E-Paper
Advertisement

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
Advertisement

Visakhapatnam: తిరుపతిలో మంగళవారం కూటమి ప్రభుత్వం తలపెట్టిన బహిరంగ సభ అనుకోకుండా వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు వెళ్లనున్నారు.

అనుకోకుండా తిరుపతి కూటమి సభ వాయిదా

Advertisement

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయోత్సవ సభను సంక్షేమం పేరిట నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మూడు సభలకు ప్లాన్ చేశారు. మంగళవారం తిరుపతి వేదికగా తొలి విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

సభను విజయవంతం చేసేందుకు రెండు రోజులుగా కూటమి నేతలు, క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే సోమవారం సాయంత్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్‌లు కలిసి సభ నిర్వహణపై సంప్రదింపులు జరిపారు.

Advertisement

స్టీల్‌ప్లాంట్ ఘటన.. విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

చివరకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన సభను తిరిగి అదే ప్రాంగణంలో జూన్ 12న భారీ సభ నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు రానున్నారు.

ఘటనలో మృతి చెందిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులను ఓదార్చు నున్నారు. కిమ్స్-సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించునున్నారు. ఆ తర్వాత స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.  ఘటన గురించి అధికారులను నుంచి సమాచారం తీసుకోనున్నారు.

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×