E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని చితక్కొట్టిన స్వామీజీ.. బాలుకు షాకిచ్చిన పోలీస్.. అయ్యో పాపం రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణిని చితక్కొట్టిన స్వామీజీ.. బాలుకు షాకిచ్చిన పోలీస్.. అయ్యో పాపం రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 9th: ఉదయం లేవగానే రోహిణి ని మనోజ్ దగ్గరికి తీసుకొని వస్తారు. మనోజ్ ప్రభావతి ఇద్దరూ కలిసి రోహిణిని కామాక్షి ఇంటికి తీసుకొని వస్తారు. కామాక్షి అక్కడ ముగ్గు వేస్తూ కనిపించడంతో ఏంటే ఆంటీ ముగ్గు వేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. రోహిణి ప్రవర్తన చూసి నిజంగానే దెయ్యం పట్టిందని అనుకుంటారు. అప్పుడే ఇంట్లోకి ఒక స్వామీజీ రావడంతో రోహిణి ఈ దెబ్బకు వీళ్ళకి షాక్ ఇవ్వాలి అని అనుకుంటారు. రోహిణి నిజంగానే దెయ్యం పట్టినట్లు చేయడంతో ఆ స్వామిజి కర్రతో రోహిణి దారుణంగా కొడతారు..

అయ్యో.. రోహిణి అడ్డంగా ఇరుక్కుందే..

రోహిణి రోజు అలా కలవరిస్తూ ఉండడం చూసి నిజంగానే తనకి వాళ్ళ నాన్న దెయ్యం పట్టితో పాటు కామాక్షి కూడా అనుకుంటుంది. అయితే కామాక్షి కూడా రోహిణి చూసి భయపడిపోయి ఒక స్వామీజీని పిలుస్తాది. అక్కడ ఆ సెటప్ ని చూసి రోహిణి కాస్త భయపడుతుంది. రోహిణి ఒంట్లో దయ్యం ఉందని తెలుసుకున్న వాళ్ళు నిజంగానే రోహిణికి దెయ్యం పట్టింది అని ఆ స్వామిజి దగ్గరికి బలవంతంగా వెళ్లి కూర్చోబెడతారు.. ఇక ఆ స్వామీజీ నిజంగానే రోహిణిలో దయ్యం ఉంది అని ఒక కర్ర తీసుకొని చితగ్గొట్టేస్తాడు. లోపలికి వెళ్లి రోహిణి ఇలా చావగొట్టారు ఏంటి అని బాధ పడిపోతూ ఉంటుంది. అయ్యో మా నాన్న పేరు చెప్తే నేను వదిలేస్తారు అనుకున్నాను ఇలా వాతలు పెడతారని అస్సలు అనుకోలేదు అని రోహిణి లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది..

బాలుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్..

Advertisement

బాలు తన కారులో ఎక్కిన కస్టమర్ బాధపడిపోతూ ఉంటాడు. అతను ఫోన్ మాట్లాడడం బాలు వింటాడు. అయితే జాబ్ చేసి మా నాన్నని మంచిగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నాకు జాబ్ వచ్చే టైం కి మా నాన్న ఇప్పుడు దూరం అయిపోయాడు అని బాధ పడిపోతూ ఉంటాడు. మీరేం బాధపడకండి సార్ మీ నాన్న చివరి చూపు మీకు దక్కేలనే చేస్తాను రైల్వే స్టేషన్ కి టైం కి తీసుకెళ్తాను అని బాలు కస్టమర్ కి మాట ఇస్తాడు. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో రాంగ్ రూట్లో వెళ్లి అతని రైల్వే స్టేషన్ కి వెళ్లేలా చేస్తాడు. అయితే రాంగ్ రూట్లో వచ్చిన బాలుని చూసినా ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ బాలుని పట్టుకొని ఆ కారుని తీసుకొని వెళ్ళిపోతాడు.. నా మీద పగ తీర్చుకోవాలని మీరు ఇలా చేస్తున్నారు సార్ అని అనగానే డ్యూటీ డ్యూటీ అని అతను వెళ్ళిపోతాడు..

రవి, శృతి హనీమూన్ ప్లాన్..

