E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. పిల్లల కోసం బాలు ప్లాన్.. శివ వీడియో బయటపడుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. పిల్లల కోసం బాలు ప్లాన్.. శివ వీడియో బయటపడుతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు సంజుతో ఎలా మాట్లాడాలి అన్నది.. మీనా చెప్పినా కూడా నాకు రావడం లేదే అని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటాడు. బాలు అంతరాత్మ బయటికి వచ్చి ఏం చేస్తున్నావ్ రా నీకు విరగొట్టడం తెలుసుగాని ఇలా మాట్లాడటం నీకు ఎలా తెలుస్తుంది అని అంటాడు.. ఇక తర్వాత బాలు ఎలాగైనా సరే సంజయ్ తో కూల్ గా మాట్లాడాలి అనుకుంటాడు.. సంజయ్ దగ్గర ఎలాగైనా సరే మార్కులు కొట్టేయాలని నన్ను క్షమించండి బావగారు.. మీ మనసు నచ్చుకునేలా నేను ఎప్పుడూ చేయను అని అంటాడు.. ఆ మాట వినగానే సంజయ్ షాక్ అవుతాడు. ఇక భోజనం ఏర్పట్ల దగ్గరికి సంజయ్ వెళ్తాడు అందరూ అతనికి మర్యాదగా భోజనం వడ్డిస్తారు. అది చూసి సంజయ్ ఏమైంది వీళ్ళందరికీ అని అనుకుంటాడు. మొత్తానికి అయితే పూజ చాలా గ్రాండ్ గా పూర్తవుతుంది. యాగం కూడా బాగా పూర్తవడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు..

యాగంలో నాలుగు దంపతులు కూర్చొని పూజ చేయడంతో ప్రభావతి, సత్యం చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా యాగం పూర్తవడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ ని వినబోతామని ఆనంద పడుతూ ఉంటారు.. మౌనికకు వాంతులు రావడంతో ఏంటి ఏం చేసావే నువ్వు వాంతులు వస్తున్నాయి అని ప్రభావతి అంటుంది. నేనేం చేయలేదు ఏమైనా అర్థం కావట్లేదు అత్తయ్య అని మీనా అంటుంది.. సుశీలమ్మ ఏమైందో కనుక్కొని మౌనిక కడుపుతో ఉంది అని అనుకుంటుంది. ఈ విషయాన్ని అందరికీ చెప్పడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మౌనిక ఇక తల్లి కాదు అని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేయాలి అని చూసిన సంజయ్ కి దిమ్మ తిరిగే షాప్ ఎదురవుతుంది. వదిలించుకోవాలని చూసిన మౌనికని శుభవార్తతో తన ఇంటికి తీసుకుని వెళ్తాడు సంజయ్. మౌనిక కడుపుతో ఉండడం మిగతా వాళ్ళందరికీ సంతోషాన్ని ఇస్తుంది. మీనా బాలు ఇద్దరూ రాత్రి అక్కడే ఉండాలని అనుకుంటారు. అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా నేనా మధ్యలో తాటి బెల్లం కలిపిన పాలను తీసుకుని వచ్చాను అని అంటుంది. ఈ పాలు నాకెందుకు వెళ్లి ఆ గాన కోకిల ఉంది కదా మీ అత్తవతి ఆవిడకి ఇవ్వు అని అంటాడు. మీకోసం చాలా కష్టపడి పాలని తయారు చేసి తీసుకొచ్చాను తాగితే తాగండి కాకపోతే లేదు అని మీనా బుంగమూతి పెట్టుకుంటుంది.

నువ్వలా బుంగమూతి పెట్టుకోవద్దు మీనా నేను ఏదో అయిపోతాను అని బాలు అంటాడు.. ఇక మేన మీరు నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటారు అనేసి అంటుంది. నా కోరికను తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని మీనా అంటుంది. బొమ్మల కొలువుతో పాటుగా యాగం కూడా బాగా జరిగింది. అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మౌనిక తల్లి కావడం.. ఇకమీదట మీరు ఆ సంజుతో మంచిగా ఉండండి మౌనికని మనం అప్పుడప్పుడు వెళ్లి చూసి వద్దామని అంటుంది మీనా.. నాకు కోపం వచ్చిందని మీనా అనగానే నీకు కోపం పోగొట్టే మంత్రం నా దగ్గర ఉంది కళ్ళు మూసుకొని బాలు అంటాడు.

Advertisement

Also Read : రామరాజు కీలక నిర్ణయం.. సాగర్ కు దిమ్మతిరిగే షాక్.. ఫుల్ జోష్ లో వల్లి..

మీనకు ఒక ముద్దు పెడతాడు.. ఆ తర్వాత మనం కూడా త్వరలోనే పాపను కనాలి. నేను చెప్పాను కదా మౌనిక వాళ్ళ కొడుక్కి మా పాపనివ్వాలి అని బాలు అంటాడు. ఇక ఆ తర్వాత రోహిణి మాత్రం తన ప్లాను ఫెయిల్ అయిందని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక గుణ నీ రంగంలోకి దింపుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో గుణ బాలు ఫోన్ కొట్టేస్తాడేమో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో బాలు వర్సెస్ రోహిణి ఎవరు గెలుస్తారో చూడాలి.. ఇకముందు ఎపిసోడ్లు ఆసక్తిగా మారిన ఉన్నాయని తెలుస్తుంది.. అందుకే అస్సలు మిస్ అవ్వకుండా సీరియల్ ని చూసేయండి..

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×