Big tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ విట్టా(Mahesh Vitta) తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర ఓ మారుమూల పల్లెలో జన్మించినట్టు తెలిపారు. అయితే తనకు చిన్నప్పటినుంచి సినిమాలంటే ఆసక్తి ఉండడంతో తాను ఎంసీఏ పూర్తి చేసి ఇండస్ట్రీలోకి వచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్న ఈయనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యేది. తన సొంత ఇంటి గురించి అలాగే ఆస్తులు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
మహేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇప్పటివరకు నాకు మా ఊర్లో కానీ హైదరాబాదులో గాని సొంత ఇల్లు లేదని తెలిపారు. ఇలా సొంత ఇల్లు లేదని చెప్పడంతో ఒక్కసారిగా వర్ష షాక్ అయ్యారు. అదేంటి వరుస సినిమాలలో నటిస్తున్నారు కదా ఇల్లు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మనం సినిమాలలో నటిస్తే సరిపోతుందా? డబ్బులు ఇవ్వాలి కదా అంటూ ఈయన ఇండస్ట్రీలో తనుకు జరిగిన చేదు సంఘటనల గురించి తెలియజేశారు. తాను ఎన్నో ప్రాజెక్టులలో నటించాను కానీ డబ్బులు ఇవ్వకుండా చాలామంది మోసం చేశారంటూ ఈయన తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి బయట పెట్టారు.
ఇలా మన చేత పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే సొంత ఇల్లు ఎలా కొంటాం అంటూ ఈయన ఇండస్ట్రీలో జరిగే మోసాల గురించి తెలియజేశారు. ఇక మీరు ఇండస్ట్రీలో ఎవరికైనా థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెబుతారు అంటూ మరో ప్రశ్న వేయగా ఫన్ బకెట్ డైరెక్టర్ కి తాను థాంక్స్ చెప్తానని వెల్లడించారు. ఆయన నన్ను ఒక చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నారని, నాకు డబ్బులు లేకపోతే నా అవసరాన్ని గుర్తించి మరి నాకు డబ్బులు ఇచ్చారని తెలియజేశారు. నేను ఇండస్ట్రీలో నిలదొక్కకొనే వరకు నన్ను ఒక బిడ్డలా చూసుకున్నారంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
మీరు ఎవరికైనా క్షమాపణలు చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతారు అనే ప్రశ్న ఎదురవడంతో తాను తన జీవితంలో ఎవరికీ క్షమాపణలు చెప్పనని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారని మహేష్ విట్టా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ విషయంలో తనని దారుణంగా మోసం చేశారని తన జీవితంలో తనకు జరిగిన వెన్నుపోట్ల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది పలు సందర్భాలలో డబ్బు విషయంలో మోసపోయినట్టు చెబుతూనే ఉన్నారు. మహేష్ కూడా నిర్మాతల చేతిలో మోసపోయానని వెల్లడించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల గురించి స్పందించారు. అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ , సూసైడ్ చేసుకునే అంశాల గురించి కూడా ప్రస్తావించారు.