BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు, సుమతి మధ్య వార్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: బాలు, సుమతి మధ్య వార్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode june 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందంగా కనిపించాలని రోహిణి ప్రభావతికి ఫేస్ ప్యాక్ వేస్తుంది. రాత్రి అంతా అలానే ఉంటే బాగుంటుందని చెప్తుంది. అనుకోకుండా రాత్రి కరెంటు పోవడంతో ప్రభావతిని చూసి అందరూ దయ్యమని భయపడతారు.. రాత్రిపూట ఇలాంటి ప్రయోగాలు ఏంటి అని అందరూ కంగారుపడుతూ ఉండడం చూసి సత్యం అరుస్తాడు. నీ ఫేస్ ప్యాక్ ల పిచ్చి తో పిల్లల్ని భయపెడతావా అంటూ సత్యం ప్రభావతి పై అరుస్తాడు.. ఫ్యూజ్ పోయిందని బాలు ఫ్యూజ్ వేస్తాడు. ఆ తర్వాత సత్యం ప్రభావతిని ఆ మొహానికి ఉన్నది కడుక్కొని వస్తేనే గదిలోకి రానిస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో చేసేదేమి లేక ప్రభావతి ముఖం కడుక్కొని వస్తుంది.. పూల కోసం మార్కెట్ కు వెళ్లిన మీనా బాలు పై రివేంజ్ తీర్చుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజు ఇంటర్వ్యూకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పార్కులో తనకు అప్పిచ్చిన ఫ్రెండు ఎదురవుతాడు. అతని చూసి మనోజ్ పారిపోతుంటే అతను ఎందుకు బ్రో నువ్వు పారిపోతున్నావ్ అని అడుగుతాడు. నీ అప్పు నేను కెనడాకు వెళ్ళిన తర్వాత తీర్చేస్తాను.. నువ్వు మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి అడగద్దు అని మనోజ్ అంటాడు. దానికి ఆ వ్యక్తి నువ్వు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు బ్రో. ఆల్రెడీ మీ వైఫ్ వడ్డీతో సహా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇచ్చేసింది అని చెప్తాడు. అలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం బ్రో అనేసి అతను అంటాడు.

మనోజ్ ఇంటికి వెళ్లి రోహిణి తో ఈ విషయాన్ని అడుగుతాడు. అయినప్పటి నుంచి నేను నీకు ఏమీ చేయలేదు కదా.. నువ్వు నాకోసం ఎంతో చేస్తున్నావ్ నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అని మనోజ్ తెగ మురిసిపోతాడు. ఇక సుమతిని తీసుకురావాలని మీనా బాలు అక్కడికి వెళ్తారు. సుమతి ఆటో నిండా పూలే ఉన్నాయి నేను ఎక్కడ కూర్చోవాలి అని అడుగుతుంది. మీ అమ్మ కూర్చోడానికి ఎంత ఇబ్బంది పడాలి నువ్వేమీ పిట్టలాగే ఉన్నావు కదా ఎక్కడో చోటు కూర్చొని బాలు అంటాడు. దానికి సుమతి అక్క నువ్వు ఒకసారి దిగు అనేసి అడుగుతుంది. ఎందుకే నా మీద కూర్చో వెళ్ళిపోదామని మీనా అంటుంది.


నువ్వు దిగు అక్కా చెప్తాను అని సుమతి అంటుంది. ఇక మీనా దిగగానే నువ్వు వెళ్లి బావ పక్కన కూర్చొని సుమతి చెప్తుంది. కానీ బాలు మాత్రం ఈ పక్కన కూర్చుంటే పోలీసులు పట్టుకుంటారని ఎంత చెప్పినా కూడా సుమతి వినకుండా మీనా అని బాలు పక్కనే కూర్చోబెడుతుంది.. ఇక ఇద్దరూ అలా కూర్చొని ఒకరి మీద ఒకరు పడుతుంటే సుమతి సంతోషంగా ఫీల్ అవుతుంది. బాలు మాత్రం నా మీద పడుతుంటే నాకు ఏదోలా ఉంది సరిగ్గా కూర్చో అంటూ మీనా పై సీరియస్ అవుతుంటాడు.

బస్తి జనమంతా ప్రభావతి ఇంటికి వస్తారు. పూలమాలలు కట్టాలి మీనా ఎక్కడుంది అని అడుగుతారు. మీనా లేదు మీరేంటి అంతా సొంత ఇంట్లోకి వచ్చినట్టు వచ్చేసారు అనేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది ప్రభావతి. మమ్మల్ని ఏమన్నా ఊరుకుంటాం కానీ మీనా ని ఒక్క మాటంటే ఊరుకునేదే లేదు అని వాళ్లంతా ప్రభావతిపై సీరియస్ అవుతారు. మా మీనా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు.. మా బస్తి జనానికి మీనా సొంత బిడ్డ లాంటిది. ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తారు.

ఇక తర్వాత మీనా వచ్చేస్తుంది. పువ్వులన్ని తీసుకొచ్చావా మీనా అని అందరు అడుగుతారు. తీసుకొచ్చాను అక్క ఎక్కడ కూర్చుందాం ఇక్కడ కూర్చున్నామా అనేసి అడుగుతారు. కానీ సత్యం ప్రభావతి చెప్పిన మాట వింటాడు.. కూర్చుంటే వచ్చే పోయే వాళ్లకి అడ్డంగా ఉంటుంది కదా హాల్లోనే కూర్చున్నామని చెప్పగానే అందరూ సంతోషంగా వెళ్లి హాల్లో కూర్చుంటారు.. ప్రభావతి మాత్రం ఇల్లంతా పూల కొట్టును చేసేసారు కదా అని బాధపడుతూ ఉంటుంది. మనోజ్ ఏంటమ్మా ఇదంతా పూల కొట్టు లాగే ఉంది ఇల్లంతా అని అంటాడు. దానికి ప్రభావతి సెటైర్లు వేస్తుంది. సత్యం ప్రభావతికి పెద్ద క్లాసే పీకుతాడు. మీనా ఒక్క రాత్రిలో 2,50,000 మాలలు తయారు చేస్తుంది ఇది నువ్వు గ్రేట్ గా ఫీల్ అవ్వాలి అని సత్యం అంటాడు.

ఇంట్లో వాళ్లందరికీ టీ పెట్టి తీసుకురావాలి అని ప్రభావతికి ఆర్డర్ వేస్తాడు సత్యం. అటు మౌనిక సంజయ్ ని ఎలాగైనా తన దారిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. నీ సంజయ్ మాత్రం నేను ఇన్ని మాటలు అన్నాను కదా.. నువ్వు అవమానంతో చచ్చిపోతావేమో అనుకున్నాను కానీ నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి కొత్త ప్లాను అని మౌనికను తిడుతూనే ఉంటాడు.. ఇక ప్రభావతి వీళ్ళందరికీ నేను టీ పెట్టాలా అంటూ కామాక్షికి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గుణ మీనాకు ఈ ఆర్డర్ ని ఎలాగైనా పోగొట్టాలి పూలమాలన్నీ మండపానికి పోనివ్వకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తాడు.. ఆ ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×