాబాద్ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శివరాంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు వంతెనపై నేరుగా డివైడర్‌ను ఢీ కొట్టారు. స్పాట్‌లో ఇద్దరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
బహుదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా బహుదూర్ పురా ప్రాంతానికి చెందినవారు. బైక్‌పై ముగ్గురు మైనర్లు అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
యువకులు మృతిపై వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రోదనతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. మృతుల బాడీలకు పోస్టుమార్టం తర్వాత వాటిని పేరెంట్స్ అప్పగించనున్నారు.
ALSO READ: హుస్సేన్ సాగర్ ఘటన.. యువకుడి మాటేంటి? ఆందోళనలో పేరెంట్స్
ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్.. ముగ్గురు యువకులు మృతి
రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొన్న ఓ ద్విచక్రవాహనం
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
మృతులను బహదూరుపురాకు చెందిన… pic.twitter.com/tSOG8sXSxh
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025