Big tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik talks)కార్యక్రమంలో భాగంగా తాజా ఎపిసోడ్ లో ప్రముఖ కమెడియన్ మహేష్ విట్టా (Mahesh Vitta)పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కాలేజీ రోజుల గురించి అలాగే తన ప్రేమ వ్యవహారాలు గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యాంకర్ వర్ష మహేష్ ను ప్రశ్నిస్తూ కాలేజీలో ఏదైనా ప్రేమకథలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ సమాధానం చెబుతూ మన లవ్ స్టోరీలన్నీ నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తాయని వెల్లడించారు. నా ఆటోగ్రాఫ్ సినిమా చూసిన తర్వాత నేను కూడా అదే ఫాలో అయ్యానని ఈయన వెల్లడించారు.
టెన్త్ క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశానని ఇంటర్, డిగ్రీలో కూడా లవ్ చేశానని తెలిపారు. పేరుకే లవ్ కానీ ఎప్పుడూ నేను వారి వద్దకు వెళ్లి మాట్లాడింది లేదు. వారితో ఎప్పుడైనా మాట్లాడాను అంటే అది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే అనే రెండు మాటలు తప్ప ఎప్పుడూ మాట్లాడలేదని వెల్లడించారు. మనం కాలేజీకి వెళ్తున్నాము అంటే ఆ అమ్మాయి దృష్టికి మన పై పడాలి అందుకు తాను ఏదో ఒకటి చేసే వాడిని అంటూ తన ప్రేమ కథల గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి కూడా తెలియజేశారు. తాను ప్రేమ వివాహం చేసుకున్నానని దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తన భార్యను చూడగానే తనకు మా అమ్మ గుర్తుకు వచ్చింది అచ్చం ఆ అమ్మాయి మా అమ్మలాగే ఉండడంతో నేరుగా వెళ్లి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో తన భార్య శ్రావణి తనని రిజెక్ట్ చేసిందని తెలిపారు. అయితే తన అభిప్రాయం చెప్పి ఆలోచించుకోమని చెప్పాను కొద్ది నెలలకు ఆమె వచ్చి తన లవ్ యాక్సెప్ట్ చేసిందని తెలిపారు.
ఇలా మేము లవ్ లో ఉన్న ఎప్పుడూ కూడా తనకు ప్రపోజ్ చేయలేదని లవ్ లేని లవ్ స్టోరీ మాది అంటూ ఈ సందర్భంగా మహేష్ విట్టా తన లవ్ స్టోరీలు గురించి తన పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇద్దరి మధ్య గొడవలు గురించి కూడా తెలిపారు. అందరిలాగే మా మధ్య కూడా గొడవలు ఉన్నాయని అయితే గొడవ పడిన ప్రతిసారి తానే సారీ చెబుతానని, ఇదే రూల్ అంటూ ఈ సందర్భంగా మహేష్ తెలియజేశారు. మహేష్ శ్రావణిల వివాహం 2023వ సంవత్సరంలో జరిగింది. శ్రావణి ఐటి ఉద్యోగి అని తెలుస్తుంది. స్వయానా మహేష్ చెల్లెలు ఫ్రెండ్ కావడం విశేషం. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈయన తన వ్యక్తిగత జీవితంలోను, అలాగే వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?