Harjas Singh Triple Century: టెస్ట్ మ్యాచ్ లలో ట్రిపుల్ సెంచరీలు కొట్టడం చూసాం. అంతేకాదు 400 కొట్టిన లారాలాంటి ప్లేయర్లను కూడా చూశాం. కానీ ఇప్పుడు వన్డేల్లోనే త్రిపుల్ సెంచరీ చేసిన మొనగాడు వచ్చేసాడు. 35 సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఆటగాడు హర్జాస్ సింగ్ (Harjas Singh ) 300కు పైగా పరుగులు చేసి చుక్కలు చూపించాడు. ఇందులో 14 బౌండరీలు కూడా ఉన్నాయి. సిడ్నీ గ్రేడ్ క్రికెట్ టోర్నీలో ( Sydney Grade Cricket Tournament) హర్జాస్ సింగ్ ( Australia U-19 star Harjas Singh )… సిడ్నీ క్రికెట్ క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డు సంపాదించాడు.
సిడ్నీ గ్రేడ్ క్రికెట్ టోర్నమెంట్ లో (Sydney Grade Cricket Tournament ) భాగంగా వెస్టర్న్ సబర్బ్స్ (Western Suburbs ) వర్సెస్ సిడ్నీ క్రికెట్ క్లబ్ ( Sydney Cricket Club) మధ్య మ్యాచ్ జరిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో హర్జాస్ సింగ్ దుమ్ము లేపాడు. వెస్టర్న్ సబర్బ్స్ (Western Suburbs ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్జాస్ సింగ్ 141 బంతుల్లో 314 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. వన్డేల్లో ఇలా ట్రిపుల్ సెంచరీ చేయడం… ఇదే మొదటి సారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 35 సిక్సర్లు కూడా ఉన్నాయి. సిడ్నీ క్రికెట్ క్లబ్ తో జరిగిన ఈ అదిరిపోయే మ్యాచ్ లో 74 బంతుల్లో సెంచరీ చేసి… ఆ తర్వాత 67 బంతుల్లో 214 పరుగులు చేరుకున్నాడు. 135 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. అలా మొత్తం 314 పరుగులు చేశాడు.
హర్జాస్ సింగ్ సెంచరీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 483 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ గత సంవత్సరం జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ సబర్బ్స్ (Western Suburbs ).. 50 ఓవర్లలో 483 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఓపెనర్ నికోలస్ కట్లర్ 36 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ క్లార్క్ 37 పరుగులు చేశాడు. హర్జాస్ సింగ్ 300కు పైగా పరుగులు చేసి చుక్కలు చూపించాడు. జెమ్సన్ నాలుగు పరుగులు చేయగా ఫర్హాన్ 24 పరుగులతో రాణించాడు. ఫిన్ గ్రే 28 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
335 —విక్టర్ ట్రంపర్, పాడింగ్టన్ vs రెడ్‌ఫెర్న్ 1903
321 — ఫిల్ జాక్వెస్, సదర్లాండ్ vs నార్త్ సిడ్నీ 2007
314 — 2025లో హర్జాస్ సింగ్, వెస్ట్రన్ సబర్బ్స్ vs సిడ్నీ,
308 — హ్యారీ డోనన్, సౌత్ సిడ్నీ vs నార్త్ సిడ్నీ, 1897
275 — సీన్ పోప్, బ్యాంక్‌స్టౌన్-కాంటర్‌బరీ vs హాక్స్‌బరీ, 1994
Is Harjas Singh ok?
34 dingers! pic.twitter.com/yDs9cJLA9N
— Daniel Beswick (@DGBeswick1) October 4, 2025