Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ.. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. అప్పుడప్పుడు తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా.. ఆ చిత్రాల నష్టం ఎఫెక్ట్ నిర్మాతలపై పడడం లేదు అనడంలో సందేహం లేదు. అందుకే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.
మరొకవైపు తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అదే స్పిరిట్ (Spirit). సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. ప్రభాస్ తన చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగు నవంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు అటు అభిమానులలో కూడా అంచనాలు పెంచేస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా ప్రభాస్ కి పోటీగా వివేక్ అయితే చాలా పవర్ ఫుల్ గా సీన్స్ ఉంటాయని, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రభాస్ – వివేక్ కాంబినేషన్స్ లో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలని ఇప్పటినుంచే ఊహాగానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అలాగే ఇందులో మడోన్నా సెబాస్టియన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక, వీరిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి. ఇందులో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి (Tripti dimri) నటిస్తున్న విషయం తెలిసిందే.
ది రాజాసాబ్ , ఫౌజీ చిత్రాలతో పాటు.. సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.
రాంగోపాల్ వర్మ తర్వాత ఆ రేంజ్ లో పేరు దక్కించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. నిత్యం కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించారు.ఇదే కథను కబీర్ సింగ్ అంటూ హిందీలో చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసి మరో సంచలనం అందుకున్న ఈయన ఇప్పుడు స్పిరిట్ తో అంతకుమించి రికార్డ్స్ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం.
ALSO READ:Radhika Apte: తెలుగు హీరో బండారం బయటపెట్టిన రాధికా.. మరీ ఇలా తయారయ్యారేంటి?