Illu Illalu Pillalu Today Episode October 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ కళ్యాణ్తో దిగిన ఫోటోలు గురించి తన పుట్టింటి వాళ్లకు ఎవరు చెప్పారు కచ్చితంగా తెలుసుకోవాలని వేదవతి అనుకుంటుంది.. నర్మద కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కచ్చితంగా అసలు వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. మొదటినుంచి వల్లి మీద డౌట్ ఉన్న సరే.. తనకు అంత సీన్ లేదని లైట్ తీసుకొని నర్మదా తానే ఇది చేసింది అని తెలుసుకుని ప్రయత్నం చేస్తుంది.. పార్టీలో మాజీ ప్రియురాలు ఐశ్వర్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకొని తనని తానే మర్చిపోతాడు. పక్కనే ఉన్న ప్రేమ మాత్రం ఎవరు ఏంటి? ఇంత ఓవరాక్షన్ అని అడుగుతుంది. తను నా పాత ఫ్రెండ్ ఐశ్వర్య అని ప్రేమకు పరిచయం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధీరజ్ తో ఐశ్వర్య డాన్స్ వేయడం చూసిన ప్రేమ కుళ్లుకుంటుంది. తన ఫ్రెండ్స్ ప్రేమ చేత కావాలని మందు తాగిస్తారు. ధీరజ్ దగ్గరికి వెళ్లిన ప్రేమ నువ్వు నాతోనే డాన్స్ చేయాలి ఎందుకంటే నేను నీ భార్యను కాబట్టి అని ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తారు. వీరి డాన్స్ ఎపిసోడ్కి హైలెట్గా మారుతుంది. పార్టీ అయిన తర్వాత ప్రేమని జాగ్రత్తగా ధీరజ్ కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడు.
శ్రీవల్లి గురించి అసలు నిజాన్ని తెలుసుకుని నర్మదా.. ప్రేమ ఫోటోలు గురించి ఎదిరింటి వాళ్ళకి చెప్పింది మీ వాళ్లే అన్న విషయం నాకు తెలిసిపోయింది. వాళ్ళు ఎట్టి పరిస్థితులను రేపు ఉదయం ఇక్కడ ఉండాలి. లేదంటే మావయ్య గారికి అన్ని విషయాలు గురించి చెప్పి మీ వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను అని నర్మదా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది.. ఏం మాట్లాడుతున్నావ్ అమాయకురాలైన నన్ను పట్టుకుని ఇన్ని మాటలు అంటావా? ఎంత అవమానిస్తున్నావో తెలుసా అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే నర్మదా అసలు వినదు..
నీ నాటకాలు నీ డ్రామాలు నా దగ్గర కాదు అని నర్మదా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. శ్రీవల్లి జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్తుంది. ఏం చేస్తారో బాబా నాకు తెలీదు. నర్మదా మీ గుట్టు మొత్తం మా మామయ్య గారికి చెప్పేలా ఉంది కచ్చితంగా మీరు రేపు పొద్దున కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్తుంది. ఫుల్లుగా తాగి ఉన్న ప్రేమని ధీరజ్ ఎంతో కష్టం మీద ఇంటికి తీసుకుని వస్తాడు.
Also Read:భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?
ఇంటికి వచ్చిన ప్రేమ శ్రీవల్లిని చూసి ఎవరిది అచ్చం దెయ్యంలాగా ఉంది అని గోరంగా అవమానిస్తుంది.. ఈమె మా వదిన శ్రీవల్లి వదిన అని ఎన్నిసార్లు చెప్పినా ధీరజ్ కి ఈమె అర్థం దెయ్యంలాగే ఉంది అని అంటుంది. నన్ను దెయ్యం అంటావా? ఫుల్లుగా తాగొచ్చావు కదా అని శ్రీవల్లి అంటుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే మావయ్యకు చెప్పాల్సిందే అని శ్రీవల్లి అనుకుంటుంది. అంతలోపే నేను ప్రేమని కాదు ఇలా రా అని దెయ్యంలాగా ప్రేమ మాట్లాడుతుంది. ప్రేమ మాటలు విన్న శ్రీవల్లి భయపడి పోయి ప్రేమ చెప్పినట్టు చేస్తుంది. ఇక ప్రేమ శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటుంది. అక్కడితో ప్రోమో పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..