Konda Surekha Grandson: సిద్ధిపేట జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎప్పుడూ.. రాజకీయ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి సురేఖ కాదు.. వారి మనవడు, చిన్నారి శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటోంది. కేవలం చిన్న వయస్సులోనే ఈ బాబు తన చలాకి మాటలతో, తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
చిన్నారి తెలివి చాటిన వీడియో వైరల్
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు జూపల్లి, సీతక్క తదితరులను గుర్తు పట్టడమే కాకుండా పేరు పెట్టీ మరి పిలుస్తున్న కన్నయ్య.
స్వయంగా మంత్రి సురేఖ మంత్రుల సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను చూపిస్తూ కేబినెట్ మంత్రుల చిత్రాలను చూపించగా, వారిని శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ పేరుతో స్పష్టంగా పిలవడం సంభ్రమాశ్చర్యంగా నిలిచింది.
అబాకస్ వయసులోనే పాలిటికల్ మైండ్!
అబాకస్ తో ఆడుకోవాల్సిన సమయంలో మంత్రి కొండా సురేఖ మనవడు చిన్నారి తన చలాకి మాటలతో ఔరా అనిపించారు.
అతడు ఎవరు.. కొండా ఫ్యామిలీ వారసుడు.. ఈ చిన్నోడి బ్లడ్లోనే రాజకీయం ఉంది రా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు రావడం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
ఈ వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ సంపాదించింది. ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో “#ChinnaCM, #KondaFamily, #ShriyansPatel” హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు, కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇదే కొండా వారసత్వం! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ట్రావెల్స్ బస్సుల మధ్య నుజ్జు నుజ్జు అయిన కారు
భవిష్యత్తులో లీడర్ అవుతాడా?
శ్రియాన్స్ చిన్న వయస్సులోనే చూపుతున్న అవగాహన, మాటతీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నోడు రాజకీయాల్లో అడుగుపెడతాడా అనే ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి. “బ్లడ్‌లోనే పొలిటిక్స్ ఉంది రా బాబు వద్ద!” అంటూ నెటిజన్లు షేర్ చేస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చిచ్చర పిడుగు.. ఔరా అనిపిస్తున్న మంత్రి కొండా సురేఖ మనవడు..
రాజకీయ నాయకులు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పేర్లను అడిగిన వెంటనే చెప్పి ఆశ్చర్యపరుస్తున్న మాస్టర్ శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వండర్ కిడ్ వీడియో
రాజకీయం ఆ చిన్నోడి బ్లడ్ లోనే ఉంది అంటూ… pic.twitter.com/S8ISdnXuBT
— BIG TV Breaking News (@bigtvtelugu) October 5, 2025