Radhika Apte: రాధిక ఆప్టే (Radhika Apte).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై అప్పుడప్పుడు నోరు విప్పుతూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై చేసే కామెంట్లు వింటే మాత్రం ఇలా తయారయ్యారేంటి? అంటూ అనకమానరు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న మధ్య క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసి పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అతను తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును.. ఆ మాటలని కూడా బహిర్గతం చేసింది రాధిక ఆప్టే.
అందులో భాగంగానే తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే.. టాలీవుడ్ హీరోతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా రాధిక మాట్లాడుతూ..” ఒకసారి నేను ఎలివేటర్ లో వెళ్తున్నప్పుడు..ఒక తెలుగు స్టార్ హీరో కూడా అందులో వచ్చాడు. అప్పుడు అతడు నాతో అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. నిజానికి ఆ హీరోకి నాకు పెద్దగా పరిచయం లేదు . కానీ నాతో చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి సమయంలో మీ బ్యాక్ దురద పెడితే నన్ను పిలవండి.. నేను మీ రూమ్ కి వచ్చి రుద్దుతాను.. అన్నారు. దీంతో నేను షాక్ అయిపోయి సీరియస్గా చూశాను. నా చూపుకి ఆ ముసలి హీరో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయారు” అంటూ రాధిక ఆ తెలుగు స్టార్ హీరోపై ఊహించని కామెంట్లు చేసింది. దీంతో రాధికా కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ తెలుగు హీరో ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్.. ఏది ఏమైనా రాధిక ఆప్టే మాటలు విన్న నెటిజన్స్ మాత్రం ఇండస్ట్రీలో ఇలా కూడా ఉంటారా? ఇలా తయారయ్యారేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Rashmika: రష్మిక ఎంగేజ్మెంట్.. వారికి థాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ !
రాధిక ఆప్టే కెరియర్..
మరాఠీ నటిగా పేరు సొంతం చేసుకున్న రాధిక ఆప్టే.. తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఈమె లండన్ లో నృత్యం నేర్చుకొని , రంగస్థలం మీద నటిస్తూ.. అటు నుంచి మరాఠీ రంగానికి, హిందీ సినిమా రంగానికి పరిచయమైంది. ఈమె చిత్రాలు చూసిన కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రక్త చరిత్ర సినిమా ఆడిషన్స్ కి పిలిపించి మరీ ఈమెను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. ఆ తర్వాత రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్ , కబాలి వంటి చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాదు హిందీ , బెంగాలీ భాషల్లో కూడా నటించింది రాధిక ఆప్టే. తండ్రి నరాల వైద్యుడు కాగా తల్లి మత్తుమందు వైద్య నిపుణురాలు. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు.