BigTV English

Rashmika: రష్మిక ఎంగేజ్మెంట్.. వారికి థాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ !

Rashmika: రష్మిక ఎంగేజ్మెంట్.. వారికి థాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ !

Rashmika:దాదాపు గత ఐదు సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో రిలేషన్ లో ఉన్నా.. తమ బంధాన్ని దాచిపెట్టి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు రష్మిక మందన్న(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ‘గీతా గోవిందం’ సినిమా సమయంలో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీనికి తోడు ఎక్కడ చూసినా జంటగా వెళ్తూ వార్తల్లో నిలిచారే కానీ తమ బంధంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు గత రెండు రోజుల క్రితం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఈ ఇద్దరి నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన లేదు.


రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం.. బ్రేకప్..

అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ – రష్మిక ల పెళ్లి గురించి వార్తలు నడుస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రష్మికకు ఇది రెండవ ఎంగేజ్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తాను ఇదివరకే కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే.. తన తొలి సినిమా హీరో.. రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తో ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి, 2017 జూలై 3న అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరిద్దరూ విడిపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ తో మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక. ఇలాంటి సమయంలో తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

రక్షిత్ శెట్టి ట్వీట్ వైరల్..


కన్నడ హీరోగా పేరు సొంతం చేసుకున్న రక్షిత్ శెట్టి.. 777చార్లీ, సప్త సాగరాలు దాటి సైడ్ A, సైడ్ B వంటి విలక్షణ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే అలాంటి ఈయనకు ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో అరుదైన గౌరవం లభించింది. సెన్సార్ అయిన చిత్రాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే 777 చార్లీ సినిమా ఏకంగా 4 పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ రెండో చిత్రంగా నిలవడంతో పాటు ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా రక్షిత్ కి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకుంటూ..”777 చార్లీ సినిమాకి ఏకంగా నాలుగు అవార్డు లభించాయి. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్, ప్రతీక్ ఎడిటింగ్, నాగార్జున చేతి నుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి” అంటూ అటుచిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

also read:Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

రక్షిత్ శెట్టి అదృష్టం మామూలుగా లేదుగా..

మొత్తానికైతే రష్మిక, విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న వేళ ఇటు రక్షిత్ శెట్టికి భారీగా అదృష్టం లభించింది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఒక్క సినిమా ఏకంగా నాలుగు అవార్డులు అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఇది చూసిన నెటిజన్స్ రక్షిత్ అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Rashmika -Vijay Deverakonda: ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!

Spirit: సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో!

Radhika Apte: తెలుగు హీరో బండారం బయటపెట్టిన రాధికా.. మరీ ఇలా తయారయ్యారేంటి?

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Big Stories

×