Intinti Ramayanam Today Episode October 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ కి ఇచ్చిన డబ్బులు పోవడంపై ఇంట్లో అందరి మీద అనుమానం మొదలవుతుంది. ఆ డబ్బులు ఎవరు తీశారు అని అనుకుంటూ ఉండగానే పల్లవి మన ఇంట్లో వల్లే తీసి ఉంటారు ఇంట్లోనే ఆ డబ్బులు ఉంటుంది వెతకండి అని అంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు వెళ్లలేదు కాబట్టి డబ్బులు ఎక్కడ ఒక చోట ఉంటాయి వెళ్లి వెతుకుదాం పదండి అని పల్లవి తన మీద నింద రాకుండా వెతుకుతుంది. ముందుగా అక్షయ్ రూమ్ లో డబ్బులను ఎంత వెతికినా సరే కనిపించవు.. భరత్ రూమ్ లో డబ్బులు కనిపించడంతో షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పల్లవి అక్షయ్ భరత్ ని ఎంతగా కొడుతున్నా సరే నిజం చెప్పద్దని చెప్తుంది. చక్రధర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భరత్ ఆ విషయాన్ని నిజం చెప్పడు. మా తమ్ముడిని దొంగ అంటే నేను అసలు ఒప్పుకోను అని అవని అంటుంది. నా తమ్ముడు డబ్బులు తీసాడని ఏంటి సాక్ష్యం అని అవని అంటుంది. ఇలాంటి బికారి గాడికి నా చెల్లెల్ని ఇవ్వద్దన్న సరే నువ్వు ఇచ్చావు రూపాయి కూడా గతి లేని వీడికి 50 లక్షలు ఎలా వచ్చాయి వీడే దొంగతనం చేసి ఉంటాడు అని అక్షయ్ అంటాడు. రాజేంద్రప్రసాద్ పార్వతి కూడా అవని నీకు ఏదో ఒక జాబ్ చూపిస్తానన్నా కూడా వద్దని అన్నావు. ఒకవేళ డబ్బులు కావాలని అడిగితే అక్షయ్ లాగే నీకు కూడా డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి పెట్టించే వాళ్ళం కదా అని అంటారు..
ఎవరు ఎన్ని మాట్లాడుతున్న భరత్ మౌనంగా భరిస్తాడు. అందరూ అవనీని అంటారు. నువ్వు ఇవ్వకుండా నీ తమ్ముడు దగ్గరికి డబ్బులు ఎలా వచ్చాయి? నువ్వే ఆ డబ్బులు ఇచ్చావని అంటే శ్రేయ పల్లవి నోరు మూసుకునే వాళ్ళు కదా అని రాజేంద్రప్రసాద్ అవనితో అంటాడు. అక్షయ్ అసలు డబ్బులు పోయినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు అని అంటాడు.. నేను ఇచ్చానని చెప్తే ఆయన అసలు డబ్బులు తీసుకోడు మావయ్య అందుకే నేను మీరిచ్చారని చెప్పమని చెప్పాను అని అంటుంది అవని. ఇప్పుడు ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ ఒక్క మాటే అమ్మా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
వీళ్ళు మాట్లాడుకోవడం కొంతవరకు విన్న అక్షయ్ ఈ డబ్బులు గురించి తేలాలంటే కచ్చితంగా పోలీసులు రావాల్సిందే అని అక్షయ్ అంటాడు. కానీ అవని పోలీసులను పిలిపిస్తే ప్రణతి జీవితం ఏమవుతుందో తెలుసా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. నిజంగానే ఆ డబ్బులు భరత్ తీశాడా లేదా ఎవరైనా భరత్ ని ఇరికించాడా అని ఆలోచిస్తారు. అక్షయ మాత్రం కచ్చితంగా నేను పోలీసులను పిలుచుకొని వస్తాను అసలు దొంగ ఎవరో వాళ్ళే తేలుస్తారు అని అంటాడు.
రాజేంద్రప్రసాద్ పోలీసులను ఏమీ వద్దు కానీ మనమే మరోసారి భరత్ ని అడుగుదాము అని అంటాడు. పోలీసులను తీసుకొని వస్తే వాడి జీవితం ఏమవుతుంది అని అవని అంటుంది. డబ్బులను తీసుకొని దాచుకోవడం మాత్రం బాగుంది అని మీ తమ్ముడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అక్షయ్ అంటాడు. ఇక అవని మరోసారి భరత్ ని పిలిచి ఆ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పురా అని బ్రతిమలాడుతుంది.
భరత్ ఆ డబ్బులు గురించి నువ్వు చెప్పకపోతే మీ బావగారు పోలీసులను పిలిపిస్తానని అంటున్నాడు. నిజంగానే నువ్వు తీసావా? నీ గురించి నాకు నమ్మకం ఉంది కాబట్టే నీకోసం నేను ఎంతగా ప్రాకులాడుతున్నాను అని అవని అంటుంది.. నీ కాళ్లు పట్టుకుంటాను రా ఆ డబ్బులని నువ్వే తీసావా లేదా నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా అని అడుగుతుంది అవని. ప్రణతి నువ్వు ఆ డబ్బులు గురించి చెప్పకపోతే నేను ఉరిపోసుకొని చస్తాను అని బెదిరిస్తుంది. దాంతో భరత్ మా అక్క కోసం కాదు నీ కోసం చెప్తాను అని అసలు నిజం చెప్తాడు.
Also Read: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..
నాకు ఆ డబ్బులని పల్లవి అక్కనే ఇచ్చింది అని నిజాన్ని బయటపెడతాడు. అవును మీరందరూ విన్నది నిజమే నాకు పల్లవి అక్కని బిజినెస్ కోసం డబ్బులు ఇచ్చింది అని అంటాడు భరత్. మొత్తానికి భరత్ నోరు విప్పడంతో పల్లవి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. భరత్ నోరు విప్పడంతో పల్లవి పరిస్థితి ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..