E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామరాజు కీలక నిర్ణయం.. సాగర్ కు దిమ్మతిరిగే షాక్.. ఫుల్ జోష్ లో వల్లి..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు కీలక నిర్ణయం.. సాగర్ కు దిమ్మతిరిగే షాక్.. ఫుల్ జోష్ లో వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం రామరాజు దగ్గరికి వెళ్లి ఈరోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు అన్నయ్యగారు అని అంటుంది. ఏం చెల్లమ్మ ఏం మాట్లాడుతున్నావ్ ఏం జరిగింది అని రామరాజు అడుగుతాడు.. ఎవరిని ఎప్పుడూ నమ్మలో ఎవరు మనల్ని తెలియకుండానే మోసం చేస్తారు అర్థం కావట్లేదు అన్నయ్యగారు అని నాటకం మొదలుపెడుతుంది. మా ఫ్రెండు ఒక ఆమె ఉద్యోగం ఇచ్చే ఏజెంట్ దగ్గరికి వెళ్ళింది.. అక్కడ ఉద్యోగం డబ్బులతో జరిగిపోతుందట. డబ్బులు కడితే వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చేస్తారని చెప్తుంది. అయితే అక్కడ మన సాగర్ ఫోటోని చూసిందట.. నేను తనకి బుద్ధి లేదు మన సాగర్ అలాంటి పని ఎందుకు చేస్తాడు అని చెప్పాను. కానీ వీడియో పెడతాను అని చెప్పింది అది రాగానే ఒకసారి చూడాలి అని అనుకుంటుంది..

వీడియో రాగానే అది చూసి షాక్ అయినా భాగ్యం.. రామరాజుకి వీడియో చూపించగానే ఆయన కోపంతో ఎలాగైనా సరే సాగర్ మీద రగిలిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. పార్టీకి రాడని అనుకున్న రామరాజు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సంతోషంగా ఉన్నా ఆ పార్టీలోకి రామరాజు రావడంతో ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని వేదవతి అడుగుతుంది. రామరాజు ఎంట్రీ ఇవ్వడంతో పార్టీలోని బంధువులందరూ వెళ్ళిపోతారు. ఉద్యోగాన్ని 25 లక్షలు పెట్టి కొన్నావా నువ్వు అని అడగ్గాని ఒక్కసారిగా నర్మదతో పాటు అందరూ షాక్ అయిపోతారు.. సాగర్ ని రామరాజు ఇంత బుద్ధి తక్కువ పని చేస్తావని కొడతాడు. డబ్బుల గురించి నర్మదా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆ డబ్బులను నా నగలు తాకట్టు పెట్టి కట్టేసాం మావయ్య అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నగలను తాకెట్టు పెట్టి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు..

ఏ రామరాజు ఏం పెంపకం అయ్యా నీది. కొడుకు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత దీనస్థితిలో నువ్వు ఉన్నావా ఏంటి..? అసలు ఎలా పెంచావు నీ కొడుకుల్ని ముగ్గురు మూడు లోకాలు ఉన్నారు. మొన్న నీ కూతురు అమూల్య కూడా శత్రువు బిడ్డ అయినా అతని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఏం పెంపకం అయ్యా నీది అని ప్రసాద్ దారుణంగా మాట్లాడుతాడు. ఒకవైపు నర్మదా ఎంతగా ఆపడానికి ప్రయత్నిస్తున్న కూడా ప్రసాద్ మాత్రం గ్రామ రామారాజును ఏదో ఒకటి అంటూ ఉండడంతో.. ధీరజ్ రెచ్చిపోతాడు..

Advertisement

మా నాన్న గురించి నువ్వు అంత మాట మాట్లాడతావా నీకు ఎంత ధైర్యం అని  ధీరజ్ ప్రసాద్ పై గొడవకి దిగుతాడు.. మధ్యలో కలగజేసుకున్న నర్మదా ఈ గొడవని ఆపండి అని గట్టిగా అరుస్తుంది. శ్రీవల్లి మాత్రం ఈ గొడవ జరుగుతున్నందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను అనుకున్నట్లు ఇన్ని రోజులకి నర్మదా కు బుద్ధి చెప్పే పని వచ్చేసింది అని అనుకుంటుంది. దీనంతటిని రికార్డు చేసి లైవ్ లో పెట్టాలి అప్పుడు అందరు చూసి అవమానిస్తారు అని అనుకుంటుంది.. ఆ తర్వాత ధీరజ్ గొడవ పడుతూ ఉంటే నర్మద వెళ్లి ఆపుతుంది. నీ కొడుకుకి ఎలాంటి అడ్రస్ లేదు నేను ఆ జాబు ఇప్పించాను సంతోషించాల్సింది పోయి ఇలా కొడుతున్నారు ఏంటి అని రామరాజుని ప్రశ్నిస్తాడు ప్రసాద్.

Also Read :దెబ్బలతో చక్రధర్.. కళ్ళు తిరిగిపడిపోయిన అవని.. పల్లవి నిజస్వరూపం బయటపడుతుందా..?

ఆ తర్వాత మీరందరూ నా ఇంటిని కాళీ చేసి వెళ్లిపోండి అని ప్రసాద్ అరుస్తాడు. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు అని అతను వార్నింగ్ ఇస్తాడు దాంతో అందరు కూడా ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి పెద్ద లొల్లి చేస్తారు.. కన్న తండ్రికి తెలియకుండా పాతిక లక్షలు తీసుకున్నావా అని భాగ్యం ఇంకాస్త ఆద్యం పోసేలా మాట్లాడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. రామరాజు షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. రామరాజు సాగర్ ని, నర్మదని ఇంట్లోంచి పంపించేయాలి అని శ్రీవల్లి డిమాండ్ చేస్తుంది.. మరి రామరాజు సాగర్ ఇంట్లోంచి పంపిస్తాడా అన్నది సస్పెన్స్ గా మారుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. ఆ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా మారింది. ఇక ఎలా ఉంటుందో మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×