కొండ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి తరచుగా అడవి జంవుతులు రావడం చూస్తుంటాం. కోతులు, ఏనుగులతో పాటు అప్పుడప్పడు పులులు, సింహాలు కూడా వస్తుంటాయి. ప్రజలకు భయంతో వణికిపోతారు. తాజాగా ఓ ఇంట్లోకి ఎలుగు బంటి అకస్మాత్తుగా రావడంతో మహిళ ఒక్కసారిగా భయపడింది. కాసేపు అయోమయానికి గురైంది. ఆ తర్వాత బయటకు దాని నుంచి తప్పించుకోని బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సాయంత్రం వేళ ఓ మహిళ తన బెడ్ రూమ్ లో పడుకొని ఫోన్ చూస్తే ఉంది. ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. కిటికీలో నుంచి ఓ ఎలుగు బంటి లోపలికి దూకింది. కిటికీ అద్దాలు పగలగొట్టుకుని లోపలికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే, లోపలికి వచ్చిన ఎలుగు బంటి ఆమె మీద ఎలాంటి దాడి చేయలేదు. ఓ మూలకు వెళ్లి కూర్చుంది. వెంటనే, ఆ మహిళ నెమ్మదిగా బెడ్ రూమ్ నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడింది. ఈ ఘటనలో ఆమె ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ఇంట్లో నుంచి సేఫ్ గా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది ఈ వీడియోలో కనిపించలేదు. ఈ తతంగం అంతా ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!
ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేయడంతో నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది ఆ క్షణం ఆమె ఎంతగా భయపడి ఉంటుందో అని కామెంట్స్ చేస్తే, మరికొంత మంది క్రేజీగా కామెంట్స్ చేస్తుంది. ఇంకొంత మంది ఏఐ వీడియో కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. “బెడ్ రూమ్ లోకి వచ్చిన ఎలుగు బంటి ఆమెను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడకపోవడం విశేషం” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇది ఏఐ వీడియో కాదు. కొన్ని ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఇళ్లలోకి వెళ్లడం చాలా సాధారణం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఆ టైమ్ లో మహిళతో పాటు ఎలుగు బంటి కూడా చాలా భయపడి ఉంటుంది. ఇద్దరు సేఫ్ గా ఉన్నారని భావిస్తున్నాను” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉన్నట్టుండి మాయం అయ్యింది. అంటే, ఇది కచ్చితంగా ఏఐ వీడియోనే. ఏమాత్రం డౌట్ లేదు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: బెడ్ రూమ్ లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…