రవి శృతి ఇద్దరు కూడా కాసేపు గొడవపడి ఆ తర్వాత మనం పెళ్లి ఎలాగో సరిగా చేసుకోలేదు కదా యానివర్సరీ డే అన్నా సరిగ్గా చేసుకుందాము అని అంటారు.. మనం ఎక్కడికైనా వెళ్లి మంచిగా ఎంజాయ్ చేద్దాము అని ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు.. పెళ్లయిన తర్వాత మనం హనీమూన్ కి కూడా వెళ్లలేదు కదా మా రవి ఇప్పుడు మనం హనిమూన్ కన్నా వెళ్దాము అని అడుగుతుంది శృతి.. వీళ్ళిద్దరూ సరదాగా ఉండడం ఎపిసోడ్ కి కాస్త హైలెట్గా నిలుస్తుంది.

మీనా పై బాలు సీరియస్..

Advertisement

బాలు చాలా సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ లోపలికి రావడం చూసిన మీనా ఏమైనా ఎందుకంటా కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. వాడు నాకు కావాలని చేస్తున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టాలని ఇలా ప్రవర్తిస్తున్నాడు.. అయితే మీనా దగ్గరికి వచ్చి బాలు చెప్పగానే మీరు చేసింది తప్పే కదా వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటించారు అని బాలుని అనడంతో ఇంకా సీరియస్ అవుతాడు బాలు. మీనాపై కోపంగా అరుస్తాడు. భోజనం చేయండి అని మీనా అడుగుతున్న సరే బాలు మాత్రం నాకొద్దు నా కారు నా చేతికి వచ్చేంతవరకు నేను ఏమి తినను తాగను అని అంటాడు. నా కారుని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని మీ నాన్న పై అరిచి వెళ్ళిపోతాడు బాలు. పూలు డెలివరీ ఇచ్చిన మీనా ఎస్ఐ గారితో మా ఆయన కారును విడిపించేలా చేయండి అక్క అని అడుగుతుంది ఆమె సరే నేను ప్రయత్నిస్తాను అని అంటుంది.

రోహిణి కి దెబ్బలు తప్పట్లేదు..?

రోహిణి పడుకొని ఉండగా స్వామికి దెబ్బలు కొట్టాలి అని చెప్పారు కదా అని మనోజ్ కర్ర పట్టుకుని అక్కడికి వస్తాడు. పడుకొని ఉంది కదా ఇప్పుడు కొడితే దెబ్బలు తగులుతాయేమో.. మా మామ లేసి నన్ను కొడతాడేమో. అసలు ఎప్పుడు కొట్టాలో మా అమ్మని అడిగేసి వస్తాను అని కిందకి వెళ్తాడు. మనోజ్ ని చూసిన ప్రభావతి వాళ్ళ మామ వీడికి వచ్చిందా అని అనుమాన పడుతుంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మనోజ కాదా అని కన్ఫామ్ చేసుకుంటుంది. ఇక రోహిణి కొట్టగానే రోహిణి కెవ్వుమని అరుస్తుంది. రోహిణిని కొట్టాను అని బాధ పడిపోతూ ఉంటాడు..

మీనాను హగ్ చేసుకున్న బాలు..

తన కారు కోసమని పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాలుని అక్కడున్న కానిస్టేబుల్ పిచ్చిపిచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడు.. కానీ ట్రాఫిక్ పోలీస్ అరుణ్ వచ్చి అతని బయటికి గెంటేయండి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సీఐ బాలుని లోపలికి రమ్మని పిలుస్తాడు.. టాపిక్ కానిస్టేబుల్ కి వార్నింగ్ ఇచ్చి బాలు కార్ కీస్ ని ఇవ్వమని చెప్తాడు. నేను ఒక పెద్దాయన చనిపోతే ఇలా చేశాను అని చెప్పబోతుంటే ఆల్రెడీ మీ ఆవిడ చెప్పింది లేదని అంటాడు. మీ ఆవిడ మీనా నే కదా ఆవిడ గొప్పగా చెప్పింది అందుకే నీ కార్ని రిలీజ్ అయ్యేలా చేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఫైన్ కట్టి వెళ్లిపో అని అతను అంటాడు. ఇక తర్వాత ఇంటికి వెళ్లిన బాలు మీనా దగ్గరికి వెళ్లి మీనా కోపాన్ని చల్లార్చాలని కౌగిలించుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: భానుమతి పై పల్లవి సీరియస్.. సుబ్బారావు లవ్ స్టోరీ రివీల్.. భరత్ కు వార్నింగ్..

Related News

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Big Stories

Advertisement
×