Hyderabad:అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. మిల్లెట్ ఉద్యమి భారత్ 2025 పేరుతో ఐదు రోజులపాటు జాతీయస్థాయి కార్యక్రమాన్ని హైదరాబాద్ మినర్వా హాల్స్ లో ఘనంగా ప్రారంభించారు. www.millets.news అనే మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి 25 రాష్ట్రాల నుండి మొత్తం 140 మంది పాల్గొనబోతున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా మిల్లెట్ వ్యవసాయం నేర్చుకునే రైతులు, ఉత్పత్తులను తయారు చేయాలనుకునే వ్యాపారులు, అలాగే ఆరోగ్యానికి మిల్లెట్లు ఎలా ఉపయోగపడతాయో నేర్చుకునే ఆరోగ్య ప్రేమికులు అందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది.
ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ.. “వెయ్యికి పైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు, వాటి సమాధానాలు మా పోర్టల్ లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్స్ లో నిపుణులుగా మారాలనుకునే ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు” అంటూ ఆయన తెలియజేశారు.
ఇకపోతే ఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొనే మిల్లెట్ ముఖ్య శిక్షణ దారుల విషయానికి వస్తే..
శ్రీ తపస్ చంద్రారాయ్:
ఈయన వ్యవసాయ శాఖ అధికారి.. రైతులకు మిల్లెట్ సాగుపై శాస్త్రీయ శిక్షణ అందిస్తున్నారు. ఈయన ఒడిషా నుండి వచ్చారు.
జగన్నాథ్ చిన్నారి:
మిల్లెట్ ప్రాసెసింగ్, ఉత్పత్తుల తయారీలో నైపుణ్యాన్ని పంచుతున్నారు.
IIMR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) లో 2 రోజుల పాటూ శిక్షణనిచ్చే వారు:
డా. స్టాన్లీ , న్యూట్రిహబ్ సీఈఓ
అఖితా ఉపాధ్యాయ్ – మిల్లెట్ ఇన్నోవేషన్ నిపుణురాలు
HNA కౌన్సిల్ కు చెందిన డా. మోనికా శ్రావంతి ఆరోగ్య శిక్షణను అందించబోతున్నారు.
దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి 4 మంది ఎంపిక చేయబడిన నిపుణులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. రైతులు, తయారీదారులు, డైటీషియన్‌లు, ఆరోగ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగమవుతూ మిల్లెట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పూర్తి సమాచారం కోసం పైన ఇవ్వబడిన వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.