Big tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ విట్టా (Mahesh Vitta) తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈయన బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బిగ్ బాస్ సీజన్3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని 12వ వారం వరకు హౌస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీ జీవితంలో బిగ్ బాస్ ప్లస్ అయ్యిందా? లేదా మైనస్ అయిందా. అంటూ ప్రశ్న వేయడంతో బిగ్ బాస్ నాకు చాలా హెల్ప్ అయ్యిందని, బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా నేను చాలా నేర్చుకున్నానని తెలిపారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడంతో నాకు కాస్త కోపం తగ్గింది అలాగే ఓపిక కూడా పెరిగిందని తెలిపారు. బిగ్ బాస్ వెళ్లక ముందు ఏదైనా వెంటనే జరిగిపోవాలని ఆలోచించే వాడిని. బిగ్ బాస్ వెళ్లిన తర్వాత ఏ విషయం గురించైనా ఎదురు చూద్దాం. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని ఓపికగా ఎదురు చూస్తూ ఉంటానని తెలిపారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో ఏదైనా మర్చిపోని సంఘటన ఉందా అంటూ వర్ష ప్రశ్నించారు. నేను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళితే నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం ఉండేది తెరపై కమెడియన్ గా చూసిన నన్ను ఈ కార్యక్రమంలో నా రియాలిటీని చూసి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ ఉండేది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఓ రెండు వారాలు ఉంటే ఎక్కువ అనుకున్నాను కానీ, 12 వారాల పాటు హౌస్ లో ఉండటం నిజంగా గ్రేట్ అనిపించిందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో తాను ఎప్పటికీ మర్చిపోని విషయం ఏదైనా ఉంది అంటే ఫినాలే రోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారు నన్ను పొగడటం చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు.
ఫినాలే రోజు చిరంజీవి గారు నన్ను దగ్గరకు తీసుకుని నా గురించి దాదాపు ఓ నిమిషం పాటు మాట్లాడారు. అంతేకాకుండా ఆయన మా వీడియోస్ చూస్తారనే విషయాన్ని తెలియచేయడంతో ఒక నటుడుగా ఇంతకంటే ఏం కావాలనిపించింది. ఆ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేనని మహేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. బిగ్ బాస్ కార్యక్రమం నా కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందని ఈ కార్యక్రమాల ద్వారా నాలో చాలా మార్పులు కూడా వచ్చాయని తెలియజేశారు. ఇక మహేష్ విట్టా ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏకంగా ఐదారు సినిమాలను లైన్ లో పెట్టి వరుస సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే మహేష్ ఫన్ బకెట్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీతో అందరిని పెద్ద ఎత్తున నవ్విస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం వెండితెర సినిమాలతో ఈయన బిజీగా ఉన్నారు.
Also Read: Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?