IND VS PAK Women: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా దాయాది దేశాలు పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా తలబడనున్నాయి. దీంతో తెరపైకి షేక్ హ్యాండ్ వివాదం మరోసారి వచ్చింది. ఇప్పటికే పురుషుల టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు కూడా.. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్ టీమ్. ఇవాల్టి మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో వేదిక కొలంబో అయింది. ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లేదా జియో హాట్ స్టార్ లో ఉచితంగానే తిలకించవచ్చు. అయితే ఈ మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడిన డక్వర్త్ లూయిస్.. పద్ధతి ప్రకారం మ్యాచ్ ఫలితం డిసైడ్ కానుంది.
భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్ల మధ్య ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు ఉండకూడదని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే సూర్యకుమార్ యాదవ్ టీం… షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. ఇక ఇప్పుడు మహిళల టీమ్ ఇండియా జట్టు ప్లేయర్లు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయట. మరి దీనిపై పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
భారత్ జట్టు అంచనా: 1 ప్రతీకా రావల్, 2 స్మృతి మంధాన, 3 హర్లీన్ డియోల్, 4 హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), 5 జెమిమా రోడ్రిగ్స్, 6 దీప్తి శర్మ, 7 రిచా ఘోష్ (వికెట్), 8 అమంజోత్ కౌర్, 9 స్నేహ రాణా, 10 క్రాంతి
పాకిస్థాన్ అంచనా: 1 మునీబా అలీ, 2 ఒమైమా సొహైల్, 3 సిద్రా అమీన్, 4 అలియా రియాజ్, 5 నటాలియా పెర్వైజ్, 6 ఫాతిమా సనా (కెప్టెన్), 7 రమీన్ షమీ, 8 డయానా బేగ్, 9 సిద్రా నవాజ్ (WK), 10 నష్రా సంధు, 11 సాదియా ఇక్,
SL vs AUS at Women's CWC Called off. Next IND vs PAK!
Peak BCCI scheduling ofc. pic.twitter.com/1yHe4YcvdH
— Ragav 𝕏 (@ragav_x) October 4, 2025