Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్, చంభా, మనోహరి ముగ్గురు కలిసి నవ్వుకుంటుంటారు. ఇంతలో మనోహరి శభాష్ చంభా నీ పాచిక పవర్‌ఫుల్‌గా పారింది అంటుంది. రణవీర్ కూడా అవును చంబా నీ రీ ఎంట్రీ అదిరిపోయింది అంటాడు. చెప్పాను కదా రణవీర్ ఈ సారి నేను ఆ ఆత్మ అంతు చూసే వెళ్తానని అంటుంది చంభా. తెల్లటి పాలు ఎర్రగా మారడం చూసి ఆ భాగీ వణికిపోయింది. అమరేంద్ర లో కూడా కంగారు వచ్చేసింది. పిల్లలు కూడా చూసి ఉంటే సీన్ వేరే లెవెల్ లో ఉండేది అంటుంది మనోహరి. రణవీర్ కూడా నెక్ట్ లెవెల్ లో ఆ ఇంట్లో రక్తం పారాలి మనోహరి అంటాడు. అరే నేను అదే అనుకుంటున్నాను రణవీర్.. ఇప్పుడు తెల్లటి పాలు ఎర్రగా మారాయి.. ఈసారి ఎర్రటి రక్తమే పారేలా చేస్తాను అంటుంది చంభా..
దీంతో మనోహరి ఎవరి రక్తం కొంపదీసి పిల్లల రక్తం అయితే కాదు కదా అంటుంది. ఏం పిల్లలది అయితే ఏమైనా ప్రాబ్లమా అని రణవీర్ అడగ్గానే.. పిల్లలకు ఏదైనా అయితే అమర్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఆరు ఆస్థికలు గంగలో కలపడం మాని పిల్లల జోలికి వచ్చింది ఎవ్వరా అని ఎంక్వైరీ మొదలు పెడితే మనం దొరికిపోతాము అని మనోహరి చెప్పగానే.. మరి ఎవరి రక్తం పారించమంటావు మనోహరి చెప్పు అంటూ చంభా అడుగుతుంది. దీంతో ఆ భాగీ రక్తం పారించాలి. అదే ఎఫెక్ట్ అవ్వాలి. దాని రక్తం నేను కళ్లారా చూడాలి.. అంటుంది మనోహరి. దీంతో రణవీర్ వెటకారంగా మనోహరి ఇన్నాళ్లు ఆ ఇంట్లోనే ఉన్నావు.. నువ్వు భాగీని ఏమీ చేయలేకపోయావు కదా..? అంటాడు. దీంతో చంభా కల్పించుకుని భాగీని మనోహరి ఏమీ చేయనవసరం లేదు రణవీర్. నీ చేతికి నా చేతికి ఆ రక్తం అంటనవసరం లేదు అంని చంభా చెప్తుంది.
మరి భాగీ పని ఎరు చూస్తారు.. దాని అంతం ఎవరు చూస్తారు అని మనోహరి అడగ్గానే. అందుకు నా దగ్గర ఒక పథకం ఉంది అని చంభా తన ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ విన్న రణవీర్, మను హ్యాపీగా ఫీలవుతారు. సూపర్ చంభా ఈసారి నీ బ్రెయిన్ బ్రహ్మండంగా పని చేస్తుంది. ఈసారి నీ ప్లాన్‌కు తిరుగే లేదు అంటాడు రణవీర్. ఇక మనోహరి కూడా మనం ఈ ప్లాన్ ముందే చేసి ఉంటే మనకు ఈ టైం కలిసి వచ్చేది కదా అంటుంది. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు మాత్రమే జరుగుతుంది మనోహరి అని చెప్తుంది చంభా. కానీ ఈ ప్లాన్ ఇప్పుడే వద్దు.. కాస్త గ్యాప్ ఇద్దాం.. అన్ని వెంట వెంటనే జరిగితే అమర్‌కు అనుమానం వస్తుంది అని మనోహరి చెప్తుంది. రణవీర్ కూడా కరెక్టు మనోహరి.. ఆ ఇంట్లో ఎవరికీ డౌటు రాకుండా.. చాలా ప్లాన్డ్‌గా అమలు చేయాలి అంటాడు. అది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను చంభా నువ్వు అప్పటి వరకు రెడీ ఉండు అని మనోమరి చెప్పగానే. మీరు ఎప్పుడు చెప్పినా నేను రెడీ.. నా గురి ఆ ఆత్మ దాన్ని నాతో పట్టుకెళ్లడమే నా లక్ష్యం అంటుంది చంభా..
