Gundeninda GudiGantalu Today episode june 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని రవి, శృతిని ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని అంటుంది శోభా.. అదేంటి నీ పిచ్చి గానీ ఆ రవి పేరెంట్స్ ను వదిలి ఉండడు కదా అని సురేంద్ర అంటాడు. బాలు ఉంటే గొడవలు జరుగుతాయి. వాడిని లేకుండా చేసి రెచ్చగోడితే గొడవ పెద్దది అవుతుంది. ఇక రవి, శృతిలు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. నేను అదంతా చూసుకుంటాను అని అంటారు.. ఏం చేస్తావో ఏమో అని సురేంద్ర అంటాడు. బాలు మీనా కారు కొణించిందనే ఆనందంతో మీనా తో సరదాగా గడపాలని అనుకుంటాడు. కానీ మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అని మల్లెపూలు మీనాక్షిస్తాడు. మీనా నా చేతికి ఇవ్వడం ఎందుకు మీరే పెట్టొచ్చుగా అని అంటుంది.
బాలు ఆ తర్వాత నీకోసం ఇంకో గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. కానీ ఆ బాక్స్ తీసే లోపల ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. ప్రభావతి శృతి తో కలిసి బిర్యానీ తిని రాత్రంతా ఇబ్బందులు పడుతుంది. కడుపు ఉబ్బరం సంగతి ఏమోగానీ సత్యం మాత్రం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. శృతితో పోటీ పడి మరితిన్న బిర్యానీ అరగక అవస్థతో ప్రభావతి హాల్లోకి వస్తుంది. అప్పుడే మూడ్‌లోకి వచ్చిన బాలు ప్రభావతి విజిల్ కొట్టుకుంటూ రావడంతో ఆగిపోతాడు. హాల్లో ప్రభావతి నడుస్తూ ఉంటుంది. దాంతో మొత్తానికి బాలు మీనా ఫస్ట్ నైట్ ప్లాన్ చెడిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం ప్రభావతి ఇంటికి శ్రుతి తల్లి శోభన వస్తుంది. ఇంటికి వచ్చి శ్రుతికి నల్లపూసల కార్యక్రమం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. శృతికి పెళ్లి అయి ఇంతకాలం అయినా మీరైన నల్ల పూసలు గుచ్చి పుస్తెలతాడు వేయలేదు. ఆ నల్లపూసలు గుచ్చే వేడుకనే గ్రాండ్‌గా అందరిని పిలిచి చేయాలని అనుకుంటున్నాం అని శోభన చెబుతుంది
శృతి, రోహిణి నల్లపూసలు గుచ్చి ఇస్తే బాగుంటుందేమో అని ప్రభావతి అంటుంది. ఇద్దరికి ఒకేసారి ఆ వేడుక జరిపించేద్దాం అని శోభన అంటుంది. శృతితో పాటుగా రోహిణికి కూడా తల్లిలా శోభన నల్లపూసల వేడుక చేయిస్తానని చెబుతుంది. అనంతరం మరోసారి ఇంటికి వచ్చిన శోభన బాలు ఈ ఫంక్షన్‌కు రాకూడదు అని చెబుతుంది.. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుందని శోభా అంటుంది. ఇక బాలు ఉంటే ఎక్కడ గొడవలు జరుగుతాయని ప్రభావతి వెంటనే ఒప్పేసుకుంటుంది.
ఉదయం లేవగానే ఈ విషయాన్ని బాలు తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయాలని అనుకుంటుందండి అని ఉంటుందండి అని ప్రభావతి సత్యంతో అంటుంది. వాడు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. అందుకే రాకపోవడమే మంచిది అని అంటుంది అప్పుడే లోపలికి బాలు ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఈ డబ్బావతి ఏదో నా గురించి చెప్తుంది అని బాలు అంటాడు. శృతి రోహిణి లకు నల్లపూసలు గుచ్చి కార్యక్రమానికి మీరు రావద్దని రోహిణి వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టిందట రా అని సత్యం అంటాడు.
Also Read:కొడుకు కోసం వేదవతి త్యాగం.. ధీరజ్ భాదను పోగొట్టేందుకు ప్రేమ ప్లాన్..
అమ్మ అంతగా అడుగుతుంది కదా నాన్న నేను ఈ ఫంక్షన్ కి రాను మీరందరూ దగ్గరుండి మంచిగా ఫంక్షన్ చేయండి అని బాలు అంటాడు. ఇక సత్యం అవును నిజమే వాడు రాకపోవడమే మంచిది. వాడు రాని ఈ ఫంక్షన్ కి నేను కూడా రాను అని సత్యం అంటాడు. మా ఆయన లేని ఫంక్షన్ కి నేను ఎలా వస్తానో నేను కూడా రాను అని నేను అంటుంది. బాలు మీనా ఇద్దరు కలిసి వస్తేనే నేను ఫంక్షన్ చేసుకుంటాను అని అటు శృతి రవి కూడా అంటారు. మరి శోభనను శృతి ఒప్పిస్తుందా? బాలు మీనా ఇద్దరు కలిసి జాలి ట్రిప్ కి వెళ్తారా? ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ని తప్పకుండా చూడాల్సిందే..