BigTV English

Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!

Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!

Sailesh kolanu: శైలేష్ కొలను (Sailesh kolanu).. పేరుకే యంగ్ డైరెక్టర్ కానీ.. వరుసగా చిత్రాలు చేసి తన ఖాతాలో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. 2020లో వచ్చిన ‘హిట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన శైలేష్ కొలను.. ఈ సినిమా ఫ్రాంఛైజీలో భాగంగా హిట్: ది సెకండ్ కేస్, హిట్ : ది థర్డ్ కేస్ చిత్రాలు చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల ఫ్రాంచైజీల మధ్యలో వెంకటేష్(Venkatesh ) 75వ చిత్రం సైంధవ్ (Saindhav)మూవీ చేశారు. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఈ ఏడాది హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శైలేష్ కొలను నెక్స్ట్ ఏ హీరోతో రాబోతున్నారు? ఎలాంటి కథతో రాబోతున్నారు? అని అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.


యంగ్ హీరోతో డైరెక్టర్ కొత్త మూవీ ఫిక్స్..

అందులో భాగంగానే.. ఇప్పుడు ఊహించని కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ నటులు శ్రీకాంత్ (Srikanth) తనయుడు యంగ్ హీరో రోషన్ (Roshan ) తో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అటు రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో మూవీ చేయబోతున్నారట. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయిందని, అయితే త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది అని సమాచారం. ఏది ఏమైనా శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో రోషన్ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని శ్రీకాంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇందులో హీరోయిన్ ఎవరు? నిర్మాతలు ఇలా ప్రతి విషయం త్వరలోనే తెలియనుంది.

ALSO READ:Spirit: సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో!


రోషన్ విషయానికి వస్తే..

ప్రముఖ సినిమా నటీనటులు శ్రీకాంత్ , ఊహ(Uha ) దంపతుల కుమారుడు రోషన్ మేక. 2015లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రోషన్.. 2016లో వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై..ఉత్తమ పురుష అరంగేట్రం విభాగంలో సైమా అవార్డును సొంతం చేసుకున్నారు. తర్వాత 2021లో ‘పెళ్లి సందD’ సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘ఛాంపియన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఛాంపియన్ సినిమా విశేషాలు..

జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఆర్ట్ క్రియేషన్స్, స్వప్న సినిమా, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. ఆర్.మది సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల వాయిదా పడుతోంది. ఇంకా కొత్త డేట్ ను ప్రకటించలేదు మేకర్స్.. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related News

Hero Suhas: సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. భారీగా నష్టం!

Rashmika -Vijay Deverakonda: ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Spirit: సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో!

Radhika Apte: తెలుగు హీరో బండారం బయటపెట్టిన రాధికా.. మరీ ఇలా తయారయ్యారేంటి?

Rashmika: రష్మిక ఎంగేజ్మెంట్.. వారికి థాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ !

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

Big Stories

×