మరోవైపు అమర్ పాలవాణ్ని పిలిచి ఎంక్వైరీ చేస్తుంటాడు. పాలవాడితో రాథోడ్ మాట్లాడుతుంటాడు. మర్యాదగా చెప్పు.. ఆ కాలనీలో అన్ని ఇండ్లలోకి నువ్వు పాలు సప్లై చేస్తుంటావు.. మేము ఎంక్వైరీ చేశాము మా ఇంట్లో తప్ప ఏ ఇంట్లోనూ పాలు రంగు మారలేదు.. మా ఇంట్లో వేసిన పాలల్లో ఏం కలిపావు అని అడుగుతాడు. దీంతో పాలవాడు భయంతో అమ్మతోడు సార్ అన్ని ఇండ్లలో వేసినట్టే మీ వేశాను అంతే సార్ అంటాడు. దీంతో రాథోడ్ కోసంగా నిజం చెప్పకపోతే చస్తావురా..? అంటూ కొడుతుంటాడు. సార్ నాకేం తెలియదు సార్.. నేనేం చేయలేదు సార్ అంటాడు పాలవాడు.
ఇంతలో అమర్.. రాథోడ్ ఆగు.. రేయ్ నువ్వు రోజులాగే పాలు వేశావు కదా..? మధ్యలో ఎక్కడా ఆగలేదు కదా..? అని అడుగుతాడు. అవును సార్.. మధ్యలో ఎక్కడా ఆగలేదు సార్ అంటూ సార్ ఒకచోట ఆగాను సార్.. అని చెప్పగానే.. అమర్ ఎక్కడ ఆగావు.. ఎందుకు ఆగావు.. అని అడగ్గానే.. మీ ఇంటి దగ్గరే ఆగాను సార్.. ఒకతను కారు నెట్టమంటే నెట్టడానికి ఆగాను సార్.. అప్పుడే పాల ప్యాకెట్లు మారిపోయి ఉండాలి అంటాడు. అయితే ఎలా ఉంటాడతను నీకు తెలుసా..? అని అమర్ అడగ్గానే.. నాకు అతను తెలియదు సార్.. కానీ అతను మాత్రం ఒక జమీందారులాగా రాజు లాగా డ్రెస్ వేసుకుని ఉన్నాడు సార్ అని పాలవాడు చెప్పగానే..
అమర్ రణవీర్ ఫోటో చూపించి ఇతనేనా అని అడుగుతాడు. పాలవాడు అవును సార్ ఇతనే.. నన్ను కారు నెట్టమని చెప్పింది ఇతనే సార్.. ఇతనే మార్చేశాడేమో అంటాడు పాలవాడు. దీంతో అమర్ ఇక నువ్వు వెళ్లవచ్చు అని చెప్తాడు. పాలవాడు వెళ్లిపోయాక రణవీర్ పాల ప్యాకెట్లు మార్చడం ఏంటి సార్ ప్యాకెట్లు మార్చితే తనకేం వస్తుంది. అంటూ అడగ్గానే.. ఇది రణవీర్ చేయలేదు రాథోడ్.. రణవీర్‌తో ఇది చేయించింది తన భార్య అని అమర్ చెప్పగానే.. రాథోడ్ షాక్ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.